Sunday, February 28, 2010

డాక్టర్-పేషెంట్




హాసం క్లబ్: డాక్టర్-పేషెంట్ : లఘు హాస్య నాటికలో నేను. యమ్.డి.ఖాదర్ ఖాన్


డా.ఖాన్: రండి రండి, అప్పారావుగారు,ఎలా ఉన్నారు? మీ చెవి నొప్పికి నేనిచ్చిన మాత్రలు
మూడు రోజులు మూడు పూట్లా వేసుకున్నారనుకుంటాను. ఇప్పుడు నొప్పి ఎలా వుంది?

అప్పారావు: తగ్గడమా?! పైగా నొప్పి భరించలేనంత ఎక్కువైయిందండీ బాబూ!

డా.ఖాన్ : ఏదీ,చెవి చూడనివ్వండి! ఇదేమిటి? చెవిలో ఏమిటో తెల్లగా కుప్పలు కుప్పలుగా
ఉన్నాయి?!

అప్పారావు: ఏమిటా? భలే వారండి! అవి మీరిచ్చిన మాత్రలు!!

డా.ఖాన్ : ఏవిటీ, మీ అసాధ్యం కూలా! మాత్రలు చెవిలో వేసుకున్నారా? మీరెక్కడ దొరికారండీ?

అప్పారావు: చెవిలో వేసుకోక ఇంకెక్కడ వేసుకోవాలి.మొన్న నాకు నోటి పూత వస్తే మాత్రలు నోట్లో
వేసుకున్నాను.తగ్గింది.ఇప్పుడు చెవి నొప్పివచ్చినప్పుడు చెవిలో వేసుకోక నోట్లో వేసుకుంటామా?
ఐనా ఆ విషయం మీరు ముందుగా చెప్పాల్సింది.

డా.ఖాన్ : సరేలెండి. ఇన్జెక్షన్ చేస్తా. నొప్పి వెంటనే తగ్గుతుంది.

అప్పారావు: డాక్టర్ గారు.నే ఇంజక్షన్ చేయించుకోవడం ఇదే మొదటి సారి.నొప్పి లేకుండా చేస్తారు కదూ?

డా.ఖాన్ : భలే వారండి.నేను 35 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నా,తెలుసా!!

అప్పారావు: అమ్మ బాబోయ్! ఇంజక్షన్ చేయడం అన్నాళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నారంటే ఇంకా మీ కనుభవం
రాలేదన్న మాట. వద్దు లెండి. మాత్రలే ఇవ్వండి.ఈ సారి నోట్లోనే వేసుకుంటా.

Friday, February 26, 2010

సురెఖార్ట్యూనులు: ఈ న(మా)యా బజార్ కలరు!!





అలనాటి మాయాబజార్ సృష్టి లో అతిరధమహారధులెందరో కలరు!
ఈ నయా సినీ బజారులో ఆ "మాయాబజార్" కు తోడైంది వన్నెచిన్నెల కలరు!!
మరోసారి కొత్త మాయాబజార్ తీసినా రంజింపచేయగల నటులింకెవరు కలరు?!!
ఇక అలనాటి "మాయాబజార్" తీయగల మొనగాళ్ళు ఎవరు కలరు??!

Tuesday, February 23, 2010

ప్రముఖుల (ప్రేమ) లేఖలు


















ఆ మైల్ పోయి ఈనాడు ఈ మైల్ వచ్చాక పోస్ట్ మ్యాన్ కోసం
ఎదురు చూపులే పోయాయి. ఐనా ఇంకా కొందరైనా ఉత్తరాలు
వ్రాస్తూనే ఉన్నారు. అలాటి ఉత్తరాలు జాగ్రత్త చేసుకొని అప్పుడప్పుడు
తీసి చదువుకుంటుంటే అదో అనుభూతి.నాకు వచ్చిన కొన్ని ఉత్తరాలను
మీతో పంచుకుంటున్నాను.శ్రి బాపు,ముళ్ళపూడి,జయదేవ్,అక్కినేని,
ఈనాడు రామోజీరావు,సరసి, బ్నిమ్,నేనెంతో అభిమానించే గాయకులు
శ్రీ యస్పీ.బాలసుబ్ర్హ్మణ్యం ప్రెమతో వ్రాసిన ఉత్తరాలు చూడండి.మా పిల్లలకు
చందమామ సంపాదకులు కీ"శే"కొడవటిగంటి కుటుంబరావు గారు 1980లో
వ్రాసిన ఉత్తరం కూడా ఉంది!!

