Saturday, December 11, 2010

సినీ పబ్లిసిటీకి బాపు బొమ్మలు !!


గత చిత్రాలలో హాస్య సన్నివేశాలు, వాటిలోని పాత్రలు కధనంలో మిలితమయి
వుండేవి. సినిమా చూసి ఇంటికి వచ్చాక ఆ దృశ్యాలను గుర్తుకు తెచ్చుకొని
నవ్వికొనే వాళ్ళం! ఆ నవ్వుల ఘట్టాలు కలకాలం గుర్తుండిపోయేవి. వాటి
కోసమే సినిమాలకు రిపీటెడ్ ఆడియన్స్ హాల్ల ముందు బారులు తీరే వారు.
ఇప్పటి సినిమాల్లో శృంగార దృశ్యాలనే కాదు హాస్యం కూడా జుగుప్సాకరంగా
వుంటున్నది. రేలంగి, రమణారెడ్డి మమా అళ్లుల్లుగా "ఇల్లరికం" సినిమాలో
తలచుకుంటేనె నవ్వ లేకుండా వుండ లేము. "ఇల్లరికం" చిత్రంలోని రేలంగి,
రమణారెడ్డి పాత్రలను శ్రీ బాపు ఆ చిత్ర ప్రచారానికి ఎంత అద్భుతంగా గీసారో
పై బొమ్మ చూస్తే తెలుస్తుంది !!

3 comments:

  1. సినీ పబ్లిసిటీ అప్పట్లో ఎన్నెన్ని కొత్త పుంతలు తొక్కిందో కదా! నాయికా నాయకుల రూప (రేఖా)చిత్రాలతో, ప్రముఖుల అభిప్రాయాలతో, పాటల పుస్తకాల సంక్షిప్త కథనంతో ఎంతో ఆసక్తికరంగా ఉండేది. ఈ విషయంలో
    బాపు గారు ఎన్నో ప్రయోగాలు చేశారు. మీరిచ్చిన బాపుగారి కామిక్ స్ట్రిప్ చాలా బాగుంది.
    ఇప్పుడు సాంకేతికత పెరిగింది కానీ విచిత్రంగా సినీ పబ్లిసిటీ కళ తప్పింది. స్పాన్సర్డ్ టీవీ ప్రోగ్రాములుగా విసుగెత్తిస్తోంది. అలనాటి వైవిధ్యం కనుమరుగైపోయింది!

    ReplyDelete
  2. i like your profile and your writings. perhaps i belong to your genre. please let me know how i can write the telugu comments here.
    ramgopal

    ReplyDelete
  3. రామ్ గోపాల్ గారు, శుభ సాయంత్రం! మీరు బరహ, download చేసుకొని,లేదా
    లేఖిని ద్వారాగాని తెలుగులో వ్రాయవొచ్చు. ప్రయత్నించండి.

    ReplyDelete