Thursday, August 05, 2010

చందమామయ్య చక్రపాణి



మా చందమామయ్య చక్రపాణి

ఆ నాటి పాఠకులకు శ్రీ చక్రపాణి బెంగాలి నవలలను తెలుగులోకి
అనువదించిన రచయితగా తెలుసు. మరి కొందరికి "ఆంధ్రజ్యోతి"
మాస పత్రిక ద్వారా తెలుగు సాహిత్యాన్ని కొత్త దారులకు తీసు
కొని వెళ్ళిన సంపాదకుడిగా తెలుసు. 12 భాషలలొ "చందమామ"
ద్వారా పిల్లలకు విజ్ణాన వికాసాలను, చదివే అలవాటును పెంచిన
మావయ్యగా ఆ రొజుల్లో ని పిల్లలకు తెలుసు. స్క్రీన్ ప్లే రచయితగా
నిర్మాతగా సినిమా ప్రేక్షకులకు తెలుసు. ఆయన హైదరాబాదులో
కొంత కాలం "యువ" మాసపత్రికను నిర్వహించారు. "కినిమా"
పేరిట సినిమా మాస పత్రికనూ నడిపారు.
శ్రీ చక్రపాణి దేవదాసు లాంటి బెంగాలి నవలలను అవి తెలుగు నవలలే
అన్నట్లుగా అనువదించారు. ఆయన స్వయంకృషితో బెంగాలీ నేర్చు
కొన్నారు ముక్కుసూటిగా నిర్మొహమాటంగా మాట్లాడటం ఆయన
అలవాటు.
నేనంటే నేనే
ముళ్ళపూడి వెంకట రమణగారు ఒక సారి చక్రపాణిగారి వద్దకు
ఇన్ట ర్వ్యూ కోసం వెళ్ళి ఇలా అన్నారు.
" నేను ఆంధ్రపత్రిక నుంచి వచ్చానండి"
" ఎందుకూ"
" మీతో ఇంటర్వ్యూ చేసి"
" ఎందుకూ"
" మీ గురించి రాద్దామని"
" నా గురించి చెప్పడానికి ఏముంది.. నువ్వు రాయడానికేముంది.
నేను నేనే "
"అంతేనా"
"అంతేగదా" అలా ఇన్టర్వ్యూ ముగిసింది.
అలా నిర్మొహమాటంగా సమాధానాలు చెప్పడం చక్రపాణి గారికే చెల్లు!

చక్రపాణి గారు తనమీద తనే జోకులు వేసుకుని, విమర్శించుకోవడం
కూడా వుంది , మన బాపుగారిలా. " చంద్రహారం" సినిమా దెబ్బతిన్న
తరువాత, " ఎందుకు దెబ్బతినదూ ? ఎప్పుడు చూసినా హీరో నిద్దర
పోతుంటే ఎవడు చూస్తాడూ?" అన్నారట ఆయన. మరోసారి యన్టీఆర్
"దాన వీర శూర కర్ణ" ప్రారంభిస్తూ" నేను కృష్ణుడు,ధుర్యోధనుడు,కర్ణుడు
మూడు పాత్రలూ వేస్తున్నాను , దర్శకత్వం కూడా నేనే " అని ఆయనతో
చెప్పారట. డబ్బాలోంచి పొడుగాటి సిగరెట్ తీసి వెలిగించి ఘాటుగా పొగ
పీల్చి " బానే వుంటుందిలే. మూడు ఏషాలూ బాగానే చేస్తావు.డైరెక్షన్
కూడా పెట్టుకున్నావు.అన్ని వేషాలూ నువ్వే ఏసేస్తే చూసిన జనం నువ్వు
కక్కూర్తి పద్దావనుకుంటారేమో అది ఆలోచించు" అన్నారట చక్రపాణి.
ఆయన మాట తీరు తెలిసిన మనిషి కనుక రామారావు చిరునవ్వు నవ్వి
ఊరుకున్నారట.
చక్రపాణి జయంతి.నాడు ( 05.ఆగష్టు) ఆ మహావ్యక్తికి జోహార్లపిస్తూ.............
( "హాసం" హాస్య సంగీత పత్రికలో శ్రీ రావి కొండలరావుగారి వ్యాసం, సాహిత్య
అకాడమీ ప్రచురణ ,వెలగా వెంకటప్పయ్య రచన "చక్రపాణి" పుస్తకం ఆధారంగా)


No comments:

Post a Comment