Wednesday, September 30, 2009

నమస్సుమాంజలి



గత సంవత్సరం జైన్ సంఘంవాళ్లు నా దగ్గర ఉన్న చందమామ పుస్తకాల ప్రదర్శన ఏర్పాటు చేసినప్పటి దృశ్యాలు..



సాహితీమిత్రులందరికీ నమస్సుమాంజలి. నా పేరు ఎం.వి.అప్పారావు."సురేఖ"పేరుతో 1958 నుండి వివిధ ఆంగ్ల, తెలుగు పత్రికలలో కార్టూన్లు వేస్తున్నాను. ఇంకా చెప్పాలంటే బాపూ,రమణలకు వీరాభిమానిని. మీకందరికి ఓ పరమరహస్యం చెప్పనా..నాదగ్గర 1953 నుండి చందమామ పత్రికలన్నీ సేకరించి బైండ్ చేయించి ఉన్నాయోచ్. అలాగే బాపూగారు వేసిన కార్టూన్లు సేకరించి సుమారు ఆరు సంపుటాలుగా చేయించుకుని భద్రంగా దాచుకున్నాను. నా ప్రవృత్తి చెప్పాను. వృత్తి చెప్పలేదు కదూ..State Bank of India లో పనిచేసి రిటైరయ్యాను.. మిత్రులు భమిడిపాటి ఫణిబాబుగారి ప్రోత్సాహముతో ఈబ్లాగు ద్వారా ఈ అంతర్జాలంలో మిమ్మల్ని కలుసుకుంటున్నాను.

3 comments:

  1. నమస్తే మాష్టారూ! మీ పోస్టుల కోసం ఎదురుచూస్తుంటాం :)

    ReplyDelete
  2. చాలా సంతోషం అప్పారావు మాష్టారూ . మిమ్మల్ని ప్రోత్సహించిన మీ మిత్రులు
    ఫణిబాబు గారికీ , సాంకేతికంగా సహకరించిన జ్యోతక్క కి ధన్యవాదములు :-)

    ReplyDelete
  3. నమస్తే సురేఖ గారూ.

    బ్లాగు లోకానికి స్వాగతం. మీ రాకతో బ్లాగులోకం విలువ పెరిగింది. మీలాంటి పెద్దలు, సాహిత్యం మీద పట్టు ఉన్నవారు, భాష చక్కగా వ్రాయగలవారి అవసరం బ్లాగులోకానికి ఎంతైనా అవసరం. మీ వ్రాతలతో, రేఖాచిత్రాలతో అందరినీ ఆనందపరుస్తారని, లేదు లేదు సంభ్రమపరుస్తారని నా ప్రగాఢ నమ్మకం.

    మీ బ్లాగుకు నేనే మొట్టమొదటి అనుచరుణ్ణి.

    మీరు వ్రాయబోయే వ్యాసాలు, వెయ్యబోయే రేఖా చిత్రాల కోసం వేయి కళ్ళతో ఎదురు చూస్తూ,

    మీ

    శివరామ ప్రసాదు కప్పగంతు
    బెంగుళూరు, భారత్

    ReplyDelete