Friday, December 31, 2010

01-01-11/ఒకటీ, ఒకటీ,ఒకటొకటే !

అప్పుడే ఏడాది వెళ్ళి కొత్త ఏడాది వచ్చేస్తున్నది. కానీ ఎన్ని ఏడాదులు
మారినా ఏమున్నది గర్వ కారణం ? గతానికి, ఇప్పటికీ ఏం మార్పూ
లేదు ! నాయకులు మనల్ని ఏమార్పు చేశారు. మరికొందరు యువ
నేతలు ఓదార్పులు చేశారు. సగటు మనిషి జీవితం అప్పుడూ ఇప్పుడూ
ఒక్కటే అని చెబుతున్నట్లు లేదూ రేపటితారీఖు !! ఎన్ని కష్టాలు
గత ఏడాది వచ్చినా ఇక ఈ కొత్త సంవత్సరంలో మన జీవితాల్లో మర్పు
వస్తుందనే ఆశతో రేపు ఉదయాన్నే కలుసుకోగానే "హాపీ న్యూ ఇయర్"
అని నవ్వుతూ చెప్పు కుంటాం. రాత్రి మత్తు వదలని మందుబాబులు
తుల్లుతూ ,నవ్వుతూ చెబుతారు. కొత్త కాలం"డర్" రోజులు రాగానే
కొంత మందికి కాలెండర్ పిచ్చి వుంటుంది. అలాటి వాళ్ళని చూసి
వ్యాపారస్తులకు కేలం"డర్" పట్టుకుంటుంది.
అసలు రోమనులు మార్చి ఒకటో తేదినే సంవత్సరపు మొదలుగా
లెక్కించే వారట! కానీ క్రీస్తు పూర్వం 46 సంవత్సరంలో అప్పటి రోమన్
చక్రవర్తి జూలియస్ సీజర్ జనవరి ఒకటో తేదిని నూతన సంవత్సరంగా
పాటించాడు. సీజర్ తన్ ఆస్థాన జ్యోతిష్యుడు సోసీజన్ సహాయంతో
తయారు చేసిన కేలండర్ భూమి సూర్యుడి చుట్టూ ఒకసారి ప్రదక్షిణ
చేయడానికి 365 1/4 రోజులు పడుతుంది. ఏడాదికి 365 రోజులైతే,
ఏడాది పన్నెండు నెలలుగా విభజించబడింది. ఏప్రిల్,జూన్, సెప్టెంబర్,
నవంబర్ మాసాలకు 30 రోజులుంటాయి. ఫిబ్రవరిలో 28/29 రోజులు
వుంటాయి. ఇక మిగిలిన మాసాలకు 31 రోజులుంటాయి. ఇక లీపు
సంవత్సరమంటే నాలుగు చేత భాగిస్తే శేషం లేకుండా వుండేది ! లీపు
సంవత్సరంలో ఫిబ్రవరికి 29 రోజులుంటాయి.
నిజానికి మన నూతన సంవత్సరం ఉగాది. కాని మనం ఆంగ్ల
నూతన సంవత్సరాన్ని జరుపుకున్నంత ఉత్సాహంగా తెలుగు
సంత్సరాదిని జరుపుకోము. దానికి కారణం, మనం తెలుగు వాళ్లం
కావడమే. నేనూ తెలుగు వాడినే కాబట్టి మీ అందరికీ మా ఇంటిల్లిపాది
నూతన సంవత్శర శుభాకాంక్షలు ఇప్పుడే అందిస్తున్నాను.
. >>>>>>>>>>>>oOo<<<<<<<<<<<

కేలెండరు కార్టూన్ "కొంటెబొమ్మల బాపు" పుస్తకం సౌజన్యంతో.........

1 comment:

  1. "మనం ఆంగ్ల నూతన సంవత్సరాన్ని జరుపుకున్నంత ఉత్సాహంగా తెలుగు సంవత్సరాదిని జరుపుకోము" అని అంటే నేనొప్పుకోను. రెండూ సమానంగానే (లేదా ఉగాదిని కొంచం ఎక్కువగానే) జరుపుకొంటాము అని నా ఉద్దేశ్యం.

    మీకూ మీకుటుంబానికీ "రెండువేల పదకొండు సంవత్సర" శుభాకాంక్షలు.

    ReplyDelete