Friday, March 26, 2010

కార్టూనా? కళాఖండమా?!!



స్వాతి సపరివార పత్రిక వారం వారం బాపు గారి పంచ(వర్ణ)రత్నాల
కార్టూన్లను ప్రచురిస్తుంది. ఈ వారం ( 2-4-2010) సంఛికలో
ఐదు కార్టూన్లు దేనికదే బాగున్నా ఇక్కడ మీరు ఛూస్తున్న కార్టూన్
చూస్తే అందులో మీకు ఓ చక్కని కార్టూనే కాకుండా ఓ రంగుల వర్ణ
చిత్రం అగుపిస్తుంది. సినీమాల్లో చిన్న వేషాలేసి చిన్న ఊర్లో విశ్రాంతి
తీసుకోంటున్న ఓ పెద్దాయన మంఛంమీద దర్జాగా చుట్ట లాగిస్తూ,కాలు
మీద కాలు వేసుకుని పదుకుంటే ఆయనగారి ఇల్లాలు మాత్రం సిటీ
లైఫే బాగుందని అంటున్నది. ఇక బొమ్మ చూడండి. గోదారొడ్డూ,ఓ
రాదారి పడవ, దూరాన కొండలు, నదిలో వాటి నీడలు, ఒడ్డున
ఏసీ లాంటి చక్కని కుటీరం,ముందర ముత్యాల ముగ్గులు,అరటి చెట్లు,
చల్లని నీడనిచ్చే వృక్షాలు, ఒరల బావి, ప్రక్కనే పందిరీ,దానిపై అల్లుకున్న
పాదూ,క్రింద హాయిగా నెమరవేస్తున్న ఆవు,పైన ఓ అందాల నెమిలి,
జింక పిల్ల, పావురాలు, ప్రక్క చిన్న చిన్న పూల మొక్కలు,కొందల
చాటున సూర్యుడు ( ఇంకా నేనేమైనా మర్ఛి పోతే మీరు చెప్పాలి),ఓహ్
నిజం మర్ఛే పోయా, కాలు జాపుకుని పిండి విసురుతున్న ఇల్లాలు.
ఈ బొమ్మకు వాడిన వివిధ రంగుల శొయగాలు! ఆ బొమ్మలోని ఇల్లాలన్నట్లు
ఎన్ని చెప్పండి, బాపు గారి బొమ్మలకు లెదు లేదు సరి సాటి.!!
మీరేమంటారు? అవునంటారా? కాదంటారా? మీరు మాంఛి టేస్టున్నవారు.
అవునే అంటారు!
ఇంత మంచి కార్టూన్ స్వాతి ద్వారా అందించినందుకు స్వాతి బలరాం
గారికి కృతజ్ణలతో...

3 comments:

  1. ఆవిడ మాటల్లో మరి ఆవిడ ఇక్కడ పడుతున్న కష్టం కనిపిస్తుంది! ఆయనకేమి , జీవితమంతా కష్టపడిపోయాను, ఇప్పుడు కాలిమీద కాలు వేసుకుని మీరు ఉదహరించినవన్నీ చూస్తూ దర్జాగా విశ్రాంతి తీసుకుంటున్నారు.కాని ఆయానకి కళ్ళకి, వంటికీ, నూటికీ ఇంపుగా ఉన్న సగం పైగా అన్నీ ఆవిడ పని చెస్తేనే కదా ఉండేది. ఉదాహరణకి సిటీలో ఉండే ఏ సహాయం లేకుండా ఆ ముసలివయసులో ఆవిడ ఇల్లు వాకిలీ అంతా ఊడ్చి, ముత్యాల ముగ్గులు పెట్టాలా, అన్ని అవసరాలకి నదినుంచి/బావిలో నీళ్ళు తోడి నీళ్ళు పట్టుకుని రావాలా, అరటి చెట్లు,
    చల్లని నీడనిచ్చే వృక్షాలు, పాదులకి నీళ్ళు పోసి, చెదలు, పురుగులు చూసుకుంటూ ఉండాలా, పందిళ్ళు కట్టాలా, పక్షులకి, పశువులకి మేత సంగతి చూసుకోవాలా, కాలు జాపుకుని పిండే విసరాలా పిండే రుబ్బాలా, మూడు పూట్లకి వంట, తరుక్కోవటం, తోముకోవటాలు చేసుకోవాలా? సిటీలో ఉండే పనిమనిషి అనో/ఎక్కడికక్కడికి కుళాయిలు అనో/మిక్సీలుగ్రైండర్లు లాంటి సహాయాలు/సౌకర్యాలు ఉండవు ఎలాగో, కష్టం సుఖం ఇద్దరూ కలిసి ఆస్వాదిద్దామనే లాగా లేరు కదా ఆ పెద్దాయన, కాలు మీద కాలు వేసుకుని చుట్టలాగించేస్తూ ఎక్కడా ఏపనిలో కాస్త సహాయం చేసేలా లేరు. మరి సుఖమంతా ఆయన కష్టమంతా ఆవిడ పడుతుంటే ఆవిడకి మరి సిటీ మీద మనసు పోదూ? ఒక్క డైలాగులో ఎంత చూపించారు.. బాపుగారు ఎలాగైన బాపూగారే..

    ReplyDelete
  2. చేతన గారూ, శుభోదయం! మీరు చెప్పిందీ నిజమే సుమా !
    (సు)రేఖా చిత్రం

    ReplyDelete