Wednesday, June 29, 2011

నేనంటే ఎంత ప్రేమండి రమణగారూ!

నిన్నటి బ్లాగులో శ్రీ ముళ్లఫూడి వెంకటరమణగారి పుట్టిన రోజు అని వ్రాస్తే కొందరు
మితృలు తప్పుగా వ్రాశావు, జయంతి అని వ్రాయాలి అన్నారు. కానీ నా దృష్టిలోనే
కాదు రమణగారి అశేష అభిమానుల దృష్టిలో రమణగారు మన మధ్యే వున్నారు.
తన చమత్కారాల మాటలతో మనలను నవ్విస్తూ పలకిరిస్తూనే వున్నారు. అది
నిజమని నిన్ననే రుజువయింది !



బెంగుళూరు నుంచి మితృలు శ్రీ బి.విజయవర్ధన్ వారం రోజులక్రితం నాకు కొరియర్
చేసిన బాపు బొమ్మలకొలువు ప్రత్యేక సంచిక, మార్చి 6న మద్రాసులో జరిగిన బాపు
గారింట్లో జరిగిన సభ సిడీ , చికాగో నుంచి నా కజిన్ డాక్టర్ యం.యల్.హనుమదాస్
యం.డిపంపిన రమణగారి కోతికొమ్మచ్చిఆడియో సిడీ నిన్ననే ఆయన పుట్టిన రోజునే
నాకు చేరడం శ్రీ రమణగార్కి నా పై ఉన్న అపారమైన అభిమానానికి గుర్తు కాదా!
గత జనవరి 26న ఆయన పెళ్ళి రోజు శుభాకాంక్షలు పంపితే " నామీద మీకెంత
ప్రేమండీ ?" అంటూ ఫోనులో రమణగారు అన్న మాటలు ఇంకా నా చెవుల్లో విని
పిస్తూనే వున్నాయి. అవును, అందుకే ఆయన తన పుట్టిన రోజుకు తన అభిమాన
అభిమానినైన నాకు ఈ కానుకలను పంపించారు. ధన్యుణ్ణి రమణగారు.
( శ్రీ రమణగారి నవ్వుల తలపులు పంచుకుంటూ శ్రీ చంద్రశేఖర్, నేను, శ్రీ బాపు,
ప్రఖ్యాత కన్నడ చిత్ర నిర్మాత శ్రీ భక్త-- ఫొటొ శ్రీ బి.విజయవర్ధన్ , నిన్ననే
విడుదలయిన రమణగారి "ముక్కోతి కొమ్మచ్చి")

6 comments:

  1. 'సు'రేఖగారు, 'సు' ధామగారు, 'సు' శీలగారు, 'సు' నయనగారు, 'సు' అదేదో బోల్డ్ టైపుగారు, వీళ్లందరూ కార్టూనిస్టులు. మనం ఆనందించాం, ఆనందిస్తున్నాం వారి కార్టూన్లు. వాకే. వాళ్లందరికీ స్పూర్తి "బాపూ రమణలు"ట. వాకే. "నా సొగసే కని మరుడే దాసుడుకాడా?! అహా దాసుడుకాడా?!" కీ, "ఓ తాలార్నెత్తిమీద గోరింకా......."......"అది నాగరం రా వెర్రినాగన్నా!" అనే కార్టూన్ కీ, భాష్యాలు యెవరు చెప్పగలరు? కార్టూనిష్టులంటే ఆర్కే లక్ష్మణ్, వూమెన్ చాండీ వగైరాలనుకొంటే, బాపూ రమణలది యే స్థాయి????!!!!

    ReplyDelete
  2. @Krishansree garu,

    Oomen Chandi??! I know the great Cartoonist Oomen from Andhra Sachitra Vara Patrika of 1960s and 70s. Whether Oomen's full name is Oomen Chandi? If you know any details of this first ever Political Cartoonist known to Telugu people, please inform. I had earlier written a small article with the help of Shri Jayadev. We could not get any details of Oomen then. You can read that article with the following link:


    http://saahitya-abhimaani.blogspot.com/2009/08/blog-post_02.html

    ReplyDelete
  3. చిన్న సవరణ. ముక్కోతి కొమ్మచ్చి విడుదల అనివార్యకారణాలవల్ల ఆలస్యమయింది. వచ్చేవారం విడుదలవుతుంది. ఈ పుస్తకంతో బాటు శ్రీ ముళ్ళపూడి
    నవలీకరించిన భార్యాభర్తలు, వెలుగునీడలు సినిమానవలలు కూడా హాసం బుక్స్ వారిచే విడుదలకాబోతున్నాయి.

