Monday, December 27, 2010

నర్తన యజ్ఞాలు




హైదరాబాదులో వివిధ వయసులవారు "ధిల్లానా" నాట్యాన్ని ఏకకాలంలో
2800 మంది నృత్య కళాకారులు అభినయించి గిన్నిస్ సంస్థనుంచి
ప్రపంచ రికార్డు ను అందుకొన్నారు. ఈ వార్త చదివిన తరువాత మా
రాజమండ్రిలో గత పాతికేళ్ళనుండి విజయవంతంగా నిర్వహిస్తున్న
డా" సప్పా దుర్గాప్రసాద్ గారి నటరాజ నృత్య నికేతన్ గురించి మీతో
చెప్పాలనిపించింది
కృతయుగంలో ఆరాధన సంస్కృతిలో హిందూ దేవతలు అందరూ
నాత్యకళాకోవిదులు . ఆది దంపతులైన శివపార్వతులు
నాట్యానికి ఆదిస్వరూపులు. వినాయకుడు,కుమారస్వామి, మొదలైన
దైవస్వరూపులతో బాటు యక్ష,గంధర్వ, కిన్నెర, కింపురుష,మునిగణ,
ప్రమదగణాలు, అప్సరలు అందరూ నాట్యమాడినవారే. అలాగే వాల్మీకి
రామాయణంలో శ్రీరాముడు నిర్వహించిన అశ్వమేధయాగంలో లవకుశలూ
రామాయణ గానం చేస్తూ నాట్యమాడినట్లు మనం చదివాము. ఇక
ద్వాపర యుగంలో బాలకృష్ణుడు కాళీయుని పడగలపై నాట్యమాడిన
ఘట్టం మనకు తెలుసుకదా!
1997 సంవత్సరంలో తొలిసారిగా జనవరి12 వతేదీన రాజమండ్రి
టిటిడి కళ్యాణ మండపంలో ఉదయం 8 గంటలనుండి రాత్రి 12 గంటల
వరకు 108 నృత్య కళాకారులచే "నర్తనయజ్ఞం" శ్రీ సప్పా దుర్గాప్రసాద్
నిర్వహించారు. 2002లో శిల్పారామంలో 118 కళాకారులతో యజ్ఞ
నర్తనాలు,2003 లో మూడవ నృత్య యజ్ఞం తిరిగి రాజమండ్రిలో
నగర ప్రముఖుల పాల్గొన్న కార్యక్రమంలో 136 నృత్యకారులచే
నిర్వహించబడి 2004 లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ గా నమోదయింది..
రాజమండ్రిలో శ్రీ సప్పా దుర్గా ప్రసాద్ కోటిపల్లి బస్ స్టాండ్ వద్ద
నిర్మించిన ఆలయ నృత్య కళావనం వివిధ నృత్య భంగిమల శిల్పాలతో
సందర్శకులను అలరిస్తుంది.

2 comments:

  1. మీ బ్లాగ్ రేఖా చిత్రాలు కి నేను నిత్య అతిథిని. నా మూడ్ మారాలన్నప్పుడల్లా మీ బ్లాగ్ లో ఒక టపా చదివేస్తుంటాను.మీరు టపాలలో ఇచ్చేది వట్టి అరుదయిన సమాచారమే కాదు ..చాలా సున్నితమయిన హాస్యం వ్యంగ్యం కూడా!మీ రచనలు పరిణితి చెందినవి. మీ బోటి వారి మంచి మాటలే టానిక్ లాగా కిక్కు ఇచ్చి అలా అప్పుడప్పుడు కోటలు గెంతిస్తుంటాయి. మీరు సురేఖే కాదు...సులేఖ కూడా!

    ReplyDelete