Sunday, December 16, 2012

వాల్ట్ డిస్నీని చిరంజీవిని చేసిన మిక్కీమౌస్

జీవంలేని బొమ్మల్ని జీవంపోసి కదిలే బొమ్మలుగా చేసిన వాల్ట్ డిస్నీ పేరు
తెలియని వారుండరు. ప్రపంచ ప్రముఖ దేశాలలో నిర్మించిన డిస్నీ వరల్డ్
వేలాది సందర్శకులతో ప్రతి రోజూ సందడిగా కళకళలాడుతూంటుంది!
వాల్టర్ ఎలియాస్ డిస్నీ చికాగోలో 1901 డిసెంబరు  5 న జన్మించాడు.
అరువు తెచ్చుకున్న కమెరాతో "డిస్నీ లాఫ్-ఓ-గ్రామ్స్" పేరిట చిన్నచిన్న
కార్టూన్ సినిమాలను ప్రకటనల నిమిత్తం తయారు చేయటం మొదలెట్టాడు.
వాటిని సినిమా ప్రదర్శన ముందు ధీయేటర్లలో చూపించేవారు.

ఆయన సృష్ఠించిన  మిక్కీమౌస్, డొనాల్డ్ డక్, గూఫీ మొదలైన పాత్రలు
పిల్లల్ని పెద్దల్ని విపరీతంగా ఆకర్షించాయి. ఇప్పట్లా కంప్యుటర్ పరిజ్ఞానం
లేని రోజుల్లో కార్టూన్ చిత్ర నిర్మాణం చాలా శ్రమతో కూడిన పని. బొమ్మ
లోని ప్రతి కదలికనూ చిత్రాలలో చూపిస్తూ కొన్ని వేల బొమ్మలు వేసి
ప్రతి ఫ్రేమును చిత్రీకరించాలి. కొద్ది నిడివిగల చిత్రాల్నే కాకుండా డిస్నీ
పూర్తి నిడివి చిత్రాలైన సిండ్రిల్లా, స్నోవైట్ లాంటి కార్టూన్ చిత్రాలు 
నిర్మించటమే కాకుండా ఆ చిత్రాలకు ప్రతిష్టాకరమైన అకాడమీ అవార్డులు
పొందాడు...ఆయన 1928లో " స్టీమ్ బోట్  లిల్లీ" అన్న మిక్కీ మౌస్
చిత్రాన్ని నిర్మించాడు.. కార్టూన్ చిత్రాల నిర్మాణానికి దశ దిశ చూపిన
వాల్ట్ డిస్నీ 1966 డిసెంబరు 15 న కీర్తిశెషుడయ్యాడు. ఇప్పటికీ
వాల్ట్ డిస్నీ సంస్థ తరఫున చిత్రాలు నిర్మింపబడుతూనే వున్నాయి.
ప్రపంచ వ్యాప్తంగా వున్న డిస్నీల్యాండ్ అన్ని వయసులవారినీ
ఈనాటికీ ఆకర్షిస్తూ డిస్నీని  చిరంజీవిని చేశాయి !!

1 comment:

  1. ఒక పాత్రను సృష్టించడం ఒక ఎత్తైతే...అది అజరామరం గా దగ్గర దగ్గర తొంభై ఏళ్ళు జనాలతో ఇప్పటికీ ఉండడం చాలా గొప్ప...నిజంగా చెప్పాలంటే డిస్నీ సృష్టించిన అన్ని పాత్రలూ చాలా అందంగా ఉంటాయి...ఈ మధ్య వచ్చే కార్టూన్లలో ఆ అందం అస్సలు లేదు...పిల్లల్ల్ని అలరించడం మాట అటుంచండి...వాళ్ళని నిద్రలో భయ పెడ్తున్నాయ్ ..డిస్నీ గురించిన విషయాలు మాకు అందించినందుకు సురేఖ గారు అందుకోండి మా అభినందనం ..

    ReplyDelete