Wednesday, October 06, 2010

మహానటుడు గోవిందరాజు సుబ్బారావు




ఈ తరం వారికి తెలియకపోవచ్చుగాని నటుడు గోవిందరాజు
సుబ్బారావు గారు "కన్యాశుల్కం" చిత్రంలో లుబ్ధావధాన్ల
పాత్రనభియించిన తీరు మరచిపోలేము. మరో విశేషమేమిటంటే
రంగ స్థలంమీద కన్యాశుల్కం నాటకంలో ఆయన గిరీశం పాత్రను
ధరించేవారట! నటుడిగానే కాకుండా శ్రీ సుబ్బారావు ఆర్ యంయస్
చదివి డాక్టరు గా ప్రాక్టీస్ చేశారు. అంతేకాదు ఆయన అణువిజ్ఞానం
చదివి ఐన్ స్టీన్ తో ఉత్తరప్రత్యుత్తరాలు కొనసాగించారు! ఇంగ్లీష్ లో
"ఇనార్గానిక్ ఇవల్యూషన్" పేరిట ఓ పుస్తకం రచించారు.
"ప్రతాపరుద్రీయం" నాటకంలో యుగంధరుడిగా ,పిచ్చివానిగా
అభినయించి నాటక రచయిత వేదం వేంకటశాస్త్రి గారిచే ప్రసంసలు
పొందారు. ఆయన ఎంతటి ప్రతిభగల నటుడో తెలుసుకోవాలంటే
వినోదా వారి "కన్యాశుల్కం" సీడీని తెలుగువారు ప్రతి ఒక్కరు
ఒక్కసారైనా చూసి తీరాలి. 1895 లో జన్మించిన శ్రీ గోవిందరాజు
సుబ్బారావు గారు అక్టోబరు 29, 1959 లో దివంగతులయ్యారు.
శ్రీ సుబ్బారావు గారి గురించి తన "బ్లాక్ అండ్ వైట్" పుస్తకంలో
ప్రముఖ నటులు శ్రీ రావి కొండల రావుగారు కొన్ని ఆసక్తికర
విషయాలు వ్రాసారు. గోవిందరాజు గారి మొదటి సినిమా"మాలపిల్ల".
ఆ పాత్ర ఆహార్యం కోసం జుట్టు,మీసం కత్తిరించుకోడానికి ఆయన
ససేమిరా అన్నారట. దర్శకులు రామబ్రహ్మం గారు, ఇతరులు
బలవంతమ్ చేసి ఒప్పిస్తే తల్లిగారి అనుమతి తీసుకొని చివరికి
ఒప్పుకున్నారట."మాలపిల్ల." లో సుందరరామశాస్త్రి,"బాలనాగమ్మ"
లో మాయలమరాఠీ,"షావుకారు"లో చంగయ్య,"కన్యాశుల్కం"లో
లుబ్దావధానులు, ఇలా ఏ పాత్రకూ పోలికలేదు. ఈ విభిన్న పాత్రలు
సునాయాసంగా ధరించి శ్రీ గోవిందరాజు సుబ్బారావు చలనచిత్ర
ఆకాశంలో ధృవతారగా నిలిచారు. ఆయన ఇంటి పేరు సినిమాలలో
గోవిందరాజుల అని వ్రాసేవారు. గోవిందరాజు సరైన పేరు, బహుశ:
నన్ను వాళ్ళు ఎక్కువ గౌరవిస్తున్న సూచనగా "ల" చేర్చారేమో
అని చమత్కరించే వారట.

8 comments:

  1. Avunadi. Aayana Goppa Natudu. Guna Sunadari Katha lo kuda chala baga chesadu (chestaru mari, K.V Reddy garu atuvanti natulane teesukunraru...)

    ReplyDelete
  2. గురువుగారూ, పల్నాటి యుధ్ధం (ఇంకా పాతది) లో నాగమ్మగా కన్నాంబ, బ్రహ్మ నాయుడుగా గోవిందరాజుల సుబ్బారావుగారు. ఇద్దరూ ఇద్దరే. అద్భుతమైన నటన. పోటీలుపడి నటించారు. కాని దురదృష్టవశాత్తూ, పల్నాటి యుధ్ధం సి.డి మార్కెట్టులో దొరకటంలేదు. ఎప్పుడో డి డి-8 వాళ్ళు వేసినట్టు జ్ఞాపకం. మీకు తెలిసి ఈ సిడిగాని డివిడి గాని దొరుకుతుంటే చెప్పండి.

    ReplyDelete
  3. ఫోటో చూడగానే లుబ్ధావదాన్లుగారిని పోల్చుకున్నానండీ. నేను ఇంజనీరింగ్ చదివేరోజుల్లో వైజాగ్ పూర్ణామార్కెట్ లోని పూర్ణా థియేటర్ లో మళ్ళీ రిలీజ్ చేసిన కన్యాశుల్కం చూసే భాగ్యం కలిగింది. ఓహో ఈయనెవరో చాలా బాగా చేశారు అనుకోవడం మినహా వీరిగురించిన వివరాలు ఏమీ తెలియవు. ఇప్పుడు మీరు తెలియజేసినందుకు నెనర్లు.

    ReplyDelete
  4. Pls let me know where Vinoda's CD is available.

    Regards.

    ReplyDelete
  5. మాధురి గారు,శుభోదయం. "కన్యాశుల్కం" విసీడీ
    గురించి వివరాలు: SHALIMAR ENTERPRISES,
    4-4-303, Bank Street,Koti,HYDERABAD-500
    095. Phone: 040-24650557 ఏ ప్రముఖ వీడియో
    షాపుల్లోనైనా దొరుకుతుంది. విసీడీ ఖరీదు Rs.75/-
    మూడు సీడీలు వుంటాయి. నా దగ్గర విసిడి మాత్రమె
    వుంది. డివీడిలు కూడా దొరకవచ్చు.

    ReplyDelete
  6. నాకు గోవిందరాజు సుబ్బారావు గారంటే చాలా ఇష్టమండీ. గుణసుందరి కథలో ఆయన పాత్రలో ఎంత లీనమయిపోతారంటే చంపేస్తున్నాడురా ఈ ముసలి రాజు అని మన చేత అనిపిస్తారు. లుబ్ధావధానుల పాత్రకి ఆయన తప్ప వేరెవరూ న్యాయం చేయలేరు. అలగే షావుకారు సినిమాలో షావుకారు దర్పం, పొగరు, మారిన తరువాత ఆయన ఉదారత్వం...భలే ఉంటుంది.

    ReplyDelete
  7. గోవింద రాజుల సుబ్బరావు గారి నటన కన్యాశుల్కం లో చూసి తీరాలి. మీ బ్లాగ్ మూలకంగా మళ్ళ ఆ మహానుభావుడిని గురించి తలుచుకోవటం జరిగింది సార్ !

    ReplyDelete