జ్యోతి గారు బ్లాగులో వంటలు వ్రాయమంటూ అడిగితే , నేను రెడీ అవుతుంటే
మీకు కూరలు తరగడంతప్ప చేయడం రాదు గదా అంది నా శ్రీమతి. అదేమిటో
నా కంప్యూటర్ కూడా ఆవిడకు తోడుగా నిలచి, హార్డ్ డిస్క్ ఫట్ మంది! ఎలా
ఐతేనేం, ఓ వారం రోజులకు కంప్యూటర్ బాగై , బ్లాగు రాయటానికి రెడీ అయ్యాక\
ఏమైనా సరే, నాకు బాగా ఇష్టమైన కాకరకాయ గుత్తి కూర రాయాలనిపించింది.
ధైర్యంచేసి మీకా వంట చెప్పేస్తున్నాను. స్వయంగా నే చేసి చూసి మా ఆవిడ
పద్మ చేత WOW అని టీవీల్లో లా అనిపించుకొని మీకు చెబుతున్నా!
ముందుగా చిన్న సైజు కీకరకాయలు, సారీ కాకరకాయలు తీసుకొని చాకుతో
మధ్యలో పొడువుగా చీల్చాలి. బాండీలో ( బాణాలీ/బూర్లెమూకుడు) వాటిని వుంచి
కొద్దిగా నీరు, కొంచెం చింతపండు పులుసు, కొచెం ఉప్పు చేర్చి మూతపెట్టి కొద్ది
సేపు సన్నని సెగపై వుంచి దింపాలి. కాయలు మరీ మెత్తగా ఉడకకూడదు.
మగ్గాలంతే. తరువాత తీసి వెల్లుల్లికారం కూరి నూనెలో వేయించాలి. కొద్దిగా
అలా వుడికించడంవల్ల కూరిన కారం బైటకు పోదు, కాకర చేదు అనిపించదు.
చాలా రుచిగా వుంటాయ్!. ఇది అందరికీ తెలిసే వుంటుంది, గొప్పగా చెప్పాలా?
అని శ్రీమతి అన్నా , నే స్వయంగా నేర్చుకున్నది కనుక, నిజంగా గర్వంగా
వుంది.
ఇక్కడ వంట చేస్తున్నచిన్నది మా రెండో అమ్మాయి మాధవి పాప
చిii జోషిత ,బొంబాయి. ఇక్కడకొచ్చినప్పుడల్లా వంటిట్లోకి చేరి వంట చేస్తానని
గొడవ చేస్తుంది. గత మే నెలలో నే తీసిన ఫొటో. నే వండిన కాకరకాయ గుత్తికూర
ఫొటొలు, టీవీ వంటలపై నా కార్టూన్ .
This is my all time favorite!
ReplyDeleteఆ వేగిన కాకరకాయలు చూస్తుంటేనే అర్జెంట్ గా ఆకలేస్తోందండీ! వనభోజనాల్లో మీకే నా వోటు! అసలే నేను కాకరకాయ వీరాభిమానిని!
మీ కార్టూను మరీ అద్భుతంగా ఉంది కూరతో పోటీ పడుతూ!
ఓహ్ కాకరకాయ గుత్తి కూర నాకు చాలా ఇష్టం. అసలు కాకరకాయే ఇష్టం లెండి. కాకపొతే మా ఇంట్లో వెల్లుల్లి కారం మాత్రమే కాకుందా అప్పుడప్పుడు ఆ కారంతో పాటు శెనగపిండి కూడా పెట్టుకుంటాం. అప్పుడు కాస్త పకోడీలలా వేగుతాయి. బలే రుచిగా ఉంటుందిలెండి.
ReplyDeleteమీ కార్టూను సూపరు!
super!
ReplyDeleteనా కాకరకాయ గుత్తి కూర మీ అందరికీ బ్లాగున్నందుకు
ReplyDeleteధన్యవాదాలండీ!
సుజాతగారు, అ.సౌమ్యగార్ల భావాలలో ఎక్కడో నాకు పోలిక కనబడింది. అయితే టేస్టులు కూడా ఒకటేనన్నమాట. బాగుంది.
ReplyDelete