Thursday, September 16, 2010

చేతిలో రహస్యం


మనం ఏదైనా రాయాలన్నా, ఏ పనైనా చెయ్యాలన్నా చెయ్యి
వుండల్సిందే. అందుకనేనేమో ఇదిగో ఈ పని "చెయ్యి" అని
చెబుతుంటారు. పని చెయ్యాలంటే చెయ్యి కావాలి కాబట్టి
"చెయ్యి" అనే పదం అందునుంచే పుట్టిందనుకుంటాను. చాలా
ఏళ్ళనుంచి మన దేశాన్ని పాలిస్తున్న ఒక రాజకీయ పార్టీ
గుర్తు చెయ్యే! మొదట "కాడెద్దులు", "ఆవూ దూడా" గా
మారి ఇప్పుడేమో ""హస్తం గా అవతారం ఎత్తి "హస్తం"గా మిగిలి
పోయింది. అసలు ఈ చేతికి ఎన్ని విశేషాలో! భగవంతుడు
చూపించేది అభయ హస్తం. ఆయనకున్న నాలుగు చేతుల్లో
ఒక చెతితో మనకు రక్షను చూపిస్తాడు. ఇక ఎడాపెడా జీతంతో
బాటు అన్ని మార్గాలా సంపాదించే వాడిని,"వాడికేం, రెండు
చేతులా సంపాదిస్తున్నాడు" అంటారు ఎవరైనా మనను దగా
చేస్తే, చూసావా,వాడు చెయ్యిచ్చాడు అంటాము.(అందుకేనేమో
కొదరంటారు ఆ పార్టీ తమ గుర్తుకు "చేతి" ని ఏర్పాటు చేసు
కుందని).దొంగ తనం చేసిన వాడిని "చేతి వాటం" చూపించాడు
అని అంటారు. మనకు కొత్త వ్యక్తులు పరిచయమయినప్పుడు
షేక్ హాండ్ ( కరచాలనం) ఇచ్చుకుంటాము.అలానే మితృలు
కలసినప్పుడు, ఏదైనా ఘనకార్యం సాధించినప్పుడు షేక్ హాండ్
ఇస్తాము. ఈ షేక్ హాండే ఓ ఉద్యోగి పదవిని ముందే వదలు
కొన్నప్పుడు ప్రతిఫలం భారిగా ముట్టజెప్పి సాగనంపినప్పుడు
దాన్ని "గోల్డెన్ షేక్ హాండ్" గాపిలుస్తారు. ఓ ప్రతిభగల ఉద్యోగి
సంస్ఠ విడిచి వెడతానంటే ,అతన్ని చేజారి పోనికు అని సలహా
యజమానికీ ఇస్తుంటారు. ఇక చేతి మీద, అదే కాగితం మీదే
అనుకోండి,మన సినీ రచయితలు హిట్ పాటలూ వ్రాసారు.
"ఇల్లరికం" చిత్రంలోని చేతులుకలిసిన చప్పట్లు,మనసులు
కలసిన ముచ్చట్లు, "దసరాబుల్లోడు" సినిమాలో చేతిలో చెయ్యేసి
చెప్పు బావా అన్నపాట ఇందుకు ఉదాహరణ. సభల్లో మంచి
ప్రసంగం చేసినా చప్పట్లు కొడతారు. అదే బోరు కొట్టినా ఇక
చాలని చెప్పటానికి చప్పట్లు కొడతారు. ఆ చప్పట్లకు రెండు
చేతులూ అవసరమవుతాయి. మన చెయ్యి భవిష్యత్తుని చెబు
తుందంటారు. మన హస్త రేఖలు చుసి చెప్పే శాస్త్రం ఇదే కదా!
ఆ డాక్టర్ గారి దగ్గరకు వెళ్ళు! ఆయన హస్తవాసి మంచిదని
సలహా ఇస్తుంటాము. ఇంకో గమ్మత్తు చూశారా! కొందరు తమ
చేతిలో స్వర్గం చూపించే వాళ్ళుంటారు.ఇలా చేతి కబుర్లు చెప్పా
లంటే చెయ్యి నొప్పీట్టేదాకా వ్రాయచ్చు.! మరీ మీకు బోరు కొట్టితే
చెయ్యి చేసుకో గలరు. ఐనా నేను మీ చేతికి అందనంత దూరంలో
ఉన్నా! అదే నా ధైర్యం!!

3 comments:

  1. ముస్లింలకు హస్తం పవిత్ర చిహ్నంట
    అందుకనేమో ఇందిరా ఫిరోజ్ ఖాన్ పార్టీ గుర్తు గా పెట్టింది ( ముస్లిం వోట్ల కోసం)
    --- నాకు కూడా మీకున్న ధైర్యమే , ఎవ్వడూ వచ్చి చెయ్యి చేసుకోడని, అదే ధైర్యం తో సెటైర్లు వేస్కొంటున్నా

    ReplyDelete
  2. జొరాస్ట్రియన్ మతము ... ముస్లిం కాదు... చేతి గుర్తు అమ్మవారిది..

    ReplyDelete
  3. జొరాస్ట్రియన్ మతము ... ముస్లిం కాదు... చేతి గుర్తు అమ్మవారిది..

    ReplyDelete