Wednesday, June 22, 2011

త్రీ రోజెస్ టీ

మా హాసంక్లబ్ లో నేను, మితృడు ఖాదర్ ఖాన్ కలసి రూపకల్పన చేసిన ఈ స్కిట్ హాస్య ప్రియుల
మన్నన పొందింది. ఆ స్కిట్ ను మీతో పంచుకుంటున్నాను.
ఖాన్ : హల్లో రావుగారు, మీరు మద్రాసు, బొంబాయిలకు వెళ్ళారని తెలిసింది, ఎప్పూడొచ్చారు ?
రావు: నవ్వేనండి !
ఖాన్ : నవ్వడం కాదు బాబూ! ఊరినుంచి ఎప్పుడు వచ్చారనడుగుతున్నాను.
రావు: చెప్పా కదా, నవ్వేనని !
ఖాన్: చత్ ! మళ్ళీ అదే కూత ! నీ పని , నాపని ,మన హనుమంతరావు పని హాసంక్లబ్లో ప్రతి
ఒక్కరిపని నవ్వడం ,నవ్వించడం అని అందరికీ తెలుసు! ఊరినుంచి ఎప్పుడు వచ్చావో
ఆ సంగతి చెప్పవయ్యా!
రావు: ఎన్నిసార్లు చెప్పాలి. అసలు నీకు ఆంగ్లభాషా పరిజ్ఞాణం అసలు లేనట్లే వుందే! నవ్వంటే
ఇప్పుడే అన్న తెలుగు అర్ధం తెలియదనుకోలేదు! అవునూ ఊర్లో అందరికీ మీ తాతగారి
గురించి గొప్పలు చెబుతున్నావట!



ఖాన్ : గొప్పలు కాదు.ఉన్నమాటే! మా తాతగారు వీదిలోకి వస్తే జనం అలా దూరంగా జరిగి
నిలబడేడేవారట!
రావు : అంటే మీ తాతగారు నెలకో, రెండు నెలలకో స్నానం చేసేవారన్న మాట !
ఖాన్ : మా తాతగారు ఎన్నో మేడలు, భూములు, ఆస్తులూ వదలి పరలోకానికి పోయారు
తెలుసా? !
రావు: ఓస్! ఇంతేనా ?! మా తాతగారు ఈ భూప్రపంచాన్నే వదలి పరలోకానికి పోయారు !
అంటే మీ తాతకన్నా మా తాతే గొప్పకదా?!
ఖాన్ : (తనలో) మా తాతగారిగురించి ఏం చెప్పినా తక్కువ చేసి మాట్లాడుతున్నాడు..వీడి
రోగం కుదర్చాలి. (పైకి) , చాలా కాలం తరువాత ఇంటికి వచ్చావు. టీ త్రాగి
వెళ్ళు !
రావు: (టీ కప్పు అందుకుంటూ) ఇదేమి టీ , కొత్త గోదారి బురద నీళ్ళలా వుంది ?!
ఖాన్ : మంచి రంగు ! త్రీ రోజెస్ టీ తాగు!
రావు: ఇదేమిటీ ,ఏదో కంపు కొడుతుంది ?!
ఖాన్: కంపు కాదు, వాసన అనాలి. త్రీ రోజెస్ టీ తాగు , బాగుంటుంది.
రావు: ( డోక్కుంటూ) అమ్మో! యాక్ ! వాంతొస్తుంది!
ఖాన్ : మొన్న శుక్రవారం మా శ్రీమతి ఊరెళుతూ, మీ దగ్గరకు అడ్డమైన సన్నాసులు
వస్తుంటారు, వాళ్ళకి ఇవ్వచ్చునంటూ టీ కలిపి ఫ్లాస్కులో పోసింది, శుక్రవారం,శనివారం,
ఈ రోజు ఆదివారం, అంటే మొత్తం మూడు రోజులు, అదే "త్రీ రోజ్సు" టీ అన్నమాట !!
రావు : బాబోయ్ ( బయటకు పరిగెడతాడు)
ఖాన్ : లేకపోతే నా ఇంగ్లీషును, మా తాతగారిని తక్కువ చేసి మాట్లాడతాడా?! రోగం కుదిరింది !

5 comments:

  1. భలే ఉందండి.. ఇది వీడియోలా చూసేసి నవ్వేసా...

    ReplyDelete
  2. రాజమండ్రీ తీయని జ్ఞాపకాలలో ఇదొకటి !!

    ReplyDelete
  3. బాగుందండి.
    ఇది ఎక్కడ, ఎప్పుడండి...రెండో ఫోటో లో ఫణిబాబు గారు కూడా వున్నటున్నారు కదండి.

    ReplyDelete
  4. ప్రబంధ్ చౌదరిగారు, నేను, నామితృడు హనుమంతరావు హాసం క్లబ్ పేరిట ప్రతి నెల మూడవ ఆదివారం హాస్య కార్యక్రమాలు గత ఏడేళ్ళ నుంచి
    రాజమంద్రిలో నిర్వహిస్తున్నాము. మీరు ఊహించింది కరక్టే . ఆ ఫొటోలో వుంది శ్రీ ఫణిబాబుగారు ప్రక్కన వారి శ్రీమతి లక్ష్మి గారు. రాజమండ్రిలో
    ఉన్నంతకాలం శ్రీ ఫణిబాబుగారు మా హాసం కార్యక్రమాలకు వచ్చేవారు.

    ReplyDelete