Thursday, March 18, 2010

దేముడే దిగివచ్చిన వేళ !!








సాధారణంగా వివాహాలు దేముడి సన్నిధిలో చేయలని కొందరు నిర్నయిస్తుంటారు.
ఏ అన్నవరం సత్యనారయణ స్వామి వారి గుడిలోనో,తిరుమలలో ఏడుకొండలవాడి
సన్నిధిలోనో చేస్తుంటారు. మా రాజమండ్రి లోని ఓ ప్రముఖులు తమ ఇంటిలోని
పెళ్ళికి సాక్షాత్తూ ఆ ఏడుకొందలస్వామి దేవాలయాన్నే రాజమండ్రి లో ప్రతి సృష్టి
చేశారు ! ఆర్ట్స్ కళాశాల ఆవరణలో గుడి సెట్టింగ్ వేసి కళ్యాణం జరిపారు. ఆ తరువాత
ప్రజలు వచ్చి దర్శనం చేసుకోవడానికి వీలు కల్పించారు. ఓ ఐదు రోజుల పాటు టిటిడీ
అధ్వర్యంలో పూజలు ,అన్నమాచార్యుడి కీర్తనలు,హరి కధలు ఏర్పాటు చేసారు. ఓ పెళ్ళిని
ఇలా ప్రజలందరూ ఆనందించేటట్లు చేయడం అభినందనీయం.ఏమంటారు.

2 comments:

  1. what an idea sirjee... ఆలోచన చాలా బాగుంది...

    ReplyDelete
  2. అబ్భ ! చాలా బావుందండీ. వాళ్ళకి ఐడియా రావడమేమిటి ? ఈ సెట్టు ని వేసిన కళాకారులు ఇంత చక్కగా దింపడమేమిటి ? అంతా చక్కగా కలిసి వచ్చింది. ఆ కళాకారులకూ, ఈ వేదిక ఏర్పాటు చేసిన కుటుంబానికీ - అభినందనలు.

    ReplyDelete