Wednesday, November 09, 2011

కత్తిరింపులతో ఇంపైన చిత్రాలు.

ఇక్కడి వివిధ జంతువుల బొమ్మలను చూశారుగా ! జీవం ఉట్టిపడుతూ
అగుపిస్తున్నాయికదూ ! నిజానికి వీటిని వేయడానికి ఆ చిత్రకారుడు
సన్నని క్రోక్విల్ కలాన్ని కానీ, బ్లాకింకును గానీ ఉపయోగించలేదంటే
మనం నమ్మ గలమా ? !


ఈ బొమ్మలు వేయడానికి ఉపయోగించినది సన్నని పదునైన చాకుని
అంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది.
నల్లని కాగితాన్ని తీసుకొని తను వేయదలచిన బొమ్మను స్కెచ్ గా గీసి
అటుతరువాత అతి నేర్పుగా , ఓపికగా కత్తిరించేవాడు!!.



ఇంతకీ ఈ అద్భుత చిత్రకారుని పేరు యుగోమోచీ . ఇటలీలో జన్మించిన
ఈయన తన నాలుగవ ఏటి నుంచే ఇలా ఈ కత్తిరింపుల బొమ్మలను
తయారుచేయడం మొదలెట్టాడట ! ఆ వయసు పిల్లలు కాగితాలు చింపి
పోస్తే ఈ అబ్బాయి కాగితాలు చింపి అద్బుత చిత్రాలు సృష్టించాడు.

" Hoofed Mammals Of The World" పేరుతో T.Donald Carter
వ్రాసిన గ్రంధంలో యుగోమోచీ సృష్టించిన అధ్బుత కత్తిరింపుల చిత్రాలతో
ప్రచురించబడింది. ఆ పుస్తకం ప్రచురించినప్పుడు యుగోమోచీ వయసు
63 సంవత్సరాలు. ఇది 61 ఏళ్ళ క్రితం నాటి మాట. మానాన్నగారు
తయారు చేసిన 195౦ నాటి ఆల్బమ్ తిరగేస్తుంటే ఈ బొమ్మలు
కనిపించాయి. అమెరికెన్ పత్రిక LIFE లో ఈ బొమ్మలు ప్రచురించారు.
మన తెలుగు వాళ్ళల్లో వెల్లటూరు పూర్ణానంద శర్మ గారు ఇలాటి
కత్తిరింపు చిత్రాలు వేయగా ఆనాటి ఆంధ్రవార పత్రికలో ప్రచురించబడ్డాయి.

3 comments:

  1. అద్భతం..! ముఖ్యంగా రెండో బొమ్మలో చెట్ల ఆకులూ, మూడో బొమ్మలో జంతువుల నేపథ్యం చూస్తుంటే అబ్బురమనిపిస్తోంది. యుగోమోచీ శ్రద్ధ, సూక్ష్మదృష్టి, నైపుణ్యాలకు జేజేలు చెప్పాల్సిందే!

    ReplyDelete
  2. మంచి చిత్రాలందించారు. సంతోషం.

    శర్మగారే కాకుండా ఓ యాభై యేళ్ల క్రితం కోరాడ సీతా మహలక్ష్మి అనుకుంటా (పేరు సరిగా గుర్తురావడంలేదు) ఆంధ్ర ప్రభ వీక్లీలో వారానికి కనీసం ఒకటి రెండైనా వేసేవారు కత్తిరింపు చిత్రాలు.

    గుర్తు చేసినందుకు ధన్యవాదాలు.

    ReplyDelete