Monday, October 04, 2010

చందమామ ఆర్ట్ బుక్ I & II




చందమామ ఆర్ట్ బుక్ పేరిట రెండు వాల్యూములుగా
మంచి ఆర్ట్ పేపరు పై చందమామ చిత్రకారులు యమ్.
టీ.వీ.ఆచార్య,చిత్ర, శంకర్, వడ్డాది చిత్రించిన వర్ణచిత్రాలతొ
ఏర్చి కూర్చిన అద్భుత చిత్రాలను చందమామ సంస్థ
ప్రచురించింది.చందమామ ప్రియులంతా స్వంతం చేసు
కోవలిసిన ఈ మంచి పుస్తకం.ఖరీదు పదిహేను వందల
రూపాయలైనా ఇందులోని బొమ్మలు చూసిన తరువాత
ఖరీదు విషయం వెంటనే మరచిపోతాము.
10"X12" పెద్ద సైజులో పూర్తి ఆర్ట్ పేపరు పై రంగుల్లో
ఒక్కొక్కటి185 పేజీలతో రెండు వాల్యూములుగా ఈ పుస్తకం
మంచి బైండింగ్ తో వెలువడింది, ఒక పుస్తకం వెనుకవైపు,
మరో వాల్యుమ్ ముందు వైపు ప్రక్క ప్రక్కన వుంచితే
శ్రీ శంకర్ వేసిన దుప్పి బొమ్మ అందంగా అగుపించడం
ఇక్కడి ఫొటోలో మీరు చూడొచ్చు.ధరలాగానే పుస్తకాలు
కూడా చేతికి చాలా బరువుగా వున్నాయి.టేబుల్ మీద
వుంచి చూడాలి,చదవాలి. రామాయణ,భారత,భాగవత
గాధల ఆనాటి (1954నుండి)ముఖచిత్రాలతో బాటు చిత్రా
చిత్రించిన అట్టచివరి బొమ్మలు,(యూలిసెస్,గౌతమ బుద్ధుడు)
ప్రత్యేకంగా అలరిస్తాయి.రెండవ వాల్యూములో వడ్డాది బొమ్మలతో
బాటు ఒకే ఘట్టానికి ఇద్దరు వేర్వేరు ఆర్టిస్టులు చిత్రిస్తే ఎలా
వుంటుందో కంపారిజన్ అన్న పేజీలలొ చూపించడం చాలా
మంచి ప్రయోగం.మొదటి ఫొటో 1953 నుండి ఈ నాటి వరకు
చందమామలో చిత్రాలు గీస్తున్న శ్రీ శంకర్.

2 comments:

  1. అప్పారావు గారూ, క్షమించాలి. ఆలస్యంగా చూస్తున్నాను. చందమామ ఆర్ట్ బుక్ గురించి బ్లాగులలో పరిచయం చేయడం మీతోనే మొదలనుకుంటాను. మీ ప్రశంసలకు పాత్రమయిందంటే ఆర్ట్‌బుక్ ముద్రణ సఫలీకృతమైనట్లే. మరింత క్వాలిటీ స్కానింగ్ చేయించి ఫినిషింగ్ టచ్‌లో మరి కాస్త జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ అరుదైన పుస్తకం మరింత ప్రామాణికతను సంతరించుకుని ఉండేది. అయినా ఫర్వాలేదు. చందమామ మేటి చిత్రకారుల అపురూప చిత్ర సంపదను తొలిసారిగా పెద్ద సైజులో చందమామ అభిమానులు, రూ.1500లు డబ్బు పెట్టి కొనగలిగిన వారు చూడగలిగే అవకాశం వచ్చింది. నిజం చెప్పాలంటే ఇంత భారీ సైజులో 60 సంవత్సరాల కాలం పొడవునా చందమామను వెలుగొందించిన మేటి చిత్రాలను ప్రింట్ చేయడమే ఒక అధ్భుతమనుకోండి. మార్కెట్, లాభాపేక్ష దృక్పధం ఉన్నప్పటికీ, మామూలు అభిమానులు భయపడి పారిపోయేంత ఎక్కువ ధర పెట్టినప్పటికీ ఆర్ట్ బుక్ 1, 2 భాగాలు జీవిత కాలం దాచుకుని భద్రపర్చుకోవలసిన అపరూప పుస్తకం అనడంలో సందేహం లేదు.

    ఈ రెండు పుస్తకాల బరువు అక్షరాలా 2 కేజీల 750 గ్రాములు. మంచి పరిచయం చేసినందుకు అభినందనలు.

    ReplyDelete
  2. బాబోయ్! ఇంత దాకా నేను ఈ బ్లాగ్ చూ డలేదేమిటి? నేను మీకు ఫ్యాన్ అయిపోయాను సార్!

    ReplyDelete