Wednesday, October 27, 2010

తెగులు జాతిమనది! నిండుగ మునుగు జాతి మనది !!

ఈ శీర్షికను చదివి కొందరు తెలుగు వాళ్ళు నాపై
కోపగించుకోవచ్చు.వీడికి ఇదేమి తెగులని,తెలుగు వాళ్ళని
ఇలా అవమానిస్తాడా అనీ అనుకోవచ్చు. కానీ మన (వి)
నాయకులు మన రాజధానిలోని "తెలుగు లలిత కళాతోరణం"
లోని తెలుగు అన్న పదాన్ని తొలగించి దానికి "రాజీవ్ లలిత
కళాతోరణం" అని నామకరణం చేయాలని నిర్ణయించి
నప్పుడు ,కనీసం మనసులోనైనా బాధ పడ్డ తెలుగువాళ్ళు
ఎంతోమంది వుంటారు! "గాయం" సినిమాలో సిరివెన్నెల
"నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాల్ని" అన్న పాట వ్రాసారు.
కానీ అయన "జనాల్ని" అన్న పదం ముందు "తెలుగు" అన్న
పదాన్ని చేరిస్తే బాగుండేది. ఏమంటే జనాలు అనగానే
దేశం లోని అన్ని రాష్ట్రప్రజలూ వస్తారు. భాష పేరును
తొలగించే సాహసం మరో ఏ రాష్ట్రంలోనైనా చేస్తారా!! మన
పిల్లలకే తెలుగు పూర్తిగా రాదు. ఇక వాళ్ళ పిల్లలకు తెలుగేం
తెలుసు, తెలుగంటె వాళ్ళకు అలుసు తప్ప!. కొన్ని స్కూళ్ళల్లో
తెలుగు మాట్లాడారని పిల్లల్ని శిక్షిస్తే మన చానళ్ళు హడావిడీ
చేశాయి. మనకుఅలవాటే. మనం,ఆ చానల్లు ఆ విషయాన్ని,
తరువాత ఏం జరిగిందో అప్పుడే మర్చే పోయాం తెలుగుదేశం
హయాం లో ఎన్టీఆర్ తెలుగు పేర్లు పెడితే "తెలుగుతెగులు"
అని మనవాళ్ళే గేళి చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా
వుండగా కోనసీమ ప్రాంతంలోని అక్విడెక్ట్ కు డోక్కా సీతమ్మ
గారి పేరు పెట్టారు. నెహ్రూ ప్రారంభించిన నాగార్జున డామ్
అదే పెరుతోవుంది. ఏమో డామ్ పేరునూ మార్చినా ఆశ్చర్య
పోనవసరం లేదు. ఇప్పటికే పనులు పూర్తిగా ప్రారంభించని
పోలవరం ప్రాజెక్ట్ ను ఇందిరా సాగర్ అని పిలవడం మొదలయింది.
ఓ డామ్ పేరు వింటే అది ఏ ప్రాంతంలో వుందో తెలియవలిసిన
అవసరం లేదా? గోదావరిపై రాజమండ్రి లో నిర్మిస్తున్న మూడవ
వంతెనకు రాజీవ్ పేరు తగిలించారు. అంతదాకా ఎందుకు, రాజమండ్రి
ని "రాజీవమండ్రి" అని పేరు మార్చితే ఓ పనైపోతుంది.!! తెలుగుప్రజలందరం
ఏకమై ఇకనైనా మేలుకొని తెలుగు భాషను కాపాడుకొందాం!లేకుంటే
"తెలుగుజాతి మనదీ నిండుగ వెలుగు జాతి మనదీ"అని కనీసం
పాడుకోడానికైనా "తెలుగు" మిగిలి వుండదేమో,మన తెలుగు వాళ్ళకు!!

5 comments:

  1. అది మన దౌర్భాగ్యం.

    "రాజీవమండ్రి" పేరు బాగుంది, కాని నేను ఒప్పుకోను మా ఊరి పేరు మారిస్తె.

    ReplyDelete
  2. రాజీవ్ పదాన్ని రాష్ట్రంలో 20ఏళ్ళపాటు నిషేధించాలి.

    ReplyDelete
  3. This comment has been removed by the author.

    ReplyDelete
  4. Andhra,urgently needs a party like Shiva Sena(In Mumbai)to check all this stupid activities.

    Mattegunta Nagalakshmi

    ReplyDelete
  5. అసెంబ్లీ రౌడీ సినిమాలో విలన్ ఊరిలోని దుకాణాలన్నిటికీ తన పేరు పెట్టించడం చూసినప్పుడు అది సినిమా, కేవలం స్టోరీ కోసం అలా చూపించారు అనుకున్నాను. అలాంటి తెలివి తక్కువ పనులు చేసేవాళ్లు నిజ జీవితంలో ఉంటారనుకోలేదు.

    ReplyDelete