Thursday, August 12, 2010

పురాణ కాలక్షేపం !!

దేముడనేవాడున్నాడా అని మనిషికి కలిగెను సందేహం అన్న
పాట విన్నట్లు గుర్తు ఈ మధ్యే ఒక మితృడు మన దేశంలో
ఇంత మంది భక్తులున్నారు. ఒకరికైనా ఆయన దర్శనం
ఇచ్చాడా ఆనిi ఆడిగాడు.పైగా ఇంకో మాట కూడా అన్నాడు.
దేముడున్నాడని అంటుంటావు కదా నువ్వు తరచు గుడికి
వెళ్ళినట్లు ,రోజూ ఇంట్లో పూజలు చేస్తున్నట్లు కనిపించలేదు
అన్నాడు. నిజమే, నేను గుళ్లకు వెళ్ళి చాలాకాలమయింది.
ఐనా నేను దేముణ్ణి నమ్ముతాను. నాకు పూజలు చేయటం
చిన్నప్పటి నుంచి అలవాటు కాలేదు. మా నాన్నగారు
ఉదయం 9 గంటలకల్లా బ్యాంకుకు వెళ్ళాల్సి వుండటం వల్ల
ఆయనకు పూజలు చేసుకోవటానికి టైము వుండేది కాదు.
ఒక్క వినాయకచవితికి మాత్రమే మా చేత వ్రతకల్పం చదివింఛి
పూజ ఛేయించే వారు. నన్ను పంచే కట్టుకోమనే వారు. అదొక్కటే
నాకు ఇష్టం ఉండేది కాదు. ఇప్పటికీ నాకు పంచె కట్టుకోవడం
రాదు. శుభ కార్యాలప్పుడు మా బావో, లేకపొతే పౌరోహితులో
కడతారు. చాలా మందిమితృలకు ఉదయం పూట ఫోను చేస్తే
పూజలో ఉన్నారండీ అని వాళ్ళ శ్రిమతి గార్ల నుంచి జవాబొస్తుంది.
నేను దేముణ్ణి ప్రతి రోజూ చూస్తూనే ఉంటాను. సూర్యోదయం
వేళ ఆకాశంలో, బాపూగారి బొమ్మలో, మంచి పుస్తకాల్లో , మాయా
బజార్ లాంటి సినిమాల్లో, ఘంటసాల, సుబ్బులక్ష్మి, సుశీల, జానకి,
బాలసరస్వతి మొదలైన వాళ్ళ పాటలు వింటున్నప్పుడు నాకు
దేముడు అగుపిస్తూనే ఉంటాడు. మనం చేసే తప్పులను దేముడు
అనుక్షణం గమనిస్తూనే ఉంటాడు.తప్పుడు పనులు చేస్తూ , అడ్డ దారుల్లో
డబ్బును సంపాదిస్తూ గుడికి వేళ్ళి ఓ దండం పెడితే పొంగిపోయి వరాలిచ్చే
అమాయకుడు కాదు దేముడు. గుళ్ళొను ప్రవర్తన బాగుంటుందా! క్యూలో
నిలబడిన పెద్ద వాళ్ళను తోసుకుంటూ ముందుకు వెళతారు.
ఇంకో విషయం గమనించారా. దేముడికి సంబంధించిన మాటలను
వ్యతిరేక భావాలను తెలియజేయడానికి మనం వాడటం మీరు గమనించే
ఉంటారు. ఎవరైనా ఒకడిని తిట్టారనుకోండి. వాడికి " అక్షింతలు " బాగా
పడ్డాయి అంటారు. మోసం చేస్తే " శఠగోపం " పెట్టాడు అంటారు. లేకపోతే
" పంగ నామాలు " పెట్టారంటారు. లంచం ఇచ్చి " ముడుపులు " చెల్లించా
మంటారు. డబ్బును దుర్వినియోగం చెస్తే " మంగళహారతి" పాడాడంటారు.
ఇక మన రాజకీయనాయకులు, కాసుకో నీ " పురాణం " విప్పుతా అంటూ
ఒకరినిఒకరు బెదరించుకొంటారు. తాగు బోతులను వాడు ఎప్పుడూ " పూజ "
లోనే ఉంటారు అంటారు. ఇక తిరుమలతో సహా దేవలయాల్లో జరుగుతున్న
అవినీతికి అంతే లేదు. వీటన్నిటినీ దేముడు గమనిస్తూనే ఉంటాడు. స్వర్గం
నరకం ఎక్కడో లేవు. సమయం చూసి భవంతుడు శిక్షించడం మనం చూస్తూ
నే ఉన్నాం. ఇక నా పురాణకాలక్షేపానికి స్వస్తి.






!





No comments:

Post a Comment