Sunday, November 15, 2009

శ్రీ వడ్డాది పాపయ్య: అద్భుత వర్ణ చిత్రాల సృష్టి కర్త



కీ"శే"వడ్డాది పాపయ్య వర్ణ ఛిత్రాలు చూడనివారు,అభిమానించని వారు ఎవ్వరు ఉండరు.కాని దురదృస్ట వశాత్తు ఆయన గురించి సరైన ప్రచారం జరగలేదని పిస్తుంది.చక్రపాణి సంపాదకత్వంలో వెలువడిన చందమామ,యువ మాస పత్రికల ముఖచిత్రాలు, లోపలి కధలకు బొమ్మలు ఆయన వేలాదిగా వేసారు. చందమామకు ముందు బాలన్నయ్య,బాలక్కయ్యల "బాల" పత్రిక(1947)లో ఆయన లటుకు-చిటుకు శీర్షికకు,పోలికలు అనే బొమ్మలు,కార్టూన్లు వేసారు.ఆ బొమ్మలు (బాల) కూడా మీకోసం ఇక్కడ చూపిస్తున్నాను.శ్రీ వడ్డాది శ్రీకాకుళం లో 1921 సెప్టెంబర్ 10న జన్మించారు.వీరి నాన్నగారు శ్రీరామమూర్తివృత్తి రిత్యా డ్రాయింగ్ టీచర్.శ్రి పాపయ్యగారు రేఖాచిత్రాలు,ఏక వర్ణ,బహు వర్ణ చిత్రాలు గీసారు.ఆయన చిత్రాలు స్త్రీ ల పైనే ఎక్కువగా వున్న మాట నిజమ ఐనా వివిధ విషయాలపై కూడా చిత్రాలు గీసారు.ఈనాడు యువతులపై ఆసిడ్ దాడులు చేస్తున్న కొందరు యువకుల్ని
మానవ మృగాలుగా మనం వర్ణిస్తున్నాము.ఆయన ఏనాడో "యువ"లో ఈనాటిఆధునిక యువకున్ని "మృగము"అనే బొమ్మ ద్వారా చిత్రించాడు.ఆయన చిత్రకళారంగం లో చూపిన ప్రతిభ మరువలేనిది.అందుకే ఆయన బొమ్మలు ఈ నాటికీ అభిమానుల గుండెల నుంచి చెరిగి పోలేదు.నేను సేకరించి ఆల్బం లో పదిలపర్చుకొన్న కొన్ని బొమ్మలు మీ కోసం.

4 comments:

  1. మీరన్నది నిజమే.వపా గా ప్రసిద్ధులైన వడ్డాది పాపయ్య శాస్త్రి గారి చిత్రాలంటే నాకు చాలా ఇష్టం.వాటర్ కలర్స్ తోనే అద్భుతాలు ఆవిష్కరించారాయన

    ReplyDelete
  2. వడ్డాది పాపయ్య గారి చిత్రాలు ఎప్పటికీ ప్రత్యేకమైనవే. ఆ స్థానాన్ని భర్తీ చేయటం చాలా కష్టం. అంతటి ఉన్నతమైన చిత్రకళను అభిమానించని వారెవరు. చాలా మంచి చిత్రాలను చూపించారు. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు.

    ReplyDelete
  3. వ పా గా ఎన్నెన్నో వర్ణ చిత్రాలని పాఠకులకి అందించి అలరించిన ఆయన్ని మా ముందు సాక్షత్కరించినందుకు మీకు నెనర్లు.చందమామ యువే కాకుండా.. స్వాతి కూడా ఆయన చిత్రాల వల్లే ఒక్క వెలుగు వెలిగాయంటే అతియోశక్తి కాదు .

    ReplyDelete
  4. చందమామ తెలుగు వారికి ఎంత మేలు చేసిందో , వడ్డది పాపయ్య చిత్రాలు చందమామ కి అంత మేలు చేసాయి.
    ఒకసారి అపుడెప్పుడో ఈటీవీ లో చూసా ఆయన గురించి చెప్తూ, ఆయనకి ప్రచారం, పేరు అసలా ఇష్టం ఉండదని. ఆయన ఎక్కడా ఇంటర్వ్యూ లు అవి కూడా ఇచ్చేవారు కారని (సరిగ్గా గుర్తులేదు ). ఆయన బొమ్మలు బాలల (నిజానికి ఆబాల గోపాలానికి) ఊహాశక్తిని పెంపొందించడానికి ఎంత తోడ్పడ్డాయో మాటల్లో చెప్పలేం. ముఖ్యంగా చందమామ అనగానే విక్రమార్కుడు, బేతాళుడి బొమ్మలు కళ్ళ ముందు కదులుతాయి నాకు.

    ReplyDelete