Thursday, October 21, 2010

ఇవి, ఇ.వి.వి. కొంటె సమాధానాలు !

ఇ.వి.వి. కొంటె సమాధానాలు !
!

దర్శకుడు ఇ.వి.వి.సత్యనారాయణగారిని మీదే దేశం అని అడిగితే
"నవ్విస్తాన్" అంటారేమో!! ఆయన హాస్యం కాస్త మోటుగా వుండొచ్చేమో
గాని ఆయన తీసిన హాస్య చిత్రాలంటే మోజు పడే వారే ఎక్కువ.ఇంతకు
ముందు నా బ్లాగులో పరిచయం చేసిన "వెన్నముద్దల" జనార్దనమహర్షి
గారు "హాసం" పత్రిక కోసం ఇ.వి.వి.ని ఇంటర్వ్యూ చేస్తూ కొన్నిప్రశ్నలు
అడిగితే ఆయన ఇచ్చిన తుంటరి సమాధానాలు, మీకోసం
.
>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>
? మీ పుట్టిన రోజు?
* జూన్ పది
? ఏ సంవత్సరం?
* ప్రతి సంవత్సరం
? ఎందుకు పుట్టారు?
*మా ఆవిడ్ని కట్టుకుందామని...మంచి సినిమాలు తీసి పదిమందినీ
ఆ కట్టుకుందామని.
? ఏం చదివారు?
* ఈనాడు, వార్త, ఆంధ్రజ్యోతి
? సినిమా ఫీల్డ్ కు ఎందుకు వచ్చారు?
* ’ఫీల్డే’ కదా దున్నేద్దామని.
? పెళ్ళెందుకు చేసుకున్నారు?
* ఆర్యన్ ని, నరేష్ ని కందామని
? వాళ్ళనెందుకు హీరోలను చేసారు?
* చేతిలో ఎప్పుడూ ఇద్దరు హీరోలుంటారని
? మీ తొలి చిత్రానికి "చెవిలో పువ్వు" అని ఎందుకు పెట్టారు?
* నాకు పెడతారని తెలీక...
? మీ రెండో చిత్రానికి "ప్రేమ ఖైదీ" అని ఎందుకు పెట్టారు?
* ప్రేక్షకుల గుండెల్లో ప్రేమఖైదీ అవ్వాలని.
? మీరు ప్రతిసినిమాకి ఫారిన్ ఎందుకెళతారు?
* పగలు షూటింగ్,నైట్ షాపింగ్స్..చేసుకుందామని.
? మీరెవరైనా హీరోయిన్ని గిల్లారా?
* రెండు మూడు సార్లు టైటానిక్ హీరోయిన్ని గిల్లాను (కలలో)
? కలలో సరే, మరి ’లోకల్’లో?
* ఆ ఒక్కటీ అడక్కు
? "ఏవండీ..ఆవిడొచ్చింది" అని ఎవరి గురించైనా మీతో మీవాళ్ళన్నారా?
* ప్రతి రోజూ మా అసిస్టెంట్ డైరెక్టర్స్ అంటూనే ఊంటారు-హీరోయిన్స్
వచ్చినప్పుడు.
? మీకెలాంటి కధలంటె ఇష్టం?
* మా ఆవిడకి చెప్పే కట్టు కధలు.
? మీకు ఎలాటి సినిమాలంటే ఇష్టం?
* వందరోజుల సినిమాలంటే
? ఖాళీ టైములో ఏం చేస్తుంటారు?
* ’ఖాళీ’గా ఉంటాను.
? మీరు చాలా సినిమాల్లో "తాళి"ని తెంచారు..కామెంట్?
* పదికాలాలపాటు తీసినోడి,కొన్నోడి భార్యమెడలో "తాళి" పవిత్రంగా
ఉండాలని.
? మీరు నిర్మాత ఎందుకయ్యారు?
* ఇ.వి.వి ని డైరెక్టరుగా పెట్టుకుందామని.
? మీకు నచ్చిన నిర్మాత?
* నా ’రామానాయుడు’ గారు.
? మీకు నచ్చిన హాస్యనటుడు?
* మా "అప్పుల అప్పారావు"
? మీకు నచ్చని వాళ్ళు?
* బ్రేక్ టములో వచ్చి నిద్ర పోనివ్వని వాళ్ళు.
? మీకు నచ్చేవాళ్ళు?
* రికార్డు బ్రేక్ చేసే సినిమాలు తీసి నిద్రపోనివ్వని వాళ్ళు.
? మీ కిస్టమైన ప్లేస్?
* స్పేస్
? మీ కిస్టమైన పండు?
* చింతపండు
? మీకిస్టమైన దేముడు?
* నాతో సిన్మాతీసే ప్రతి ప్రొడ్యూసర్ దేముడే
? మగాడికి పెళ్ళి అవసరమా?
* ఒక సారి అయ్యాక...అనవసరం
? మగాడికి డబ్బు అవసరమా?
* ఆరేడు తరాలకి సరిపడే సంపాదించాక..అనవసరం
? ఈ ప్రపంచంలో అందమైనది?
* మా అమ్మ...
?బిన్ లాడెన్ వచ్చి సినిమా తియ్యమంటే తీస్తారా?
* వందకోట్లు ఖర్చు పెట్టించి సూపర్ ఫ్లాప్ తీస్తా
? మీరు ఒక్క రోజు సి.యం. అయితే?
* నారా చంద్రబాబునాయుడ్ని పర్మనెంట్ సి.యం.గా చేస్తా
? యూత్ కి మీరెచ్చే సలహా?
* వెధవ వేషాలు వెయ్యొద్దు.
? చివరగా ఏమైనా రెండు ముక్కలు చెప్పండి?
* బై...బై..
>>>>>>>>>>>>>>>>>>>>>>>>
సరదాగాసాగిన ఈ తుంటర్వ్యూ "హాసం" హాస్య-సంగీత పక్ష పత్రిక
1-15 జూన్ 2003 సంచిక సౌజన్యంతో...

