Sunday, August 29, 2010

ఉయ్యార్ టెల్గూస్ !!



ఈ రోజు తెలుగు భాషా దినోత్సవం!
తెలుగు భాషను వ్రాయాలన్నా, మాట్లాడాలన్నా
చాలామంది తెలుగు వాళ్ళకి నామోషీ!. మారుతున్న
కాలంతో బాటు మన పిల్లలకు ఇంగ్లీషు చదువు
నేర్పాల్సిందే ! అందుకు తప్పులేదు. కాని కనీసం
పిల్లలు ఇంటికి వచ్చాకనైనా వాళ్లకి తెలుగులో
మాట్లాడటం, వ్రాయడం నేర్పాలి. అమ్మను, నాన్నను
అలానే పిలవడం నేర్పించాలి. పిల్లలకు తెలుగు కధలను
చెప్పాలి. కధలంటే హారీపోటర్స్ కధలే అనుకొనే
ఆలోచనకు అమ్మా,నాన్న స్వస్తి చెప్పాలి. ఈసప్
కధల వంటి మంచి కధలు మనకు పంచతంత్రం
కధల ద్వారా ఏనాడొ అందాయి. "బాల" లాంటి ఆనాటి
పిల్లల పత్రికలో మన పిల్లలకు పనికి వచ్చే ఎన్నో
ఆటలు, పాటలు వేశారు.ఆ నాటి "బాల" పత్రికల
సంపుటాలు ఈనాడూ వాహినీ బుక్ ట్రస్టు ద్వారా
దొరికే అవకాశం వుంది కనుక పిల్లలకు కొని
చదివే అలవాటును చేయండి. అప్పుడే, వ్యవహారిక
భాషగా వున్న తె నిజమైన నివాళి !
:**************************
తెలుగు భాషంటే ఎందుకో కొందరికి చులకన !
తెలుగువాడంటే తెలుగోడికే పలుచన !
కష్టమనుకొనే తెనుగుకు సులువు పదాలు నేర్పారు గిడుగు !!
ఇక మమ్మీలకు దూరమై తెలుగు అమ్మ వైపు వేద్దాం అడుగు !!
* సురేఖ *
బాపుగారి కార్టూను స్వాతి సౌజన్యంతో

2 comments:

  1. డియర్ సురేఖగారూ!

    చక్కగా వ్రాశారు, ఇప్పుడు దొరకని కార్టూన్లు అందించారు!

    చాలా సంతోషం.

    ధన్యవాదాలు.

    ReplyDelete
  2. రాష్ట్రంలో ఉగాది పర్వదినం నుంచి పూర్తి స్థాయిలో తెలుగులోనే పరిపాలన ఉంటుందని 25.2.2010న ముఖ్యమంత్రి రోశయ్య వెల్లడించారు.తెలుగు భాష అభివృద్థికి ప్రత్యేకమైన మంత్రిత్వ శాఖనూ ఏర్పాటు చేస్తామన్నారు.తొందరగా అమలైతే బాగుండు.

    ReplyDelete