Sunday, July 31, 2011

సినీమాల ప్రత్యేక పత్రికలు-పుస్తకాలు



ఇంతకుముందు తెలుగులో కూడా నటులకు ( చిరంజీవి ) ప్రత్యేకంగా ఒక
పత్రిక కొతకాలం క్రితం వచ్చేది. ఇంగ్లీషులో ఇలా నటుల మీద, అలానే కొన్ని
సినిమాల మీద పత్రికలు వచ్చాయి. THE BEST OF STALLONE
పేర ఓ పత్రిక వెలువడింది. ఇందులో స్టాలోన్ నటించిన రాకీ , స్టేయింగ్
అలైవ్, రాంబో మొదలైన చిత్రాల లోని స్టిల్స్, చిత్ర నిర్మాణ విశేషాలు
ఉన్నాయి.

అలానే A VIEW TO A KILL జేమ్స్ బాండ్ సినిమా గురించి ఆ చిత్ర
విశేషాలతో, హీరో హీరోయిన్స్, సాంకేతిక నిపుణల గురించి కధనాలతో
ఓ పత్రిక వచ్చింది.ఈ సినిమాదృశ్యాల స్టోరీ బోర్డు (మన బాపు గారిలా)
ఇందులో వేశారు.
అఫీషియల్ మూవీ మాగజైన్ పేరిట STAR TREK IV the voyage
home పేరిట ఓ పత్రిక ఆ చిత్రం విడుదలైన రోజుల్లో వచ్చింది. ఆ చిత్రం
లోని అద్భుతమైన రంగుల ఫొటోలతోప్రతి పేజీ ఆకర్షనీయంగా తారల
చిత్ర పరిచయాలతొ వెలువరించారు
STAR TREK II, the wrath of khan చిత్రం ఫొటొ స్టోరీ పేరిట, ఫోటో
నావల్ పేరిట CLOSE ENCOUNTERS of the third kind చిత్రం
పాకెట్ పుస్తకాల రూపాన విడుదలయ్యాయి. వీటి ప్రత్యేకత ఈ పుస్తకాల్లో
ఆ చిత్రాల స్టిల్స్(ఫొటోలు) వరుసగా వేసి బొమ్మల కధలాగ ప్రచురించటం!.
ఇలాటి ప్రయత్నాన్ని మగధీర, శక్తి మొదలయిన తెలుగు చిత్రాలతో మన
నిర్మాతలు కూడా చేస్తే బాగుంటుంది.

2 comments:

  1. ...."ఇలాటి ప్రయత్నాన్ని ...... మొదలయిన తెలుగు చిత్రాలతో మన
    నిర్మాతలు కూడా చేస్తే బాగుంటుంది......"

    మనవాళ్ళు చెయ్యాల్సిన ప్రయత్నాలు చాలా ఉన్నాయి సురేఖ గారూ. ఊరికే పైరసీ అని ఏడవటమే గాని, వీళ్ళు స్వంతంగా విడుదలచేసే సి డి/డి వి డి లను చేతికి దొరికిన రీళ్ళతో దొరికినంతవరకూ వాటి నాణ్యం ఎలా ఉందో కూడా చూసుకోకుండా మెరుపులు, ఉరుములు, కట్ల తో అపభ్రంశంగా విడుదల చేసే ఈ సిని పరిశ్రమ నుంచి విన్నూత్నమైన అంశాలను ఆశించటం వ్యర్ధం. కనీసం తమ పరిశ్రమలో తయారైన మాణిక్యాలను వెతికి తీసి దాచుకోవటం అనే అలోచనే రాదు. నిన్ననే ఒక ఆంగ్ల సినిమా 1968 లో తీసినది చూశాను. ఈ సినిమా కొన్నాళ్ళు మరుగున పడిపోతే, బెస్ట్ ఆఫ్ బ్రిటిష్ సినిమా అనే శీర్షిక కింద రీ మాస్టర్ చేసి, ఒక్క చుక్క, గీత కూడ లేకుండా కొత్త సినిమా లాగా విడుదల చేశారు.

    మనకు ఎన్ని పాత సినిమాలు సవ్యంగా దొరుకుతున్నాయి!!!??? ఒక్క పాత సినిమా సి డి సవ్యంగా ఉన్నదా. ఒక్క డి వి డి రీ మాస్టర్ చేసి వదిలారా?? అదే సి డి ని, డి వి డి లొకి పెట్టి డబ్బు చేస్కుందామనే ఆలోచనే కాని, Collector's ఎడిషన్లు ఉంటాయని అలాంటివి వేస్తే కొనే జనం ఉన్నారని కూడా తెలియదు వీళ్ళకి. ఒక్క డి వి డి లో ఆ Director తో కాని, నటీనటులతో కాని ఇంటర్వ్యూలు ఉండవు, ఆడియో కామెంటరీ ఉండదు, we cannot even dream about this in the next 100 years.

    ఆంగ్లంలో పాత సినిమా డి వి డి లను చూస్తుంటే ముచ్చటేస్తుంది.

    ఊరించి ఊరించి, ఒక్క మాయా బజారు మాత్రం రంగుల్లో వచ్చింది. మనకు పాత సినిమాలు రంగుల్లో అక్కర్లేదు, సవ్యంగా కట్లు లేకుండా బ్లాక్ అండ్ వైట్ లోనే దొరికితే చాలు,

    ఇప్పుడు వచ్చే సినిమాలు, కామిక్ స్ట్రిప్పుల్లో వెయ్యటమా, అలా వేస్తే కథ అర్ధం కావటానికి కొన్ని వాల్యూములు వెయ్యాలేమో!! ఆ కామిక్ స్ట్రిప్ ఎవరన్నా మరీ ఆశపడి ఆంగ్లంలో ప్రచురిస్తే లేదా ఎవరన్నా పి డి ఎఫ్ కింద మార్చి వెబ్ లో పెడితే, ప్రపంచం నలుమూలలనుండి కేసులు పడే అవకాశం కూడా ఉన్నది, తమ కథలో భాగాన్ని తమకి తెలియకుండా కాపీ కొట్టారని.

    ReplyDelete
  2. శివరామ ప్రసాద్ గారు, శుభోదయం! మీరు చెప్పింది నూరుపాళ్ళ నిజం ! డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావు గారు
    నటించిన అలనాటి "పల్నాటి యుద్ధం" సిడి కోసం నేను ఇంకా ప్రయత్నిస్తూనే వున్నాను. ఇక్కడ మా మిత్రుని సిడీ
    షాపు లో చెబితె , ఆయన ఆర్డరిస్తే కొత్త పల్నాటి యుద్ధం పంపిచారట! మీరన్నట్లు మన దౌర్భాగ్యం కొన్ని సినిమాల
    నెగటివులే లేవుట!!

    ReplyDelete