Thursday, December 02, 2010

రామప్ప దేవాలయం




వరంగల్లు జిల్లా పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయం వుంది.
రుద్రమదేవి కాలంలో గణపతి రుద్ర దేవుడు 1213 లో ఈ దేవాలయాన్ని
నిర్మించాడట. ఈ ప్రాంతంలో వున్న దేవాలయాలన్నీ అద్భుత శిల్పకళ
తో నిర్మించబడ్డాయి. 1983 లో ఈ దేవాలయం గురించి రామప్ప
దేవాలయం పేర క్రిష్ణారావు కేషవ్ దర్శకత్వంలో ఓ డాక్యుమెంటరీ
నిర్మించారు. శ్రీ సాలూరి రాజేశ్వరరావు గారి సంగీత దర్శకత్వంలో
యమ్కే రాము రచనతో ,శ్రీ బాలు గాత్రంతో పాటలు చిత్రీకరించారు.
సంగీత నృత్య ప్రధానమైన పాటలను AVM MUSIC SERVICE
వారు 1983లో 45 RPM Standard Play Record గా ఆ పాటలను
విడుదల చేశారు. చిత్రం అసలు విడుదలయిందో లేదో తెలియదు గాని
నా దగ్గర వున్న ఆ రికార్డును వింటుంటే అద్భుతమనిపించి ఈ వీడియో
ద్వారా మీకు చూపిస్తూ, వినిపిస్తున్నాను. రామప్ప దేవాలయం గురించి
పూర్తి వివరాలు తెలియ రాలేదు.బ్లాగరు మితృలెవరైనా ఫొటోలతో తమ
బ్లాగులో వ్రాస్తారని తలుస్తాను.
.

1 comment:

  1. This Ramappa temple is actually named after the sculptor Ramappa. The Lord here is Shiva, named Ramalingeswara.
    I visited this temple sometime between 1989-91 as a part of excursion.I only remember that the big nandi is in good position and the remaining temple is in ruins. It takes around 4 to 5 hrs journey from Hyderabad. This temple is built by Kakatiya kings.

    It takes time to learn and post in Telugu, please excuse me. I will practice and write in telugu, shortly.

    Mattegunta Nagalakshmi
    Mumbai

    ReplyDelete