Thursday, September 01, 2011

విఘ్నేశ్వరుడి గుడికి గంట కట్టిన విదేశీయుడు !!

ఈ రోజు వినాయక చవితి ! ఏ కార్యం ప్రారంభించాలన్నా విఘ్నాలను తొలగించే
గణనాయకునికి పూజలు చేస్తాం! పార్వతీ మాత పసుపుతో బాలగణపతిని
సృష్టించింది. మనం ఈ సారి గణపతిని మట్టితోనే తయారు చేస్తున్నాం.


ఒక విదేశీయుడు విఘ్నేశ్వరుని గుడికి గంటను కట్టి తన మొక్కును తీర్చుకున్నా
డంటే వినటానికి వింతగానే వుంటుంది. గోదావరి ఆనకట్ట నిర్మాణం ఎటువంటి
ఆటంకం లేకుండా పూర్తయితే శ్రీ సిద్ధి లక్ష్మీగణపతి స్వామి ఆలయానికి ఓ కంచు
గంట సమర్పిస్తానని బ్రిటిష్ దొర, గోదవరి డెల్టా రూపశిల్పి సర్ ఆర్ధర్ కాటన్ మొక్కు
కున్న మొక్కు ఇది !ఆయన కోరికను గణనాధుడు తీర్చాడు. భారత దేశంలో గోదావరి
నదిని దక్షిణ గంగగా భావిస్తారు. ఆ గోదావరీ తీరంలో ఉన్న అతి ప్రాచీన నగరమైన
రాజమహేంద్రవరాన్ని దక్షిణకాశీగా పిలిస్తారు నాళం భీమరాజు వీధిలో ఉన్న ఈ లక్ష్మీ
గణపతి ఆలయానికి దగ్గరలో కందుకూరి వీరేశలింగం పంతులు, ఆంధ్రకేశరి టంగుటూరి
ప్రకాశం పంతులు, ప్రముఖ చిత్రకారుడు దామెర్ల రామారావు మొదలైన నగర ప్రముఖులు
నివశించారు.ఈ దేవాళయంలో ఆరు కొబ్బరి కాయలు కొట్టి ఏ కోర్కె కోరుకున్నా తీరుతుందని
భక్తులు విశ్వశిస్తారు.
ఇక్కడ మీరు చూస్తున్న ఈ కంచు గంట కాటన్ భక్తితో సమర్పించు కున్నదే! అంతరాలయంలో
నిత్యం మ్రోగుతున్నగంటపై "1858 సాముద బ్రదర్స్ బిల్డర్స్ ,లండన్" అని చెక్కిన అక్షరాలు
మనం ఇప్పటికీ చూడొచ్చు.
అది సరే ! మీరు మట్టి వినాయకుడికే పూజలు చేశారు కదూ !
బాలగణపతి బొమ్మ శ్రీ బాపు గారికి కృతజ్ఞతలతో
లక్ష్మీగణపతి దేవాళయం, గంట ఫొటోలు "గుడిగంట" ఆధ్యాత్మిక వార పత్రిక (రాజమండ్రి)
సంపాదకులు శ్రీ సన్నిధానం శాస్త్రి గారి సౌజన్యంతో.
మీ ఇంటిల్లిపాదికీ మా ఇంటిల్లిపాది వినాయకచవితి శుభాకాంక్షలు!

3 comments:

  1. బ్లాగ్-మిత్రులకు, వినాయక చవితి శుభాకాంక్షలు

    ReplyDelete
  2. కాటన్ దొర గురించి మరో చక్కని విశేషం చెప్పారు. ధన్యవాదాలు అప్పారావు గారూ !

    మీకు, మీ కుటుంబ సభ్యులకు వినాయకచవితి శుభాకాంక్షలు

    శిరాకదంబం వెబ్ పత్రిక

    ReplyDelete
  3. సార్ నాకు గుడి గంట కావాలి కంచు గంట 2 మాకు వివరాలు చెప్పగలరు 8978858675 ఆలయంలో మాదిరిగా ఉండేవి కావాలి చెప్పగలరు ఫోన్ నెంబర్ మాది పైన

    ReplyDelete