*

5 comments:

  1. superb andii...bhale timing kada!! I really like it :))

    ReplyDelete
  2. ఇ వి వీ యెందుకు రాసారు ?
    అంటే అందరూ అంటారు బావుంది సారు
    ఓ హాస్య ప్రహసనంలా వుంది. నిజం.

    ReplyDelete
  3. చాలా చక్కటి వ్యాసం. మీ బ్లాగ్ చదివినప్పుడల్లా డల్లుగా వుండే మూడ్ డిలైటు అయిపోతుంది .మీ దగ్గర అన్ని హాసం పత్రికలూ వున్నాయా సార్ !నేను రాసిన రెండు మూడు ఆర్టికల్స్ 'బ్రహ్మానందం బ్యాంకు కెళితే '-ఎల్.బి.శ్రీరామ్ సినిమా తీస్తే -వున్న పత్రికలూ ఆకాశవాణి హైదరాబాద్ వారి దగ్గరికి దాకా వెళ్లి మిస్సయిపోయాయ్.వుంటే వాటి కాపీ ఫైల్ ని దయచేసి నా karlapalwm2010@gmail.com కి పంపించ గలరా!-కర్లపాలెం హనుమంత రావు

    ReplyDelete
  4. అ.రావుగారూ,
    మీ తీపికబురు కళ్ళుమూసుకొని చదివా.
    ఎందుకో మీకు తెలుసు...ఎప్పుడూ కాకపోయినా
    అప్పుడప్పుడైనా ... అధరం మధురం, వదనం
    మధురం, ఓ హనుమంతరాయా సర్వం
    మధురం అంటున్నారు మా డాక్టరుగారు.
    ఓ పంచదార పద్యం...
    చిక్కని పాలపై మిసిమిజెందిన మీగడ పంచదారతో
    మెక్కినభంగి నీ విమలమేచక రూపసుధారసంబు నా
    మక్కువ పళ్ళెరంబున సమాహితదాస్యమనేటి దోయిటన్
    దక్కెనటంచు జుఱ్ఱెదను, దాశరథీ ! కరుణాపయోనిధీ !

    తీపిగా...కాదు..కాదు చేదుగా వుంది మీ రచన. నోట్లో
    ఆ పదం వుండకూడదు కదండీ మరి....శలవు...దినవహి

    ReplyDelete