Sunday, August 21, 2011

కృష్ణ లీలలు

శ్రీ కృష్ణ లీలలు ఆబాలగోపాలానికి ఆనంద దాయకం.ఆ కృష్ణభగవానుని జయంతి
అందరికీ పండుగే ! శ్రీ బాపు బాలకృష్ణుణ్ణి ముద్దులు మూటగట్టేట్టుగా చిత్రీకరించిన
ఈ అందాల ముద్దుల నాట్య కృష్ణుణ్ణి చూడండి ! 777 పేజీల శ్రీ ముళ్లపూడి వారు
వ్రాసిన "రమణీయ భాగవత కధలు" పుస్తకానికి అలంకరణగా నృత్యం చేస్తూ మురళి
పై ఓం కార నాదం చేస్తూ అలరిస్తాడు.
ఇక బాల కృష్ణుని పై బాపు ఎన్ని చమత్కార గీత(తా)లు రచించారో ! అలనాటి
"జ్యోతి" మాస పత్రికలో కృష్ణజన్మాష్ఠి వేసిన ఈ కార్టూన్ లో యశోద భర్తతో తను
ఆ రోజు పచ్చడి చేయక పోవడానికి కారణం చిన్ని కృష్ణుడి పైకి తోసేయడం ఎంత
బాగా చూపించారో చూడండి!
పెద్ద పర్వతాన్నే ఎత్తి గోకులాన్ని కాపాడిన కృష్ణుడికి వానొస్తే ఓ కొండనే గొడుగ్గా
ఉపయోగించడం ఓ లెక్కా అన్నట్లు బాపు వేశారు.
ముద్దుల కృష్ణుడికి వెన్నముద్దలంటే ఇష్టం కదా! ఒకవైపు వెన్న దొంగిలిస్తున్న
ఈ నల్లనయ్య మరో వైపు బుద్ధిమంతుడిలా అమ్మను వెన్నకోసం వేడుకుంటున్నాడు!
బాపుగారూ , మిమ్మల్ని ఎలా ఎలా అభినందించాలి?!! అదిగో మీకు కోపం వస్తున్నది.
పొగిడితే మీరు ఆ దేవదేవునికే నమస్కరిస్తారు.



బాలకృష్ణుడు బండి రూపంలో వచ్చిన శకటాసురిడిని సంహరించాడు. అప్పటి నుంచి
తమ బళ్ళ వైపు కృష్ణుడు వెళితే బండి వాళ్ళు ఎంత భయపడతారో శ్రీ బాపు ఈ బొమ్మ
ద్వారా చూపిస్తూ నవ్వించారు.
అందరికీ శ్రీకృష్ణాష్ఠమి శుభాకాంక్షలు.

ఈ బొమ్మలు శ్రీ బాపు గారు, "జ్యొతి" రసికజన మనోభిరామం సౌజన్యంతో

5 comments:

  1. చాలా చాలా బాగుంది. కృష్ణాష్టమి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. చాలా బాగున్నాయి.అందించినందుకు మీకు ధన్యవాదాలు.మీకు కూడా నల్లనయ్య జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. ముళ్ళపూడి వారు చెప్పినట్టు, బాపు చిత్రాల్లో అనవసరమైన గీత ఒక్ఖటి కూడా ఉండదు. చక్కని కార్టూన్లు అందించేరు. ఇవి ఏ సంకలనం పుస్తకంలో ఉంటాయో తెలియజేయండి.

    ReplyDelete
  4. అందరికీ ధన్యవాదాలు ఈ కార్టూన్లు 1964 లో జ్యోతి బుక్స్ ,విజయవాడ వారు ప్రచురించిన
    రసికజన మనోభిరామము అను N2O ( వెల ఒక రూపాయి మాత్రమే ) పుస్తకం లోనివి.ఈ పుస్తకాన్ని
    అతి జాగ్రత్తగా దాచుకున్నాను. "నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను ! అవి ఇప్పుడు మీకు బుక్
    షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి! అలానే నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను ! అవిప్పుడు
    నాకు ఎక్కడా దొరకవు కాబట్టి !!"

    ReplyDelete
  5. ========........
    .......
    "నా కొత్త పుస్తకాలు ఎవ్వరికీ ఇవ్వను ! అవి ఇప్పుడు మీకు బుక్
    షాపుల్లో దొరుకుతున్నాయి కాబట్టి! అలానే నా పాత పుస్తకాలూ ఎవ్వరికీ ఇవ్వను ! అవిప్పుడు
    నాకు ఎక్కడా దొరకవు కాబట్టి !!"

    ......
    ==========================
    అప్పారావు గారు, భలే చెప్పారు!... మీ మాటలు చూస్తుంటే, చిన్నప్పుడు 9 వ తరగతి లో నేను చదివిన "సొంత పుస్తకం " అన్న తెలుగు పాఠం గుర్తుకు వచ్చింది...

    ReplyDelete