Saturday, March 27, 2010

అర్ధాంగిని అర్ధం చేసుకోవడం ఎలాగో బ్నిం చెప్పారు !




శ్రీ " బ్నిమ్ " గారిని కార్టూనిస్ట్ గా తెలుసు.అలానే మంచి రచయితగా,హ్యూమరిస్ట్ గా కూడా
తెలుసు కదా?! గత ఆగస్ట్ లో నేను శ్రీ బాపు రమణ గార్లను కలిసినప్పుడు వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ డే
శుభాకాంక్షలు అని వ్రాసి సంతకం చేసి ఓ పుస్తకం కానుకగా ఇచ్చారు. నిజంగా అది ఓ అద్భుతమైన
కానుక.ఇంతకీ ఆ పుస్తకమే శ్రీ బ్నిమ్ వ్రాసిన మిసెస్ అండర్ స్టాండింగ్. అర్ధాంగిని అర్ధంచేసుకున్న
సంసారాలు సరసంగా సాగిపోతాయో బ్నిమ్ అధ్భుతంగా చెప్పారు.ఇందులో సంకురాత్తుళ్ళు తో మొదలెట్టి
గుడ్నైట్ తో ముగించారు.ఒక్కోటి రెండు మూడు పేజీలకన్న వుండవు. అప్పుడే ఐపోయిందే అనిపిస్తుంటాయి.
ప్రతి అధ్యాయానికి బాపు గారి బొమ్మలు బోనస్! ఆయన గీసిన ముఖ చిత్రం కొసరు! చిన్న మచ్చు తునక.
' దసరా చీర '.అర్ధాంగులు ఏ చీరను ఏ బీరువాలో అట్టడుగున దాస్తారో భర్తలు ఎంక్వయిరీ చేయకూడదు.
ఫలానా చీరే కట్టుకో మని అడగకూడదట. ఎందుకంటే ఒక్కో చీరకు ఒక్కో ఫ్లాష్ బాక్ వుంటుందట! ఇలాటివి
తెలుసుకోవాలంటే మీరీ పుస్తకం కొనేసుకొని చదివేసుకొని దాచేసుకోండి. విశాలాంధ్ర అన్ని బ్రాంచీలలోను ఈ
నవ్వుల పుస్తకం నవ్వుతూ మిమ్మల్ని పలకరిస్తుంది.

5 comments:

  1. పుస్తకం పేరు వినలేదు ఇప్పటి దాకా. బాపు బొమ్మలు, చిన్న కథలు అని చెప్పి టెంప్ట్ చేస్తున్నారు. నాకున్న చాంతాడంత చదవాల్సిన పుస్తకాల లిస్టు లో చేర్చాలేమో..

    ReplyDelete
  2. పుస్తకాన్నంతా కవర్ పేజీలోనే ఇమిడ్చేయటం ఈ ప్రపంచంలో ఒక్క "బాపు" గారికే తెలుసు. ఈ పుస్తకం గురించి నాకింతవరకూ తెలియదు. కవర్ పేజి చూస్తుంటే ఇండియా నుంచి అర్జెంట్ గా తెప్పించుకుని చదవాలనిపిస్తుంది.

    ReplyDelete
  3. బాపు గారి అడ్రస్ చెప్పగలరా? ఎప్పటినుంచో ఒక ఉత్తరం ముక్క రాయాలనే తపన...

    ReplyDelete
  4. శ్రీ గిరిధర్ గారు,
    శుభోదయం. బాపుగారి అడ్రెస్స్;
    నంబర్; 4, గ్రీన్వేస్ రోడ్ ఎక్స్ టెన్షన్,రాజా అన్నామలై పురమ్,
    చెన్నై-600 028 ( ఇండియా )...........సురేఖ.....

    ReplyDelete
  5. చాలా థాంక్స్ అండీ సురేఖ గారూ.
    బాపు గారికి ఉత్తరం రాయాలనే నా కోరిక త్వరలో తీరబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది.
    ప్రత్యుత్తరం వస్తే నా జన్మ ధన్యం.
    ధన్యవాదాలు.

    ReplyDelete