Friday, October 15, 2010

ఉత్త (మ) నటుడు?!

మన తెలుగు సినిమాలకు ఎప్పటిలానే నందుల బహుమతులు
ప్రకటించారు. ఒక తెలుగు సినిమాకు దాదాపు తొమ్మిది నందులు
వచ్చినా అభిమానులు తృప్తి చెందలేదు. ఇందుకు న్యాయనిర్ణేతలను
అభినందించడానికి బదులు విమర్శించారు. అత్యధిక నందులు
పొందిన సినిమాలోని హీరోకు ఉత్తమనటుడు ఎవార్డ్ ఇవ్వలేదని
ఆగ్రహించారు. మా హీరో సినిమా ఎన్నో రోజులు ఆడింది, రికార్డు
కలెక్షన్లు వసూలు చేసింది.హీరో ఫైట్లు, డాన్సులు చేసాడు, మరి
ఇవ్వక పోవడం అన్యాయం కదా అని వాళ్ళ వాదన. దీనికి మన
కొన్ని న్యూస్ "సెన్స్” " చా"నెళ్ళు డిస్కషెన్స్ అంటూ మరింత రెచ్చ
గొట్టాయి. ఇలా చర్చించే బదులు, ఉత్తమ నటుడి ఎన్నికకు, సినిమా
విజయానికి సంబంధం లేదని, నటనకే ప్రాముఖ్యమిస్తారని కొందరు
న్యాయనిర్ణేతల చేత అర్ధమయేటట్లు చెప్పిస్తే అభిమానులూ అర్ధం
తప్పక చేసుకుంటారు. చర్చల పేర రెచ్చగొట్టటమే కాకుండా సినిమా
వాళ్ల మధ్య లేనిపోని గొడవలు సృష్ఠించడం అనవసరం. "బాటసారి"
సినిమా విజయవంతం కాలేదు. ఐనా అందులో అద్భుతంగా నటించిన
అక్కినేని ఉత్తమ నటుడిగా ఎన్నికవలేదా? పూర్వం మద్రాసు ఫిలిం
ఫాన్స్ అసోషియేషన్ వారు ఏటేటా దక్షిణభారత చిత్రాలకు అన్ని శాఖలకు
ఉత్తములను ఎన్నుకొనే వారు. ఆ రోజుల్లో ఇలా గొడవలు జరిగిన
సంఘటనలు లేవు. మరో మాట. ఇప్పుడు మనకున్నది "స్టార్స్" తప్ప
"యాక్టర్స్" ఎక్కడ వున్నారు చెప్పండి. బహుశ: కమలహాసన్ ఒక్కడే
నేమో, మన దక్షిణ భారత చిత్రాలలో, ఈ తరం నటుల్లో! మన హీరోలు
కూడా "మంచి" నటనకు అవకాశం ఉండే సినిమాల్లోఒకటైనా నటించి ఉత్త
నటులుగా గాక, ఉత్తమ నటులుగా తప్పక రాణిస్తారని ఆశిద్దాం,ఆశ్వీరదిద్దాం !!
ఇప్పటి సినిమాల తీరు తెన్నుల పై శ్రీ బాపు గీసిన పై కార్టూన్ "స్వాతి"
సపరి వార పత్రిక సౌజన్యంతో.
.

4 comments:

  1. sir, meeru aapadbandhavudu cinema chusara sir. chusi vuntey, south lo kamal asan tappa natulu leru anevallu kaadu

    ReplyDelete
  2. .అజయ్ కుమార్ గారు,మీరపార్ధం చేసుకున్నారనుకుంటాను. .
    నేనన్నది ఈ తరం హీరోల గురించి. ఇక కమల్ హాసన్ ఇప్పటికీ
    తన ప్రతి చిత్రంలోనూ నటనలో ప్రత్యేకతను చూపిస్తూనే వున్నాడు.
    మన హీరోలు ఏడాదికి ఒకటైనా , తమ నటనా ప్రతిభను చాటుకొనే
    చిత్రాలలో నటించాలని నా ఆశ.

    ReplyDelete
  3. కమల్ హాసన్ నటనలో ఏమన్నా విశేషం ఉందంటున్నారా?
    నమ్మలేను.

    ReplyDelete
  4. I like kamal, sir, u r right. Kamal is the best.

    ReplyDelete