Saturday, December 25, 2010

అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామి






రాజమండ్రి సమీపంలోనున్న రావులపాలెంకు 26 కిలోమీటర్ల దూరం లో ఈ
క్షేత్రం వుంది. అయినవిల్లి వినాయకుడు విఘ్నాలను తొలగించే స్వామిగా
ప్రసిద్ధి చెందాడు. ఏ శుభకార్యం మొదలు పెట్టినా ఈ స్వామిని పూజిస్తే ఆ
కార్యం జయప్రదం అవుతుందని ఇక్కడి ప్రజల నమ్మకం. గౌతమీ,వృద్ధ
గౌతమీ గోదావరీ ప్రాంతంలో చల్లని కొబ్బరి తోటలమధ్య ఈ ఆలయం
నిర్మించబడింది. విశాలమైన ఆవరణలో ఎత్తైన ప్రాకారంతో ఈ దేవాళయంలో
క్షేత్రస్వామి శ్రీ విఘ్నేశ్వరస్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు
సాధారణంగా ఆలయాలు తూర్పుముఖంగా వుంటాయి. కానీ ఇక్కడి స్వామి
దక్షిణముఖంగా వుంటాడు. ఈ గ్రామంలో దక్షిణ సింహద్వారాలున్న గృహాలకు
ఎటువంటి విఘ్నాలు వుండవని నమ్మకం. రెండు గోపురాలు,సింహద్వారాలతో
అలరారే ఈ దేవాళయం దక్షిణ సింహద్వారం ద్వారా స్వామిని దర్శించుకోవచ్చును.
ఈ దేవాళయం ప్రాంగణంలోనే అన్నపూర్ణాదేవి శ్రీ విఘ్నేశ్వరాలయం ప్రక్కనే
ప్రతిష్టించబడింది. క్షేత్రపాలకుడైన శ్రీకాల భైరవశ్వామిని కూడా ప్రతిష్టించారు. ఈ
క్షేత్రంలో స్వామి స్వయంభూ అవటము వలన నిత్యం శక్తి ప్రస్ఫుటమవుతుంది.
ఈ దేవాళయాన్ని దర్శించాలంటే రాజమండ్రి నుండి రావులపాలెం మీదుగా
అయినవిల్లి వెళ్ళాలి. రాజమండ్రి నుంచి రూటు, రావులపాలెం-బోడిపాలెం
వంతెన-వానపల్లి-అయినవల్లి.......60 కిలోమీటరులు. ప్రతీ విద్యార్ధి పరీక్షలలో
మంచి ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వినూత్న పద్ధతిలో లక్షపెన్నులతో
స్వామివారికి అభిషేకం జరిపించి పెన్నులను ఉచితంగా విద్యార్ధులకు అంద
జేస్తుంటారు ! ఈ వెబ్ సైటు ద్వారా మరిన్ని ఆలయ వివరాలు తెలుసుకోండి.
visit:www.ainavillivighneswara.com.
బొంబాయినుంచి మా అబ్బాయి, కోడలు, మా రెండో అమ్మాయి నాలుగు
రోజుల క్రితం వచ్చినప్పుడు మరొసారి విఘ్నేశ్వరస్వామిని దర్శించుకున్నాం.

4 comments:

  1. బాగా చెప్పారండీ ..పక్క ఊరే మాది అమలాపురం .రావుల పాలెం దాటాక ర్యాలీ గ్రామం లో జగన్మోహిని -చెన్నకేశవ పురాతన ఆలయం .
    అటునుంచి 'అయినవిల్లి' మీదుగా ముక్తేశ్వరం వచ్చి ..ఎడమ వైపు గోదావరి దాటితే ..కోటిపల్లి ,ద్రాక్షారామం క్షేత్రాలు .
    అలా కాకుండా , ముక్తేశ్వరం నుండి కుడి వైపుకి తిరిగి అమలాపురం మీదుగా ..బోడసకుర్రు వెల్లి గోదావరి దాటితే ...ఏడుకొండలవాడి అప్పన పల్లి . ఎటు చూసినా కోనసీమ అంతటా పుణ్యక్షేత్రాలే!
    post scrap cancel

    ReplyDelete
  2. మొన్ననే లోలకం బ్లాగు వేమూరి వేంకటేశ్వర రావు గారిని ఈ క్షేత్రం తీసుకొని వెళ్ళి చూపించాను. ప్రక్కనే వున్న ముక్తేశ్వరం గుఱించి కూడా రెండు ముక్కలు వ్రాయాల్సింది. అక్కడికి ప్రక్కనే వున్న రేవు గుఱించి కూడా వ్రాయవలసింది.

    ReplyDelete
  3. please watch
    http://bookofstaterecords.com/
    for the greatness of telugu people.

    ReplyDelete