Monday, December 17, 2012

రాజమండ్రి గోదావరినదిపై ఆలనాటి హేవలాక్ వంతెన పై ప్లీజ్ హావ్ ఏ లుక్ !!



           ఎన్నో ఏళ్ళుగా మూత పడిన ఈ అందాల అలనాటి వంతెన నిరుపయోగంగా వుంచకుండా
      వందేళ్లనాటి ఇంజనీరింగ్ ప్రతిభకు గుర్తుగా ఈనాటి తరం మరచిపోకుండా సుందరంగా తీర్చి
      దిద్దితే బాగుంటుందని ప్రజలు, అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఇంతవరకూ
      ప్రయత్నాలు ఏ మాత్రం ముందుకు సాగటంలేదు. స్థానిక ప్రజాప్రతిధినులు కేంద్రంలో, రాష్ట్రం
      లో ఒకే పార్టీకి చెందినా  ఎందుకో ఈ విషయంలో శ్రర్ధ వహించటంలేదు. పర్యాటక మంత్రిగా
      పదవిలో వున్న చిరంజీవి ఈ విషయంలొ చూపుసారించాలి. . మొన్ననే వచ్చిన
      మన రాష్ట్రానికే చెందినన రైల్వే సహాయ మంత్రి గారు కూడా ఈ విషయంలో పెదవి విప్పక
      పోవటం  అత్యంత విచారకరం.ఆనాటి బ్రిటిష్  ఇంజనీర్ హేవ్ లాక్ సారధ్యంలో మూడేళ్ళ
      అతి స్వల్పకాలంలో ఈ వంతెన నిర్మింపబడటం విశేషం.
       1897 నవంబరు లో నిర్మాణం ప్రారంభమైన ఈ వంతెన ఆగస్టు 30 వతేదీ,1900  సంవత్సరం
      రైళ్ల రాకపోకలకు  ప్రారంభించబడింది. ఇక్కడ మీరు ఆనాటి శిలాపలకాన్ని చూడొచ్చు. !!
      పుష్కర్ ఘాట్ వద్ద ఇప్పటికీ ఆ శిలాఫలకం పదిలంగా వుంది.
   



      ఇదే మరో ఏ దేశమైనా, అంతెందుకు మనదేశంలోని మరో రాష్ట్రమైనా ఈ వంతెన గురించి
     శ్రర్ధ తీసుకొనే వారు. ఏం చేస్తాం మనం తెలుగువాళ్ళం. సాంకేతిక పరిజ్ఞానం అంతగా లేని
     ఆరోజుల్లో మూడేళ్ళ స్వల్పకాలంలోఅనుకున్న దాని కంటే తక్కువ వ్యయం తో నిర్మించిన
     ఈ వంతెన దాదాపు వందేళ్లకు పైగా సేవ లందించింది.ఈ.వంతెనను స్మతి చిహ్నంగా పదిల
     పరచుకోవసిన భాధ్యత మనందరీదీ !!

2 comments:

  1. మీరు చెప్పినట్టు దానిని ఒక స్మృతిచిహ్నంగా పదిలపరిస్తే ఎంతబాగుంటుంది....

    ReplyDelete
  2. నేను ఒక టపా కూడా రాశా నా బ్లాగులో, దీని గురించి. ఈ వంతెనను అశ్రద్ధ చేస్తే పాడయిపోతుంది. ఉపయోగిస్తే బాగుంటుంది, పెద్దలికి పట్టడం లేదు.మంచి టపా బావుంది

    ReplyDelete