"ఆ" మైల్-"ఈ"మైల్

ఈ"మాస్: ఏజ్ లో ఉత్తరాల పలకరింపులు లేవు;
అన్నీ మెసేజ్ లే!
అక్షరాల కత్తిరింపులతో,స్పెల్లింగ్ కిల్లింగ్ లతో అన్నీ
భాషను ఖూనీ చేసే డామేజీలే!!
అనుభంధాలను అందించే ఉత్తరం ఎంతెంతో దూరం!
గుండె చప్పుళ్ళను అక్జరాలతో నింపి వ్రాసే ఉత్తరం కోసం
పోస్ట్ మాన్ తెరచే గేట్ చప్పుళ్ళు ఇక వినిపించవు!!
ఇంకా ఎన్నాళ్ళకో "ఆ"మైల్ రోజులు?!
నేడు "ఈ" మైల్ పైనే అందరికీ మోజులు!!

Sunday, February 21, 2010

ఈనాడులో నేను..సురేఖ



నిన్నటి ఈనాడు దినపత్రికలో నా అపురూప వస్తుసేకరణ,వ్యంగ్య కార్టూన్ల గురించి సమగ్ర వ్యాసం ప్రచురించబడింది.

ఇదిగోండి..

Friday, February 19, 2010

కార్టూనిస్టులు-ఒకేసారి ఒకే ఐడియాలు!!






ఒక్కొక్కసారి వేవ్లెంత్ కుదిరే కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు వస్తుంటాయి.
అతణ్ణి చూసి కాపీ కొట్టేశాడనే అపోహ కూడా ఒక్కోసారి కలుగుతుంది,ఈ
విషయం తెలియని కొందరికి!!"ఈనాడు" శ్రీధర్ గారు ఫిబ్రవరీ 1వ తేదీన
ఇదీ సంగతి పాకెట్ కార్టూన్ ఐదీయానే,7వ తేదీ "డెక్కన్ క్రానికల్" లో
కార్టూనిస్ట్ శ్రీ సుధీర్ తైలాంగ్ వేశారు.కార్టూనిస్ట్ లకు ఒకే ఐడియా తట్టే
విషయం ప్రఖ్యాత కార్టూనిస్ట్ డాక్టర్ జయదేవ్ నాకు వ్రాసిన ఉత్తరంలో
ఇలా వ్రాశారు.
"మీకు తట్టినవే నాకు తట్టాయి! కార్టూనిస్టులకు ఐడింటికల్ ఐడియాస్
ఫ్లాష్ అవుతాయనటానికి పైది ఒక నిదర్శనం! శ్రీధర్,చంద్ర, నాకు అనేక
మార్లు ఐడెంటికల్ ఐడియాస్ తడూతుంటాయి! మీతో వేవ్లెంత్ కుదరడం నా
కెంతో సంతోషాన్నిచ్చింది.అందులో ఒకటి మీరు వేసిన "గెడ్డం" కార్టూన్!!"

ఇలా మా కార్టూనిస్టులకు ఒకే ఐడియాలు తడతాయనటానికి ఇక్కడ మీకు
చూపిస్తున్న కార్టూన్లు ఓ చిన్న ఉదాహరణ!!

Thursday, February 11, 2010

పెన్సిల్ చెక్క చెక్కుతో చెక్కిన విరి రేకులు !!




ఇక్కడ మీరు చూస్తున్న పూలను జాగ్రత్తగా చూడండి!! వాటిని సృస్టించిన వారు
శ్రీమతి నాగలక్ష్మి, వారి కుమార్తె కుమారి దీపిక.ఇదివరలో శ్రిమతి నాగలక్ష్మి
ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు రేఖాచిత్రం లో చూపించాను. ఈ సారి సంక్రాంతికి
ఎప్పటిలాగానే వాళ్ళింట్లో మూడు గదుల్లో బొమ్మల కొలువు పెట్టారు. గుళ్ళు,గోపురాలు,
దేముళ్ళు,దేవతలు ఒకటేమిటి అన్నీ మన కళ్ళముందు కనుల పండుగగా ఏర్చి కూర్చారు!!





