Saturday, July 24, 2010

"ఈనాడు" శ్రీధర్ కార్టూ‍న్ల పుస్తకం




ఈనాడు శ్రీధర్ కార్టూన్ల పుస్తకం
ఈనాడులో శ్రీ శ్రిధర్ గారి కార్టున్లు చూసినప్పుడు ఆర్కే లక్ష్మణ్ గారి కార్టూన్
పుస్తకాలలా శ్రీధర్ గారి కార్టూన్ల పుస్తకం కూడా వెలువడితే బాగుండునని
చాలామంది ఆయన అభిమానులకు కలిగే వుంటుంది. ఈనాడు ఆగస్ట్,1999
లో ఈనాడు కార్టూన్లు శిధర్ పేరిట 10 X 8.5" సైజులో 214 పేజీలతో చక్కని
బైండు పుస్తకం రూ.70/-లకు విడుదలచేసింది. ఈనాడు పత్రికలో శ్రీధర్ 30
నవంబర్ 1982 నుండి 13 జూన్ 1999 వరకు వేసిన కార్టూనను
ఇందులో చూడొచ్చు. శ్రి ఆర్కే లక్ష్మన్ గారి తరువాత తెలుగులో రాజకీయ కార్టూనిస్ట్ గా
శ్రిధర్ ప్రధమ స్థానంలో నిలుస్తారనటంలో అతియోశక్తి లేదు.
శ్రీ రామోజీ రావు గారు పుస్త్రకంలో తన అభిప్రాయాన్ని ఇలా చెప్పారు.
" నేను నాటి,పాదుచేసి, పెంచిన మొక్క గురించి ఏం చెప్పను? "ఈనాడు" ప్రాంగణంలో
నా కళ్ళ ముందే కార్టూన్ కల్పవృక్షం గా ఎదిగిన శ్రిధర్ గురించి ఎంతని చెప్పను? నాటి
నా ఆలొచనకు శ్రీధర్ లో అంతర్లీనంగా ఉన్న తపన, వృత్తిపట్ల అంకిత భావం తోడయ్యాయి.
ఇవాళ ఆర్.కె.లక్ష్మణ్ల్ లాంటి అగ్రశ్రేణి కార్టూనిస్టుల సరసన సుస్ధిర స్థానాన్ని శ్రీధర్ కు
సముపార్జించిపెట్టాయి. ఈనాడులో పుట్టి ఈనాడులో పెరిగిన శ్రిధర్ తో నా అనుబంధం-
తండ్రీబిడ్డల వాత్సల్యం. శ్రీధర్ లాంటి కార్టూనిస్ట్ "ఈనాడు"లో తయారయినందుకు
పుత్రోత్సాహంతో పొంగిపోతున్నాను."
ఇక శ్రీధర్ ఇలా అంటారు, "స్కాములూ, అవినీతి, అసమర్ధతా, నిరుద్యోగం, కరవూ,
చెత్తా చెదారం, బాధలూ, నీటి కొరతా, కరెంటు కోతా, అధిక ధరలూ, పన్నులూ కొనసాగినంత
కాలం నవ్వక తప్పదు... అంటే ,జీవిత పర్యంతం నవ్వాలి. అదంతే- నవ్వండి !"
ఆగస్టు 24, 1908 లో శ్రీధర్ గారిని కలిసే అదృష్టం నాకు కలిగింది. ఆనాటి ఫొటొ మరొ
సారి, మీ అందరికోసం.

6 comments:

  1. మంచి సమాచారం అందిస్తున్నారు.
    మీకు అభినందనలు.

    ReplyDelete
  2. This is first time I see Sridhar's Photo. Thanks for sharing with us.

    ReplyDelete
  3. >> ఆగస్టు 24, 1908 లో శ్రీధర్ గారిని కలిసే అదృష్టం నాకు కలిగింది.

    శ్రీధర్ అంత పెద్దోడా!!

    ReplyDelete
  4. >> శ్రీధర్ అంత పెద్దోడా!!

    అహా కాదు .. అతని నైపుణ్యం అంతకంటే పెద్దది !!

    ReplyDelete
  5. @ సురేఖ గారు,
    శ్రీధర్ గారిని చూపించినందుకు ధన్యవాదాలు!

    @ అబ్రకదబ్ర గారు ,

    >> ఆగస్టు 24, 1908 లో శ్రీధర్ గారిని కలిసే అదృష్టం నాకు కలిగింది.

    శ్రీధర్ అంత పెద్దోడా!!>>

    అంత (వయసు లో ) పెద్దాయనని పట్టుకుని పెద్దోడా అని ఏకవచనమా ? తప్పు కదండీ :)

    ReplyDelete