మార్చి 29, 1963 లో విడుదలయిన లలితా శివజ్యోతి వారి "లవకుశ"
సూపర్ డుపర్ హిట్టయింది!
. ఆ రోజుల్లో "లవకుశ " చిత్రం అఖండ విజయం సాధించింది.
ఆ సినిమా నిర్మాణానికి చాలా సంవత్సరాలు పట్టింది. లవకుశ పాత్ర
ధారులు కొన్ని సీన్లలో పెద్ద వాళ్లుగా మరి కొన్నిసీన్లలో మళ్ళీ చిన్న వాళ్ళుగా
అగుపిస్తారు!. సీతా దేవి తలలో పువ్వులు కూడా తరచు రంగులు మారిపోయేవి !
అయినా ప్రేక్షకులు ఇవేవీ పట్టించుకోలేదు. శ్రీమతి అంజలీదేవిని సీతాదేవిగానే
చూశారు. ఇక యన్టీయార్ ముమ్మూర్తులా రాముడి లానే వున్నారు. ఘంటసాల
అందించిన సంగీతం ఈ నాటికి చిరంజీవిగా నిలచింది. గేవాకలరులో నిర్మించిన
ఈ చిత్రానికి సి.పుల్లయ్య దర్శకులు. ఆయన కుమారుడు సి.యస్.రావు కూడా
దర్శకత్వ భాధ్యతలను నిర్వహించారు. ఆ రొజుల్లో "లవకుశ " రోజుకు మూడు
ఆటలతో రజతోత్సవాలు జరుపుకుంది. ఆ కాలంలో శని ఆది వారాల్లో తప్ప
మాటనీ షోలు వుండేవి కాదు.
సి.పుల్లయ్య గారి గురించి రెండు మాటలు. రాజమండ్రిలో దుర్గాసినీటోన్ అనే
సినిమా స్టూడియో వుండేది. పుల్లయ్య గారు ఆ స్టూడియోని తీసుకొని "మోహినీ
భస్మాసుర" (1938), " సత్యనారాయణవ్రతం" తీశారు. "సత్యనారాయణవ్రతం" చిన్న
సినిమాగా వచ్చిందని, " కాసులపేరు" అన్న సాంఘిక చిత్రాన్ని తీసి కలిపి ప్రదర్శించారు.
అన్నవరం దేవాలయం పై ఒక డాక్యుమెంటరీ, తీసిఅది కూడాకలిపి ఒకే ఆటలో
ఎన్నో సినిమాలు అంటూ ప్రచారం చేశారు.
It's classic.
ReplyDeleteలవకుశ వర్ణనాతీతమైన వర్ణచిత్రం. తెలుగు చలన చిత్ర చరిత్రలో ఒక సువర్ణాధ్యాయానికి ఆరంభం. భావార్ణవాన్ని తలపించే పాటలు, కర్ణపేయమైన సంగీతం సమకూరి, ఆ పాటలు, పద్యాలు వింటుంటే మనసు పులకిస్తుంది. లవ, కుశుల పాత్రధారులు చాల ముచ్చటగా ఉండి శ్రీమతి సుశీల, లీల గార్ల ముత్యాల్లాంటి మూడు పాటలు పాడుతుంటే చాల రసవత్తరంగా ఉండేది. "సప్తాశ్వ రథమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం" అన్నప్పుడు రామారావు గారి గంభీరత, "ఇదె మన ఆశ్రమంబు ఇచట నీవు వసింపుము లోకపావని" అన్న నాగయ్య గారి శాంతం, ఏ మహనీయ సాధ్వి జగదేక పవిత్రత" అని దీనంగా విలపించే కాంతారావు గారి భావ ప్రకటనం నాకు ఇంకా గుర్తున్నాయి. వీటన్నిటి వెనుక అమర గాయకుడు శ్రీ ఘంటసాల మాస్టారి పాటవం ప్రతి బాణీలోను కొట్టొచ్చినట్లు కనబడుతుంది. మంచి చిత్రాన్ని మననం చేసినందుకు శ్రీ అప్పారావు గారికి ధన్యవాదాలు.
ReplyDeleteలవకుశ ను గుర్తు చేసారు బాగుంది.
ReplyDeleteC Pullaiah directed Lavakusa much before this NTR Lavakusa, which is not known to many of them. C Pullaiah died in the middle of making NTR Lavakusa and his son C S Rao, husband of Rajasulochana, had completed the movie.
ReplyDeleteThis is my alltime favorite and the beauty of this movie is that inspite of continuous songs and poems one is not bored. The four songs sung by Lavakusa completes the whole "Ramayana." Lyrics are written in such a way that it reaches common man. Hats off to all those who helped in making this great movie.
My favorite scene is when Lavakusa sees Lord Rama for the first time and pray to him "Sri Raghavam dasaradatmajamaprameyam seethapatim raghukulanmaya ratnadeepam aajanubahum......."
My brother (Prabhakar)in hyderabad and myself know all the dialogues, songs, scenes, poems of this movie and ofcourse,we enjoy to this day.
Sree Rama Jayarama Jaya Jaya Rama.
Mattegunta Nagalakshmi
Mumbai
లవకుశ చిత్రం గురించి ఎంతో చెప్పాలనుకున్నా చెప్పలేకపోయిన
ReplyDeleteవిషయాలను తెలియ జేసిన మితృలందరికీ నా శుభాకాంక్షలు !
లవకుశ పెద్ద హిట్ అవ్వడానికి నటీనటుల నటనాకౌశలమే కాక గాయనీ గాయకుల ప్రతిభ, సదాశివబ్రహ్మం గారి కలం తోడ్పాటు ఎంతైనా ఉంది.
ReplyDelete"లేరు కుశలవుల సాటి" పాటకు సాటి రాగల పాట ఇంకోటుందా? లీల, సుశీల విజృంభించేసారుగా ఆ పాటలో.
అలాగే అపవాదదూషితయైన కాంతనుబాసి," "ఇనుడత్తాద్రికిజేరకుండ, హ్రీంకారాసనగర్భితానలశిఖాం....మళ్ళీ పాడగలరా ఇలా ఎవరైనా!
ఘంటసాల పాడిన "రావణు సంహరించి రఘురాముడు" ఏమహనీయసాద్వి జగదేకపవిత్రత",ఇంతకుబూనివచ్చి","ప్రతిదినమేను తొలుదొల్తపాదములంటి", "నవరత్నోజ్వలకమంతివంతమిది"...ఓహ్ అనన్య సామాన్యం.
S.వరలక్ష్మి గారిని తలుచుకోకపోతే మహా పాపం, "రాజట రాజ ధర్మమట..." గుక్క తిప్పుకోకుండా ఏం పాడేసారండీ!
ReplyDeleteI have purchased LAVA KUSA- movie CD, for opening ceremony of my DVD player
ReplyDeleteMy self and my wife enjoy by playing this movie whenever possible
the song of "Ea Nimushaaniki" - all time super hit
Thanks for giving me this opportunity to express my views,,