Sunday, October 10, 2010

నవ్వుల జాలీ బాయ్!ఆలీ!!


మా రాజమండ్రి నవ్వుల రాజు ఆలీ !
పరిమళాల నవ్వుల పువ్వులు పంచే ఓ తోటమాలీ!!
నీ కామెడీ మా మనసుకెంతో జాలీ !!
కలకాలం నీ నవ్వులు మాకు ఇలానే పంచాలీ!!
ఈ రోజు పుట్టిన రోజు జరుపుకొంటున్న మా ఆలీకి శుభాశీస్సులు
తెలియజేస్తూ ఆలీ గురించి కొన్ని మాటలు మీతో పంచుకుంటున్నాను.
మా చిన్నారి ఆలీ హాస్యనటుడిగా ఎదిగాడంటే మేమంతా ఎంతో
ఆనందిస్తున్నాము. మొదటి సినిమా "పునాదిరాళ్ళు" లో ఓ చిన్న
వేషంతో సినిమాల్లో గట్టి పునాదిని ఏర్పరుచుకొన్నాడు మన ఆలీ.
"సిరిసిరిమువ్వ" హిందీ వర్షన్ రాజమండ్రిలో షూటింగ్ జరిగినప్పుడు
మా రాజమండ్రి అమ్మాయి జయప్రద పుట్టినరోజు అప్సర ఆడిటోరియం
లో జరిగింది.ఆ నాటి కార్యక్రమంలో దర్శకుడు శ్రీ విశ్వనాధ్ గారితో
బాటు హీరో రిషికపూర్,శశికళ మొదలైన హిందీ నటీనటులు కూడా
పాల్గొన్నారు.ఆ కార్యక్రమాన్ని మా మిత్రుడు , నటుడు, ఆంధ్రాకిషోర్
గా పేరుపొందినగాయకుడు శ్రీపాద జిత్ మోహన్మిత్రా సారధ్యంలో జరిగింది.
ఆ సభలో చిన్నారి ఆలీ, మొహమ్మూద్ డ్యాన్స్ చేసి అందరి మెప్పూ
పొందాడు. ఆలీ నాన్న గారు కష్టజీవి.టైలరింగ్ చేస్తూ నలుగురు ఆడ
పిల్లలను, అబ్బాయి ఆలీని పోషించారు. సినిమాల్లో అంచలంచలుగా
పెరిగి ఆలీ ప్రయోజకుడయ్యాడు.తల్లి దండ్రులను హైదరాబాదు తీసు
కువెళ్ళాడు. అక్కాచెల్లెళ్ళకు పెళ్ళీల్లు జరిపించాడు. నిర్మాత అచ్చిరెడ్డి
"యమలీల" చిత్రం లో ఆలీకి హీరో వేషం ఇచ్చి పొత్సహించారు. ఆలీ
తెర మీద కనిపించగానే ప్రేక్షకుల ముఖంనవ్వుల్తో చేటంతవుతుంది.
ఎన్న చేటన్నా, అక్కుంబక్కుం అంటూ వింత ప్రయోగాలు చేసినా అది
ఆలీకే చెల్లింది. ఇంత ఉన్నత స్ఠితికి ఎదిగినా ఆలీ ఇంకా అనుకువగానే
వుంటాడు.అదే అతనికి,అతని కుటుంబానికి శ్రీరామ రక్ష. అన్నట్టు
ఈ రోజు తేదీ కూడా ప్రత్యేకమే! గమనించారా! 10-10-10 !!!

5 comments:

  1. మన తెలుగు పరిశ్రమకు దొరికిన ఒక విలక్షణమైన హాస్య నటుని గురించి తెలియచేశారు. ధన్యవాదములు "సురేఖ" గారూ. అలీకి జన్మదిన శుభాకాంక్షలు. ఆయన మరిన్ని మంచి మంచి సినిమాలలో నటించి ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలని అకాంక్షిస్తున్నాను.

    ReplyDelete
  2. ఆలీ...
    నీ నవ్వుల కాలం
    పదికాలాలు బతకాలి..
    నీవు నవ్వుతూ
    పది మందికీ 'ఫన్ 'చాలి

    ReplyDelete
  3. డియర్ శ్రీ అప్పారావు గారు, కరువుదీరా మీ బ్లాగులన్నీ చూసి arrears complete చేసా. హేపీ. ఎలాగైనా మీది research work. మూల మూలల్నించి విషయ సేకరణ చేసి అందిస్తున్న మీ కృషికి జోహార్లు. keepitup. అన్నీ బాగున్నాయి. ప్రస్తుతానికి శలవు...........దినవహి

    ReplyDelete
  4. అభినందనలతో అభిమానిస్తున్న మితృలందరికీ
    ధన్యావాదాలు.

    ReplyDelete
  5. విచిత్ర భాష మాట్లాడడం, అరుదైన పదప్రయోగాలు చెయ్యడం, వాయిస్ మాడ్యులేషన్‌లో వైవిద్యం అన్నీ ఆలీకే చెల్లింది. ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు.

    ReplyDelete