Monday, July 16, 2012

చందమామ రామాయణం :: శ్రీ శంకర్ బొమ్మలు

                     చందమామ రాగనే ముందర కధల కంటే బొమ్మలనే
                     ఆసక్తితో చూసే వాళ్ళం. చందమామ సీరియల్ కధలకు
                     దాదాపు "చిత్రా" బొమ్మలు వేసేవారు. తరువాత 1952
                     లో ఆసంస్థలో చేరిన శ్రీ శంకర్ కధలకు, పౌరాణిక కధలకు
                     బొమ్మలు అద్భుతంగా ఈనాటికీ వేస్తున్నారు. మే 1961
                      సంచికలొ మొదలై  సెప్టెంబరు 1965 వరకూ వచ్చిన
                     రామాయణం గాధకు శ్రీ శంకర్ వేసిన చిత్రాలు రామాయణ
                     కావ్యమంత కమణీయంగా వుంటాయి. శంకర్ పూర్తి పేరు
                     కె.సి.శివశంకరణ్ 1924లో ఈరోడ్ దగ్గరగల ఊర్లో పుట్టారు.

                           చిన్న వయసులోనే 1934 లో ఆయన కుటుంబం మద్రాసు
                     వచ్చారు. ఆయన దస్తూరీ చలా అందంగా వుండటం చూసి
                     స్కూళ్ళో టీచర్ శంకర్ చేత ప్రతి రోజూ బోర్డు మీద సూక్తులు
                     వ్రాయించే వారట. చందమామ సంస్థలో చిత్ర, శంకర్ ఇద్దరూ
                     ఒకరికి ఒకరు పోటీగా వున్నా తరువాత మంచి స్నేహితులు
                     గా మారారు. చందమామ అధిపతి నాగిరెడ్డి గారు  "చిత్రా ,
                     శంకర్ లు చందమామ అనే బండిని లాగే జోడెద్దులు" అనే
                     వారు..1952లో నెలకు 350 రూపాయల జీతంతో శంకర్
                      చందమామ లో ఆర్టిస్టుగా చేరారు.





                              88 ఏళ్ళ వయసు వచ్చినా , Arthritis తో ఆయన వేళ్ళు
                     ఇబ్బంది పెట్టినా చందమామకు ఆయన ఇంటి దగ్గరే అందంగా
                     బొమ్మలు వేస్తున్నారు. ఆయన ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి
                      చెన్నైలో వుండగా మరో ఇద్దరు అబ్బాయిలు ఒకరు కెనడాలో
                     మరొకరు మలేసియాలో వున్నారు. శంకర్ మరెన్నో బొమ్మలతో
                     చందమామ పాఠకులను అలరించాలని కోరుకుందాం.
                     బొమ్మలు చందమామ , శ్రీ శంకర్ సౌజన్యంతో

7 comments:

  1. దేవులపల్లి శ్రీనివాస మూర్తి: రామవరప్పాడు (పో): విజయవాడ

    ReplyDelete
  2. ఈ బ్లాగుని ఇప్పుడే చూస్తున్నా ! ఎం.వి.అప్పారావు గారు ఫేస్ బుక్ లో "లింక్ అడ్రస్" ఇచ్చారు. "చందమామ శంకర్ గారి " రామాయణ చిత్ర కావ్యం గురించి చెప్తూ...
    ఇంకా విశిదంగా చూడాలి. " చాలా బాగుంది " అని చెప్పటానికి "ఒక్క మెతుకు పట్టుకుంటే " సరిపోదూ.....మరీ బడాయి గాని...
    దేవులపల్లి శ్రీనివాస మూర్తి: రామవరప్పాడు (పో): విజయవాడ

    ReplyDelete
  3. శంకర్ గారి చందమామ రామాయణం చిత్ర కావ్యం చూస్తూంటే, చందమామ కోసం ఎదురుచూపులు చూసే నా చిన్నతనపు రోజులు కళ్ళ ముందు కదలాడి ఉబ్బితబ్బైయ్యానంటే నమ్మండి. కావాలంటే . నిఝుం కావాలంటే సీగానపసూనంబని బుడుగుని అడగండి.చెప్తారు.

    ReplyDelete
  4. చిన్నప్పుడు చదివిన చందమామ గుర్తొచ్చింది...
    చిత్రాలన్నీ చూస్తుంటే...
    @శ్రీ

    ReplyDelete
  5. శంకర్ గారి జీవితం గురించిన మరిన్ని వివరాలు వుంటే బాగుండేది. చిన్నప్పుడు శంకర్ గారి బొమ్మలు చూస్తూ గంటల తరబడి గడిపిన రోజులు గుర్తుకు తెచ్చారు.. థాంక్ యూ

    ReplyDelete
  6. CHANDAMAMANU gurinchi enthacheppina thakkuve.Naa6va yduna ante 6th year na Chandamama chadhavadam nerchukunnanu.Chanadamamalo kathalu entha mukhyamo CHITRALU anthakante MUkhyamu.Sri Sankar Garini gurinchi marintha vrasiunte inkabagugaundedi.Alage Chitra garini gurinchi kuda vraste baguntundi.
    Sri Apparao Gariki Mari Surekha Gariki DHANYAVADAMULU.
    Manohara Reddy.

    ReplyDelete
  7. 1965 nundi maa villagelo libraryki vellevanni.modataga chadivedi CHANDAMAMA .andulo chitr , sankar vesina bommalu kathaku anugunanga undevi.bomma chudagane katha konta varaku telisedi.ituvanti cgandamama,artistelu , nagireddi chakrapani garlu sadaa abhinandneeyulu mariyu telugu unnantavaraku chirasmaraneeyulu.

    ReplyDelete