Sunday, May 05, 2013

ఈరోజే కాదు ప్రతి రోజూ నవ్వుల మయం కావాలి !!

 నవ్వటం నిజంగా నవ్వులాటకాదు. మన నవ్వు మనల్ని నవ్వులపాలు 
చేయకుండా మరొకర్ని నవ్వులపాలు చేయకుండా వున్నప్పుడె ఆ నవ్వుకు
విలువ. అందుకే మేము మా హాసంక్లబ్ లో జోకు చెప్పేవాళ్ళకు, ఒక మతాన్ని
కాని, వర్గాన్నికాని  ఉదహరించకుండా జోకులు చెప్పాలని కోరుతుంటాం.
చాలామంది పంజాబీల గురించి జోకులు చెబుతుంటారు. పంజాబీలలో
ఎంతోమంది మేధావులున్నారు. ఇక అమాయకులు, తెలివి తక్కువవారు
అన్ని రకాలమనుషుల్లోనూ వుంటారు కదా!?


నవ్వు సహజమయిన పెయిన్ కిల్లర్ ! బాధానివారిణి. ఇది టెన్షన్ యుగం!
ఆఫీసునుంచో, షాపింగ్ నుంచో మనం ఇంటికి తిరిగి వస్తుంటే ట్రాఫిక్ తో
ఎంతో టెన్షన్. ఇలాటి ఈ స్పీడ్ యుగంలో మనం ఈ టెన్షన్లనుంచి దూరం
అవాలంటే మంచి జోకుల పుస్తకమో, కార్టూన్ పుస్తకమో మంచి రిలీఫ్ !!
మంచి జోకైనా, కార్టూనైనా ఎన్ని సార్లు చదివినా చూసినా, లేకపోతే జ్ఞాపకం
వచ్చినా కొత్తగానే వుంటుంది. మరో విశేషమేమంటే నవ్వాలంటే మన
ముఖంలో  17 కండారాలకు పనికలిగితే అదే చిరాగ్గా కోపంగా వున్నప్పుడు
43 కండరాలు పనిచేయాలి. అటువంటప్పుడు ఆ కండరాలచేత ఓవర్
వర్క్ చేయించడం ఎందుకు చెప్పండి. అందుకే ఈ నవ్వుల పండుగ రోజే
కాదు ఎప్పుడూ నవ్వుతూనే వుందాం! ఎదుటి మనిషిది ఏ భాషైనా, ఏ దేశం
యైనా మనకు ఎదురైనప్పుడు చిరునవ్వు చిందిస్తే మనం వారికి ఆప్తులవుతాం.
నవ్వుకు భాషలేదుకదా. "శాంతి నవ్వుతో ఆరంభమవుతుంది" అన్న మదర్
ధెరిస్సా మాట మీకు గుర్తుండే వుంటుంది. అందుకే మనం సదా నవ్వుదాం!
నవ్విద్దాం! మనసారా నవ్వుకుందాం !
                            "నవ్వేజనా సుఖినో భవంతు" 



3 comments:

  1. చాలాబాగున్నాయి సార్..!
    2,3,5,6 కార్టూన్లు కడుపుబ్బా నవ్వించాయి!
    మీకు కూడా నవ్వుల దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.

    ReplyDelete