    ReplyDelete
  4. ముళ్ళపూడిగారి పుట్టినరోజున వారినుండి అన్నికానుకలను మీరు అందుకోవడం చాలా సంతోషంగానే ఉన్నా ..మనసులో ఓమూల కుసింత ఈర్ష్యగా కూడా ఉంది సుమండీ... పద్ధెనిమిదేళ్ళ క్రితం ఓరోజు నేనూ పొద్దున్నే ఆయనకు పుట్టినరోజుశుభాకాంక్షలు చెప్పాను...ఎంత మొహమాటపడిపోయారో....అలాగే ఇలా ఫోన్ చేసి గుర్తుపెట్టుకుని చెప్పారే...అని కూడా సంతోషంగా అన్నారు..మీ పోస్టు చూసాక నాకూ ఆరోజు గుర్తొచ్చింది మళ్ళీ...ఆయనకి పుట్టినరోజులే కానీ జయంతులు లేవు..లేవు.

    ReplyDelete
  5. మిత్రులు అప్పారావు గారు పొరపాటు 'పడ్డారు'. వారిని లేపడానికి ఈ నాలుగు ముక్కలు:
    ౧.ముక్కోతి కొమ్మచి కవరు అదేనా? మరి దాని మీద హాసం లోగో లేదేం?
    ౨. నిన్న రిలీజు అయ్యిందన్నారు, మళ్ళీ కాలేదన్నారు. వాటికి అనివార్య కారణాలు ఉన్నాయన్నారు. అవేమిటో నాకు ఎవరైనా చెపితే బాగుండును.
    ౩. పుస్తకం రిలీజు అంటే సినిమా రిలీజు కాదు. సినిమా హాల్సు బుక్ లా బుక్ షాపులు బుక్ చేయరు. ౨౮ న రిలీజు చేస్తామని మేమైతే ఎక్కడా ప్రకటన ఇవ్వలేదు. సభ ఏదీ పెట్టుకోలేదు. తన పుట్టినరోజు పూట పుస్తకం రిలీజు చేశారణి అన్నా రమణ గారు హర్షించరు. మొదటి భాగం జూను ౨౮ న చేస్తామంటే , వద్దు రెండు రోజులు ఆగి చెయ్యమన్నారు. రెండవ భాగం బాపు పుట్టిన రోజున అనుకుంటే అయన ఒప్పు కోలేదు. ఇదీ వాళ్ళ తత్వం. దాన్ని గౌరవిద్దాం.
    ౪. పుస్తకం తయారీ అంత సులభం కాదు. ముక్యంగా బాపు గారు ఒకే చేయాలి. టైం పడతాయి. ఎవరో ఏదో ఊహించుకుని రాసేసి తరవాత దానికి సంజాయిషీలు వెతికితే ఎలా? నా వరకు నాకు పుస్తకం బాగా రావడమే ముఖ్యం. పైగా నేను ఎం చేస్తున్నానో నిమిష నిమిషానికి చాటు కొడం నాకు ఇష్టం వుండదు.

    నమస్కారములతో
    ఎమ్బీఎస్ ప్రసాద్

    ReplyDelete
  6. మితృలు శ్రీ ప్రసాద్ గారికి ,ఒకసారి మూడో భాగం జూన్ 28న వస్తుందని మీరే చెప్పారు. రమణగారి పై అభిమానంతో, మన హాసం ద్వారా వస్తున్నదనే ఆనందంతో
    వ్రాశాను. మీ మనసు నొప్పిస్తే క్షంతవ్యుణ్ణి !నిన్న మీకు నేను ఫోను చేసినప్పుడు మాత్రమే నాకు తెలిసింది.

    ReplyDelete