Thursday, January 27, 2011

కళారత్న-మన మహిళా కార్టూనిస్ట్





ఎంత చక్కని వార్త. తెలుగుమహిళా కార్టూనిస్టులు చాలా తక్కువ
మంది. వారిలో అశేష కార్టూన్ ఇష్టుల అభిమానాన్ని చూరగొన్న
ఏకైక కార్టూనిస్ట్ రాగతి పండరి గారు. ఆమె కార్టూనిస్టుగా మొదటి
సారిగా "కళారత్న" అవార్డు అందుకుంటున్నారు. రాగతి పండరిగారు
1972లో ఎనిమిదేళ్ళ వయసులోనే కార్టూన్లు గీయడం మొదలు
పెట్టారు. ఆమె కార్టూన్ కధలు, సింగిల్ పేజీ కార్టూన్లు, రాజకీయ
చెదరంగం, ఇద్దరు అమ్మాయిలు, చెవిలో పువ్వు లాంటి శీర్షికలతో
తెలుగు వార పత్రికలలో అనేక కార్టూన్లు వేశారు.
"నా గురించి నేను...." అన్న పేరుతో కుమారి రాగతి పండరి
ఆత్మ కధ వ్రాసారు. ఆపుస్తకాన్ని ఆమెఎంతో అభిమానంతో నాకు
పంపారు. ఈ పుస్తకంలో శ్రీ జయదేవ్ గారు వ్రాసిన ముందు మాట
ఆయన స్వదస్తూరీతో ప్రచురించడం చాలా బాగుంది. ఆయన ఇలా
అన్నారు. " ఒక గీత, ఒక రాత, ఒక పద్ధతి-వీటికి మారు పేరే రాగతి
పండరి. తెలుగు పత్రికా ప్రపంచంలోనికార్టూన్ సామ్రాజ్యానికి ఆమె
మకుటంలేని మహారాణి. రత్న ఖచితమైన కార్టూన్ సింహాసనాన్ని
అతి చిన్న వయసులోనే అధిష్టించి, తన సృజనాశక్తితో, వాడి తగ్గని
తన్ క్రోక్విల్ పాళీతో హాస్యరసాన్ని పొంగించి, మధించి, ఆ సారంతో
హాస్యపుష్ప వనాల్ని గుబాళింపజేసి తెలుగు పాఠకుడి వదనం మీద
నవ్వుల జల్లులు కురిపిస్తూ వీర విహారం చేస్తున్న తెలుగు జాతి
గర్వించ దగిన ఏకైక కార్టూనిస్టు, కుమారి రాగతిపండరి. ప్రపంచంలోనే
ఆమె వంటివారు మరొకరు లేరు"
మితృలు శ్రీ జయదేవ్ చెప్పిన ఈ మాటలు అక్షరాల నిజమని
నిరూపిస్తూ ఆమెకు కళారత్న పురస్కారం లభించినందుకు కుమారి
రాగతిపండరిని తెలుగు కార్టూనిస్ఠుల,కార్టూన్ ఇష్టుల తరఫున నా
శుభాభినందనలు తెలియజేస్తున్నాను.
నాగురించి నేను లో ఆమె ఆత్మ కధతో బాటు ప్రతి ముందు పేజీ
లోనికార్టూన్లు అలరిస్తాయి!.

5 comments:

  1. ' కళారత్న ' రాగతి పండరి గారికి కళాభినందనలు

    ReplyDelete
  2. కళా రత్న అవార్డు వచినందుకు పండరి గారికి అభినందనలు

    ReplyDelete
  3. ' కళారత్న ' రాగతి పండరి గారికి CONGRATS.

    ReplyDelete
  4. కళారత్నకుమారి రాగతి పండరి గారికి అభినందనలు.
    కార్టూనిస్ట్ గా ఎంతో గర్వపడుతున్నాను.

    ReplyDelete
  5. రాగతి పండరితో ముఖాముఖి ఇక్కడ చదవొచ్చు
    http://arunapappu.wordpress.com/2011/02/01/%E0%B0%95%E0%B0%B3%E0%B0%BE%E0%B0%B0%E0%B0%A4%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%B0%E0%B0%BE%E0%B0%97%E0%B0%A4%E0%B0%BF-%E0%B0%AA%E0%B0%82%E0%B0%A1%E0%B0%B0%E0%B0%BF/

    ReplyDelete