Friday, November 18, 2011

మిక్కీమౌస్ పుట్టిన రోజు

ఎన్ని కార్టూన్ పాత్రలున్నా మిక్కీమౌస్ ఎన్నో ఏళ్ళుగా ప్రపంచవ్యాప్తంగా అభిమానుల
హృదయాలలో నిలచిపోయింది. "స్టీమ్ బోట్ విల్లీ" పేరున మిక్కీమౌస్ పాత్రతో వాల్ట్ డిస్నీ
నిర్మించిన కార్టూన్ చిత్రం మొదటిసారిగా నవంబర్ 18, 1928 లో విడుదలయింది. ఆనాటి
నుంచి నవంబరు 18వతేదీన అభిమానులు మిక్కీకి పుట్టిన రోజు పండుగ జరుపుకుంటున్నారు.
మొదటిసారిగా వాల్ట్ డిస్నీ సృష్ఠించినపాత్రకు మార్టిమర్ మౌస్ అని పేరు పెట్టాడు.కానీ ఆయన
భార్యకు ఆ పేరు నచ్చలేదు. ఆమే ఈ పాత్రకు మిక్కీ మౌస్ అనే పేరును సూచించింది. మొదటి
సారిగా మిక్కీ పాత్రకు డిస్నీ తన గొంతునే నేపధ్యంగా వాడేడు. మిక్కీ మౌస్ 1932 లో వాల్ట్
డిస్నీకి ఎకాడమీ అవార్డును సంపాదించిపెట్టింది. మిక్కీ రంగుల్లో తెరపైకి ఫిబ్రవరి 23 ,1935 న
అగుపించిన రెండు నెలల తరువాత "మీక్కీస్ కంగారూ" అనే తెలుపు నలుపు చిత్రం ఆలస్యంగా
విడుదల అవటం మరో విశేషం !83 ఏళ్ళ మిక్కీమౌస్ ఇంకా పెద్దలనీ చిన్నారులనీ అలరిస్తూనే వుంది.
మిక్కీ మౌస్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియచేద్దాం.

1 comment:

  1. మిక్కీ కి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు! మొన్న డిస్నీ ల్యాండ్ వెళ్ళినప్పుడు నాతో చెప్పలేదు ఇవాళ తన పుట్టినరోజని!!!అందుకే నేను అలిగాను మిన్నితో మాట్లాడను!

    ReplyDelete