Thursday, August 19, 2010

అక్కయ్యతో ఆటవిడుపు !





సరోజిని అక్కయ్య చేసిన బొమ్మలు!

ఈ ఫొటోలో మొదట లంగాపై గౌను వేసుకొని కూర్చున్నది
మా అక్కయ్య. సరోజిని. మధ్యలో నిలుచున్నది నేను. ఆ
ప్రక్క వున్నది చెల్లాయి కస్తూరి. మొగపిల్లవాడిలా నిక్కరు,
చొక్కావేసుకున్నమరో ఫొటో అక్కయ్యదే. ఇప్పుడు అక్కయ్య
వయసు 73 ఏళ్ళు. ఐనా ఎంతో యాక్టివ్ గా వుంటుంది.
చిన్నప్పటినుంచి అక్కయ్యకు సినిమాలంటే చాలా ఇష్టం
భానుమతి అభిమాన నటి. చదివిన కధ ఐనా, చూసిన
సినిమా కధ ఐనా చాలా వివరంగా చెప్పేస్తుంది. ఇక రక
రకాల వంటలు ,పిండి వంటలు అద్భుతంగా చేస్తుంది.
కోడలికి వంటలో సహాయం ,సలహాలు ఇస్తూ ఎప్పుడూ
బిజీగా వుంటూ తీరిక దొరికినప్పుడల్లా రకరకాల బొమ్మలు
చేస్తుంటుంది. మిగిలిపోయిన సబ్బు ముక్కలను
జాగ్రత్త చేసి వాటి తో రకరకాల పువ్వులను చేసింది. మల్లె
మొగ్గలను వాసన చూస్తే అచ్చు మల్లెల వాసన వస్తాయి.
జాస్మిన్ వాసనవచ్చే సబ్బు ముక్కలతో వాటిని చేసింది.
అలానే ధర్మొకూల్ తో అపార్ట్మెంట్ బొమ్మలు , మొదలైనవి
చేసింది. మూడు రోజుల క్రితం నే వైజాగ్ వెళ్లినప్పుడు, "అబ్బాయ్!
చూడరా ఈ సబ్బుల పూలు " అని చూపించింది. వీటిని ఫొటొ
తీసి నా బ్లాగర్ మితృలందరికి చూపిస్తా అని అక్కయ్యకు
చెప్పి మీ కందరికీ చూపిస్తున్నాను. మా అక్కయ్యకు ఇద్దరు
అబ్బాయిలు. పెద్దవాడువిజయ భాస్కర్ అడ్వకేట్. కొంత కాలం
ETVలో లీగల్ అడ్వయిజర్ గా పనిచేశాడు. రెండో వాడు మోహన్
వైజాగ్ SBI ZONAL OFFICEలో ఆఫీసర్ గా పనిచేస్తున్నాడు.
మా బావగారు SBI లో పదవీవిరమణ చేసి వైజాగులో సెటిల్
అయ్యారు. చెల్లాయి కస్తూరి ( హైద్రాబాద్) పదేళ్ళవయసులోనే
"నేనూ, మా సంగీతం మాష్టారు" అన్న బొమ్మ 1954 ఆంధ్ర వార
పత్రికలో వేసి బహుమతి గెలుచుకొంది.

No comments:

Post a Comment