Sunday, October 25, 2009

నిప్పుకోడి -సిరాబుడ్డి





ఇది నిప్పుకోడి బొమ్మ కాదు సుమా! పాత కాలంనాటి సిరా బుడ్డి!!

ఈ నిప్పుకోడి బొమ్మచూసారా! మొదటి బొమ్మ రెక్క మూసి ఉంచినప్పుడు మామూలు బొమ్మగా అగుపిస్తున్నది. రెక్కని పైకి తీస్తే నిప్పుకోడి బొమ్మ కడుపులో సిరా పోసుకోవచ్చన్న మాట!. కలం పెట్టుకోడానికి చిన్న స్టాండు వుంచబడింది. ఈ బొమ్మ మా ఇంట్లో మా చిన్నప్పటి నుంచి వుంది.మా నాన్న గారు అప్పటి ఇంపీరియల్ బ్యాంకు లో(ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) యూరోపియన్ ఏజెంట్ మర్ఫీ దగ్గర టైపిస్ట్ గా పని చేసినప్పుడు ఆయన ఇంగ్లాండు తిరిగి వెళ్ళేటప్పుడు బహుమతి గా ఇచ్చారట! మా నాన్నగారు (యంవీ.సుబ్బారావు గారు) స్టేట్ బ్యాంక్ లో 1959 లొ పదవీవిరమణ చేసి 1981 లోకీర్తిశేషులయ్యారు. పుస్తక పఠనం, సంగీతం, స్టాంప్, నాణేల సేకరణ, ఆయన హాబీలు. మానాన్న గారి బుక్ కలెక్షన్, నా కలెక్షన్ తో నా దగ్గర మంచి హోమ్ లైబ్రరరీ వుంది.


ఇక నా పుస్తకాల గురించి, " నా కొత్త పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వను!
అవి ఇప్పుడు మీకు బుక్ షాపుల్లో దొరుకుతున్నాయి కనుక!

నా పాత పుస్తకాలు ఎవ్వరికి ఇవ్వను.
అవి ఇప్పుడు నాకు ఎక్కడా దొరకవు కనుక!!"

తప్పుగా అనుకోవద్దు.. ..కాని నా లైబ్రరీ విశేషాలను మీతో పంచుకుంటాను.

2 comments:

  1. పుస్తకాలు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. మీ గ్రంధాలయ విశేషాలు పంచుకుంటానన్నారు, అదే పదివేలు! ముందు మీదగ్గర ఉన్న పుస్తకాలు ఏకరువు పెట్టగలరు.

    ReplyDelete
  2. ఇంకేల ఆలస్యం...మేము రెడీ!

    ReplyDelete