Monday, November 09, 2009

గోదావరి తల్లికి అందాల ఆభరణాలు



గోదావరి నది పై ఇప్పుడు వున్న రెండు వంతెనలలో ఒకటి ఆసియాలోనే పొడవైన రోడ్డు రైలు వంతెన.పైనున్న రోడ్డు మీదనుంచి వాహనాలు,క్రింద రైళ్ళు,ఆ క్రింద నది పైన నావలు,లాంచీలు వెల్తుంటాయి.వీటన్నిటి కంటే ముందుగా 1900 లో ప్రారంభించిన హావలాక్ బ్రిడ్జి 100 సంవత్సరాలపైన పనిచేసి మూడో వంతెన నిర్మించాక విశ్రాంతి తీసుకొంటున్నది. మూడో బ్రిడ్జి అర్ధచంద్రాకారపు ఆర్చీలతో గొదావరికి కొత్త అందాలు ఇచ్చింది.ప్రతి రోజూ గొదావరి పై పాత బ్రిడ్జి నుండి బయలుదేరి రోడ్డు రైలు బ్రిడ్జి వరకు తీసుకొని వెళ్ళి మళ్ళి కొత్త/పాత బ్రిడ్జి దగ్గరకు మోటార్ బోట్ల పై షికారు వెళ్ళి రావటం ఎంతో ఆహ్లాద కరం గా ఉంటుంది.ఎన్నో ఏళ్ళుగా రాజమండ్రి లో ఉంటున్నా రెండు రోజుల క్రితమే మా అబ్బాయి వచ్చినప్పుడు ఆ బోటు షికారులో వున్న ఆనందం ఏమిటో తెల్సింది.ఈ సారి మీరు మా ఊరొచ్చినప్పుడు బోటు షికారు మరచిపోకండేం!! అన్నట్టు అలనాటి పాత వంతెన శంకుస్తాపన శిలాఫలకం ఆ వంతెనలాగే ఇంకా మనకు దర్శనమిస్తుంది!!

5 comments:

  1. చాలా బాగా వ్రాశారు ఇంకాఎన్నో మనగోదావరి అందాలు పాపికొండల ప్రాముక్యత వివరిస్తే చాలా బాగుంటుంది
    http://www.nagabrahmareddy.blogspot.com/

    ReplyDelete
  2. గోదారి అందాలను ద్విగుణీకృతం చేసే అద్భుతమైన ఫొటోలను అందించినందుకు కృతజ్ఞతలు.

    ReplyDelete
  3. గురువుగారూ,



    పాత వంతెన శిలాఫలకం చూపించినందుకు చాలా సంతోషం. అలాగే క్రొత్త వంతెన (రైలు రోడ్డు) కి సంబంధించిన శిలాఫలకం, ఎక్కడుందో వెతికి, దాని ఫొటో కూడా పెట్టండి !!

    ReplyDelete