Tuesday, November 08, 2011

బిక్కవోలు శ్రీ లక్ష్మీగణపతి స్వామి

ఈ దేవాలయం కాకినాడ, రాజమండ్రి కెనాలురోడ్డు లో అనపర్తికి 10 కిలో
మీటర్ల దూరంలో ఉన్న బిక్కవోలులో వుంది. 1100 సంవత్సరాల చరిత్రగల
దేవాలయంలో స్వయంభువుగా వెలసిన అతి పెద్ద వినాయకుని శిలాప్రత్రిమ
భక్తులను విశేషంగా ఆకర్షిస్తున్నది.
తూర్పు గోదావరి జిల్లాలోని బిక్కవోలు ఒకనాడు బిరుదాంకినవోలు. తూర్పు
చాణుక్యులు 849-892 ప్రాంతంలో పలు దేవాలయాలు నిర్మించారు. ఈ
దేవాలయంలోని అతి పెద్ద విగ్రహం భూమి అడుగున ఎన్ని అడుగుల లోతు
వరకు వున్నదో తెలియదు శ్రీ లక్ష్మీగణపతి నిజరూపంలో నాగాభరణం, నాగ
యజ్ఞోపవీతం, నాగ మొలత్రాడు తోసుఖాసనం మీద కూర్చొని భక్తులకు
దర్శనమిస్తారు. ఈ విగ్రహం నిత్యం పెరుగుతూ వుందని చెబుతారు. స్వామికి
ప్రతీనెల అమావాస్య వెళ్ళిన నాలుగవరోజున శుద్ధ చవితినాడు లక్షపత్రి పూజ
నిర్వహిస్తారు. భక్తులు తమ కోర్కెలను స్వామి వారి చెవిలో చెప్పుకుంటే ఆ
కోరికలు తప్పక తీరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


శ్రీ లక్ష్మీగణపతి దేవాలయానికి సమీపంలోనే గోలింగేశ్వర స్వామి ఆలయం
వుంది.ఇందులో శ్రీ సుబ్రహ్మన్యేశ్వర ఆలయంలో పుట్ట వున్నది. ఆ పుట్ట
మన్నును భక్తులు మహిమగలదని స్వీకరిస్తారు.ఈ దేవాలయ ప్రాంతంలో పెద్ద
సొరంగ మార్గం వుండేదనీ ఆ మార్గాన్ని అప్పటి బ్రిటిష్ పాలకులు "బిగ్ హోల్"
అని పిలిచేవారనీ, ఆ ఆంగ్ల పదాన్ని స్థానిక ప్రజలు బిక్కవోల్ అని పలికేవారనీ ,
అప్పటి నుండి ఆ ప్రాంతం బిక్కవోలుగా పిలవబడుతున్నదనీ కొందరు చెబుతారు.

2 comments:

  1. మన జిల్లా విశేషాలన్నీ చెప్తుంటే మళ్ళీ మా ఊరు వెళ్ళి వస్తున్నట్టుగా అనిపిస్తోందండీ..ధన్యవాదాలు.

    ReplyDelete
  2. మొన్న మా పేరెంట్స్ వెళ్ళివచ్చారంట. విషయలు చెబుతుంటే నాకు వెళ్ళాలనిపించింది. ఇప్పుడు మీ టపా చూసాకా ఎలాగైనా వెళ్ళాలని ఉంది.

    ReplyDelete