Monday, August 23, 2010

జరుక్ శాస్త్రి పేరడీలు - ఓ మంచి పుస్తకం

మరొ మంచి పుస్తకం :: జరుక్ శాస్త్రి పేరడీలు

జరుక్ శాస్త్రి అనే జలసూత్రం రుక్మిణీనాధశాస్త్రి గారు చాలా
కలం పేర్లు పెట్టుకున్నారు. వాటిలో కొన్ని తమాషాగా అని
పిస్తాయి. జయంతి కుమారస్వామి, వెల్లటూరి సోమనాధం,
చలికాలం మార్తాండరావు, ఇలాటివన్నమాట ! శ్రీ రుక్మిణీ
నాధశాస్త్రి గారు 1914 సెప్టెంబరు 7న జన్మించారు. 1968
జూలై 20వ తేదీన పరమందించారు. ఈ పుస్తకంలో శ్రీ శ్రీ
మొదలైన వారి రచనలకు అందమైన పేరడీలే కాకుండా
ఆయన కలం నుండి వెలువడిన కవితలు కూడా చోటు చేసు
కున్నాయి. శ్రీ బాపు గీసిన ముఖచిత్రంతో బాటు లోపల బాపు
మార్కు బొమ్మలు అలరిస్తాయి. మచ్చుకు కొన్ని పారడీలను
పరికించండి.
సరదా పాట శిర్షికలొ
మాగాయీ కందిపచ్చడీ
ఆవకాయి పెసరప్పడమూ
తెగిపోయిన పాతచెప్పులూ
పిచ్చాడి ప్రలాపం, కోపం
వైజాగులో కారాకిల్లీ
సామానోయ్ సరదా పాటకు.
ఇక "విశిష్టాద్వైతం" పేరుతో మరో పేరడీ

ఆనందం అంబరమైతే
అనురాగం బంభరమైతే
అనురాగం రెక్కలు చూస్తాం
ఆనందం ముక్కలు చేస్తాం

C,a, t - కేటువి నీవై
R, a , t -రేటుని నేనై
రాతగ్గ కవిత్వం నీవై
పోతగ్గ ప్రభుత్వం నేనై......ఇలా సాగిపోతుంది.

ఈ పుస్తకంలోని జరుక్ శాస్త్రిగారి పారడీలను,కవితలను
ఆస్వాదించాలంటే నవోదయా పబ్లిషర్సు, విజయవాడ
వారు ( శ్రీ ముళ్లపూడి వారు లోగడ ఈ ప్రచురణ సంస్థ పేరును
"నవ్వోదయ" అని చమత్కరించారు ) ప్రచురించిన పుస్తకాన్ని
నేడే సంపాదించు " కొనండి "

2 comments:

  1. ఓహ్ జరుకు శాస్త్రిగరి పేరడీలా...భలే ఉంటాయి.

    ఒకసారి ఆయననెవరో మీ ఇంటిపేరు జలసూత్రం అని ఎందుకు అవ్చ్చింది అని అడిగితే H2O formula కనిపెట్టింది మా వంశీకులే అన్నారట :)
    ఆయన హాస్య చతురత అద్భుతం. ఈ పుస్తకం గురించి తెలియజేసినందుకు కృతజ్ఞతలు!

    ReplyDelete
  2. హాస్యానికి మంచి 'జర్క్' నిచ్చిన జరుక్ శాస్త్రి గారిని మళ్ళీ గుర్తుకుతెచ్చారు..మీకు నెనరులు.

    ReplyDelete