Wednesday, September 07, 2011

విచిత్ర కవలలు

ఈ ఫొటోలో వున్న మా ఇద్దరు పాపలు చి" మాధురి, చి"మాధవి ఒకే తేదీన, (సెప్టెంబరు 8) పుట్టారు !
కానీ కవలలు కాదు. ఏమంటే పుట్టిన తేదీ ఒకటే కానీ సంవత్సరం మాత్రం వేరు ! అందుకే విచిత్ర
కవలలు అన్నాను. ఇద్దరి పుట్టిన రోజూ ఒకే రోజవటం వల్ల పుట్టిన రోజు వేడుక చేయడం చాలా సులువుగా
వుండేది.

ఈ ఫొటో మాధురికి ఏడేళ్ళు, మాధవికి ఐదేళ్లు వయసప్పుడు తీసినది. ఇద్దరు ఒకే స్కూల్లో,
రాజమండ్రి షాడే గర్ల్స్ హై స్కూల్లో టెన్త్ క్లాసువరకు చదువుకున్నారు
ఈ ఫొటో వాళ్ళు 8th, 9th చదువుతున్నప్పటిది


విశాఖపట్టణం లో కాలేజీ లో చదువుతున్నప్పటి రోజుల్లో ! వాళ్ళిద్దరికీ రికార్డు ప్లేయర్లో
పాటలు వినడమంటే చాలా ఇష్టం! పెద్దమ్మాయి B.Sc., M.A.(Eng Lit), చిన్నమ్మాయి
B.A.B.L చదివింది..


ఇప్పుడు పెద్దమ్మాయి మాధురి చెన్నైలోను , మాధవి ముంబాయిలోనూ వుంటున్నారు. మాధురీ
చంద్రశేఖర్ కు ఇద్దరు అబ్బాయిలు, మాధవీ వెంకట్ కు ఒక అమ్మాయి. ఇదీ ఈ విచిత్రకవలల
కధ. ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్న ఈ ఇద్దరికీ మా ఆశీస్సులతో బాటు ఆత్మీయులైన
మీ ఆశీస్సులు కోరుకుంటూ...

8 comments:

  1. మీ అమ్మాయిలిద్దరికీ పుట్టిన రోజు శుభాకాంక్షలు.

    ReplyDelete
  2. అమ్మాయిలిరువురుకీ హార్థిక జన్మ దిన శుభాకాంక్షలు.

    ReplyDelete
  3. బాగుంది. మా అక్కకు కవల పిల్లలు. ఇద్దరూ అమ్మాయిలే ఐతే వాళ్ళు పుట్టింది మా అక్క పుట్టిన రోజునే, సెప్టెంబరు పదిన. మా ఇంట్లో త్రీ ఇన్ వన్ పుట్టినరోజు జరుగుతూ ఉంటుంది :)

    ReplyDelete
  4. మాధురి, మాధవి.. ఇద్దరికి హ్యాపీ బర్త్ డే...

    ReplyDelete
  5. శుభాకాంక్షలు అందజేసిన మీ అందరికీ శుభాభినందనలు తెలియజేసుకుంటున్నాను.

    ReplyDelete
  6. అప్పారావు గారూ !

    మాధురి, మాధవి గార్లకు పుట్టినరోజు శుభాకాంక్షలు మీ ద్వారా ..........

    ReplyDelete