ఆమావాస్యరాత్రి! రాత్రి పన్నెండయింది. కుమారి తన భర్త కోసం ఆతృతతో బాల్కనీలో
నిలబడిఎదురుచూస్తున్నది. వెన్నెల నీడలో తోటలోని ఆశోక చెట్ల నీడలు దయ్యల్లా
బాల్కనీ గోడల పై పడి భయం వేస్తున్నది. గాలికి కదిలే ఆ చెట్ల నీడలు మరింత
భీభత్సంగా వున్నాయి. ఇంతలో కరెంటు పోయింది. హాల్లో సెల్ ఫోన్ మ్రోగింది. కుమారి
ఆ చీకట్లోనే స్విచ్ వెదికి లైటెసింది. టేబుల్ పైనున్న సెల్ తీసి హలో అంది. అవతలనుంచి
భయంకరమైన నవ్వు కోమలంగా వినిపించింది. భయంతో ఫొన్ క్రెడిల్ పై వుంచేసింది.
క్రింద టామీ కుయ్యో మంటు ఏడుస్తున్నది. పైనుంచి చూస్తే పక్క జట్కా వాడి గుర్రం
టామీనీ తన కొమ్ములతో కుమ్మివేస్తున్నది. ఇంతలో ఓ చల్లని చేయి భుజం మీద
పడింది. కుమారి కేవ్వుమని అరుస్తూ బాల్కనీలోకి పరిగెట్టింది. అసలే మండిపోతున్న
సూర్యుడి వేడికి బాల్కనీ నేల చుర్రుమని కుమారి పాదాలను చుర్రుమనిపించాయి.
ఆ కటిక చీకట్లో బాల్కనీ రెయిలింగ్ పైన పొడవైన ఆకారం నవ్వుతూ కనిపించింది.
ఈ సారి మరోసారి కెవ్వుమని అరవబోయింది. దూరంగా గోదావరినది, బ్రిడ్జి మీద
చార్మీనార్ ఎక్స్ ప్రెస్ వేగంగా పోతున్నది. వెనుకవైపు సముద్ర కెరటాల ఘోష వల్ల
ఏం వినిపించక కనిపించక అంతా గందరగోళం గా వుంది. బాల్కనీ రెయిలింగ్ మీద ఓ
పొడవైన మరుగుజ్జు జుట్టు విరబోసుకొని మళ్ళీ నిలుచునుంది. మరో సారి కెవ్వుమని........
తరువాయి వచ్చే ఏడాది ఇక్కడే ఎప్పుడో ఎక్కడో , భయం భయంగా ఎదురు చూస్తుండండి.
.
<<<<<<<<<<<<<<<<<<>>>>>>>>>>>>>>>>>>>>>>>>
మొదటిసారిగా వ్రాస్తున్న ఈ నవల శైలి, కధ చెప్పేతీరు అద్భుతంగా వుంది కదండీ.
ఇంకేమి, పెన్నులో ఇంకయిపోయే దాకా నే భయంకరమైన భీభత్సమైన కధలు
వ్రాసేస్తా! కానీ మా శ్రీమతి పద్మ మాత్రంఈ నవల గంద్రగోళం గా వుందన్నది.
తను ఇలా వ్రాయలేనని జెలసీ తో అలా అన్నది కాని నవల పెరే "గందరగోళం" కదా?!
!
<><><><><><><><><>oOo<><><><><><><><>
కార్టూన్ బాపు గారి "కొంటె బొమ్మల బాపు " వాల్యూమ్ -2 సౌజన్యంతో
.
This comment has been removed by the author.
ReplyDeletehmm nope, i read it again :) so removed
ReplyDelete"భయంకరమైన నవ్వు కోమలంగా వినిపించింది", "సూర్యుడి వేడికి బాల్కనీ నేల చుర్రుమని కుమారి పాదాలను చుర్రుమనిపించాయి", "పొడవైన మరుగుజ్జు"......
ReplyDeleteఇది గందరగోళమా,అంత చిన్నమాటతో తేల్చి పడేస్తే ఎలా!..ఇదేదో అంతకన్నా చాలా పెద్దది, బహుసా తెలుగులో పదాలు లేవేమో! :))))
చి.సౌమ్య గారు,
ReplyDeleteఈ కంగాలీ కధ మీకు నచ్చినందుకు ధన్యవాదాలండి!
కల్తీలేని గందరగోళం, ఇప్పుడొస్తున్న సినిమాల్లా ( బాపు గారివి కాదు ) ..........
ReplyDeleteరావు గారూ, మీరన్న "ఇప్పుడొస్తున్న సినిమాల్లాగ" అన్నమాట
ReplyDeleteనూరు పాళ్ల నిజమమండి !