ఇంతకీ పెన్సిల్ చెక్క చెక్కుతో చెక్కిన పూల మాట మీకు చెప్పాలి. నాగలక్ష్మి గారికి దీపికతో
బాటు ఇద్దరు కవల అబ్బాయిలున్నారు.వాళ్ళకు పెన్సిల్, మెండర్ (చెక్కుకొనే మిషన్) ఇస్తే
అదే పనిగా పెన్సిళ్ళు చెక్కిపోసేవారట. వాళ్ళంటె నాగలక్ష్మి గారికి కాస్త గారాబం అవటం వల్ల
భరించి తుక్కు ఎత్తి పారేయటం అలవాటయిపోయినా ఓ రోజు ఈ పెన్సిల్ చెక్క తుక్కు పూల
రేకుల్లా బాగున్నయే అనిపించి ఫ్లివికాల్తో ఓ పుల్లకు జాగ్రత్త గా ఒకదాని చుట్టు ఒకటి అతికిస్తే
పూల ఆకారం వచ్చిందట.ఇంకేం అలా ప్రారంభించి ఇల్లా పెన్సిల్ చెక్క చెక్కుతో పూలు చెక్కేశారన్న
మాట!! మీరూ పెన్సిళ్ళు కొనేసి మిషన్తో చెక్కి ఆ చెక్కుల్తో పూలు తయారు చేయటం మొదలెట్టండి!

Monday, February 08, 2010

సూర్యకుమారి గురించి మరికొన్ని కబుర్లు


శ్రీమతి టంగుటూరి శూర్యకుమారి గురించి 21 జనవరిలో వ్రాశాను.నా పాత
రికార్డుల పుట్ట తిరగేసి చూస్తుంటే సూర్యకుమారి 45 ఆర్పీయం రికార్డ్ అగు
పించింది. 1971 లో రిలీజయిన ఆ రికార్డ్లొ ఆమె మనో బుద్ధి -నిర్వాన
శతకం ( శ్రీ ఆది శంకరాచార్య) పాడారు.ఆ రికార్డ్ స్లీవ్ వెనుక సూర్యకుమారి
గురించి ఇలా వ్రాసారు.

Suryakumari,born in RAJAHMUNDRY,educated in Madras,was a child prodigy
at the age of five for her singing.She was discovered by a film producer
at the age of ten and became famous as a film actress.Her early films were
in Tamil and Telugu; ;later in Hindi and still later in English. She was
tutored in classical vocal music under Shri Pratapam Natesiar,disciple of
Vidwan Shri Ariyakudi Ramanuja Iyengar and on violin under proffessor
Vidwan Shri Parur Sundaram Iyer.
She gave hundreds of concerts and made across of records before leaving for the West
to gain experience in stage production and television. From 1960 she has resided in New York,.
and in London.In New york she acted in Rbindranath tagore's drama "King Of The Dark Chamber"
which ran with great success for a full year and gained for her the O.B.Award for
distinguished performance.
She has made many appearance on television in America,England and Europe. She taught Carnatic music
at Columbia University.

Friday, February 05, 2010

నేను, మా సంగీతం మాస్టారు


ఈ బొమ్మ మా చెల్లాయి కస్తూరి గీసిన బొమ్మ.అప్పుడు దాని వయసు 10 ఏళ్ళు!
1954లో ఆంధ్ర సచిత్ర వార పత్రిక దసరా పండుగకు ప్రత్యేకంగా పిల్లలకు
బొమ్మలు గీసే పోటీ పెట్టింది. ఆ సంచికకు నేను బొమ్మ గీసి పంపిచానుకాని
నా బొమ్మ పడలేదు. చెల్లికి బహుమానం కూడా వచ్చింది. ఆ బొమ్మను ఇక్కడ
ఇస్తున్నాను.అప్పుడు మా చెల్లి రాజమండ్రి లో యమ్మెస్.బాల సుబ్రహ్మణ్యం గారి
దగ్గర సంగీతం నేర్చుకొనేది. ఇది 56 ఏళ్ళ క్రితం జరిగిన తీపి గుర్తు.