పిల్లల సినిమాలు తెలుగులో ఎక్కువ రావడం లేదు అంటారు
కానీ ఏ నాడో "భక్తధృవ" అనే పౌరాణిక సినిమా పూర్తిగా బాలల
తొ నిర్మించారట. 1954 లో పూర్తిగా "బాలానందం"పేరుతో బాలలతో
మూడు కధలతో ప్రకాశ్ ప్రొడక్షన్ బేనరుపై "రాజయోగం",
"బూరెలమూకుడు", "కొంటె క్రిస్టయ్య" పేరిట ఒక్కోకధ గంట
వుండేటట్లు నిర్మించారు. దీని నిర్మాత దర్శకుడు ఒక నాటి
హీరో ఐన కోవెలమూడి సూర్య ప్రకాశరావు. ఈయనే సూపర్
హిట్ మూవీ "ప్రేమనగర్" చిత్ర దర్శకుడు, డైరెక్టర్ రాఘవేంద్ర
రావు గారి తండ్రి.. "బాల" పత్రిక సంపాదకులు, రేడియో అన్నయ్య,
అక్కయ్యలు గా పేరుపొందిన న్యాయపతి రాఘవరావు, కామేశ్వరి
దంపతుల సారధ్యంలో ఈ చిత్రం రూపుదిద్దుకొంది.ఇందులోని
పిల్లలంతా బడికి వెళ్ళే బాలలు, బాలానంద సంఘ బాలలే!
1952 లో వచ్చిన విజయావారి" పెళ్ళి చేసి చూడు" సినిమాలో
బాలనటులుగా పేరుపొందిన మాస్టర్ కుందు,కందామోహన్
(ఈయనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చీఫ్ సెక్రటరీగా పని చేసిన కందా
మోహన్ I.A.S) ఈ చిత్రం లో నటించారు. బాలానందం పేరుతో
వచ్చిన ఈ సినిమాలోని మూడుకధలు మూడు విభిన్న కధలు.
ఇందులోని రాజయోగం కధ .చిలుక శాపవిముక్తి పొందడం,లాంటి
కధాంశంతొ పిల్లలకు ఆసక్తికరమైన జానపద కధ.ఇందులో హీరోగా
రేలంగి గారి అబ్బాయి సత్యనారాయణబాబు నటించాడు.ఈ మూడు
సినిమా కధలలోని ఎనిమిది పాటలను రాఘవరావుదంపతులు,
ఆరుద్ర రచించారు.ఈ సినిమాలోని "పళ్ళోయమ్మ పళ్ళు" పాటకు
నటించినది, ఆ నాటి బాల తార నిడదవోలు జోగాబాయి.ఈమె ప్రసిద్ధ
నటి జయసుధ తల్లిగారు!. తెలుగు వారి దౌర్భాగ్యం ఏమోకాని(తోటి
తెలుగువాళ్ళు నన్ను క్షమించాలి) ఈ సినిమా మళ్ళీ విడుదల
అవటంగాని, విసీడీల రూపంలో విడుదలవటం గాని జరగలేదు..
పాత హింది చిత్రాల సిడీలు మంచి క్వాలిటీతో దొరుకుతుంటే మన
సినిమాలు దొరకటంలెదు సరికదా, దొరికినవి ఐనా క్వాలిటి బాగుండటం
లెదు.ఈ సినిమా రిలీజయినప్పుడు నా వయసు 13 ఏళ్ళు! పెద్దయ్యాక
ఆ సినిమా మా పిల్లలకు చూపించలేక పోయానని ఇప్పటికీ బాధ
పడుతుంటాను. ఇందులోని బొమ్మలు భరాగో గారి "మరోనూట
పదహార్లు"సౌజన్యంతో, మీ ముందు వుంచుతున్నాను.
బాలానందం సినిమా గురించి ముందెపుడూ వినలేదు. తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. VHSలో నైనా దొరికే అవకాశం లేదాండి.
ReplyDeleteవిజయవర్ధన్ గారూ, ఆసలు ఆ సినిమా నెగటివ్ కూడా
ReplyDeleteవుండి వుండదనుకుంటాను.చిల్డ్రన్ ఫిలిం సొసైటీ వద్ద
వుందేమో. "రచన" శాయి గారిని అడగాలనుకుంటు
న్నాను.హైద్రాబాదులోని ఆంధ్రబాలానంద సంఘంవారిని
అడగమని శ్రీ శాయిగారికి ఈ రోజే చెబుతాను.
Pls keep us posted about the availability of these children's films.
ReplyDeleteఈ సినిమాలో న్యాపతి కామేశ్వరి గారు రాసిన పాట ఏదో తెలిస్తే ఎవరైనా సమాచారం ఇవ్వగలరు ప్లీజ్
ReplyDelete