Saturday, June 15, 2013

నాన్నల పండుగ

   నాన్నల పండుగ

ధర్మదాత సినిమాలో నాన్నగురించి మనసు కవి ఆత్రేయ ఇలా
అంటారు.
     "ముళ్లబాటలో నీవు నడిచావు
       పూలతోటలో మమ్ము నడిపావు
       ఏ పూట తిన్నావో - ఎన్ని పస్తులున్నావో
       పరమాన్నం మాకు దాచి వుంచావు"
       పుట్టింది అమ్మకడుపులోనైనా-పాలు
       పట్టింది నీ చేతితోనే
       ఊగింది ఊయ్యాలలోనైనా
       నేను దాగింది నీ చల్లని ఒడిలోన
       చల్లని ఒడిలోన"
 అలసిసొలసి నాన్న ఇంటికి రాగానే పిల్లలంతా నాన్న ఒడి
లోకే చేరిపోతారు. నాన్నంటే ఎంత భయం వుంటుందో అంత
ప్రేమ పిల్లలకు వుంటుంది.


మా నాన్నగారు ఆరోజుల్లో బ్యాంకునుంచి ఇంటికి వచ్చేటప్పటికి
చాలా పొద్దుపోయేది. రాత్రి పది గంటలవరకు నాన్నకోసం నిద్ర
ఆపుకొని ఎదురు చూసే వాళ్లం. నెలలో మొదటి వారమైతే ఆయన
మాకోసం తిసుకొని వచ్చే బాల, చందమామలకోసం నేను, అక్క
చెల్లి ఎదురుచూసే వాళ్ళం. మా నాన్నగారికి పుస్తకాలు, పత్రికలు
అంటే చాలా ఇష్టం అమ్మకోసం ఆంధ్రపత్రిక వీక్లీ, గృహలక్ష్మి
(స్త్రీల పత్రిక), తను Illustrated Weekly of India, Sankar's weekly,
Tit-Bits, Reader's Digest  పత్రికలు, Madras Mail దిన పత్రిక ,
ఆదివారం Sunday Stanadard (ఆదివారం ఆ పేరుతో Indian
Express వచ్చేది), ఆంధ్రపత్రిక, ఆంధ్రపభ దినపత్రికలు కొనే
వారు. ఇలా మాకు ఆయన మాకు పుస్తకాల పై అంతులేని
అభిరుచిని పెంచారు.


ఒకసారి స్కూల్లో మా తెలుగు మాస్టారు "మీరు బ్రాహ్మలా?’"
అని అడిగారు. "అవునన్నాను. "వైదీకులా?నియోగులా?"
అని అడిగారు. "తెలియదండీ" అన్నాను.ఆ రోజు రాత్రి నాన్న
గారిని అదే ప్రశ్న అడిగాను. "మనం మనుషులం" అన్నారు,
కొంచెం కోపంగా. నాన్నగారు ఇలాటి విషయాలంటే ఇష్టపడే
వారు కాదు. మాకు ఆదివారం పేపర్లో వచ్చే కామిక్స్ ( బొమ్మల
కధలు ) చదివి చెప్పేవారు. ఆ రోజుల్లో ఇంగ్లీషు సినిమాలు
మా  రాజమండ్రిలో ఉదయం ఆటలు వేసేవారు. మమ్మల్ని
సినిమా మొదట్లో చూపించే కార్టూన్ల సినిమాల కోసం తీసుకుని
వెళ్ళేవారు. కార్టూన్ సినిమాలు వరుసగా బొమ్మలు వేసి ఎలా తీస్తారో
చెప్పేవారు.


ఇలాటి నాన్నలను పిల్లలెలా మర్చిపోగలరు. కానీ ఈ రోజుల్లో
కాలం మారిపోయింది. కొందరు అమ్మలనూ నాన్నలను
వృర్ధాశ్రమాల్లో వుంచుతున్నారు. అందరూ అలా వుంటారని
అననుకానీ వృర్ధాశ్రమంలో వుంచడం ఓ ఫాషనుగా మారిపోయింది.
నాన్నలందరికీ పిల్లలందరీ తరఫున శుభాకాంక్షలు చెబుదాం !!
నాన్నలూ జిందాబాద్ !!


5 comments:

  1. For this generation fathers think that they are giving every thing to their children but some thing is missing.

    ReplyDelete
  2. ఇక్కడ ధర్మదాతలోని పాట రచయిత శ్రీ సినారె. ఆత్రేయగారని
    తప్పు దొర్లింది. క్షమించండి.

    ReplyDelete
  3. నాన్నంటే మగ అమ్మ!

    ReplyDelete
  4. సూర్యప్రకాష్ గారన్నట్లు , నాన్నంటే మగ అమ్మ , మరి అమ్మంటే ఆడ నాన్న అని చెప్పుకోవలసిన సమయమే . ఆ ఇరువురూ అలా చూడబట్టే పిల్లలు అత్యున్నత స్థానాలను అందుకోగలుగుతున్నారు . వయసు వ్యామోహంలో మరిచిపోయి , వృధ్ధాశ్రమాలలో చేర్చి , చిచ్చుకొడ్తున్నామనుకొంటున్నారు , చిచ్చు పెడ్తున్నారు వాళ్ళ ముది మనసులలో .
    వాళ్ళ ఆస్తులు కావాలి , వాళ్ళ అస్తులను కాపాడాలన్న జ్ఞానం మరుస్తున్నారు . పస్తులు పడుకోబెడ్తున్నారు .
    మీరు చక్కగా చూపించారు .

    ReplyDelete
  5. pls see 1000+telugu ebooks
    www.mohanpublications.com
    0883 2462565

    ReplyDelete