Saturday, January 29, 2011

ఈ దినం , దిన పత్రికల దినం !


ఇప్పుడు న్యూస్ చానళ్ళు కుప్పలు తెప్పలుగా వచ్చినా, అనుక్షణం పగలు కొట్టే
వార్తలు ( అదే నండి, బ్రేకింగ్ న్యూస్ ) అందిస్తున్నా, ఉదయం లేవ గానే వార్తా
పత్రికల కోసం ఆతృతతో ఎదురు చూసే పాఠకులు మాత్రం తగ్గలేదు. 1780
జనవరి 29 న హికీస్ బెంగాల్ గెజిట్ విడుదలయింది. ఆ జనవరి29ని వార్తా పత్రిక
దినోత్సవంగా గుర్తించడం జరిగింది.1851 లో దాదాభాయ్ నౌరోజీ ఒక రాజకీయ
పత్రికను ప్రారంభించారు. ఇప్పుడు భారత దేశంలో దాదాపు డజను ఆంగ్ల దిన
పత్రికలు ప్రచురించబడుతున్నాయి. బ్రిటిష్ వారు పయనీర్, టైమ్స్ ఆఫ్ ఇండియా,
స్టేట్స్ మన్ పత్రికలను ప్రచురించారు. అటు తరువాత ది హిందు, ఇండియన్
ఎక్స్ ప్రెస్, హిందుస్తాన్ టైమ్స్, అమృతబజార్ పత్రిక, నేషనల్ హెరాల్డ్,ది మెయిల్ పత్రికలు
మొదలయ్యాయి. తెలుగులో ఆంధ్ర పత్రికను విశ్వదాత కాశీనాధుని నాగేశ్వరరావు
ప్రారంభించారు. ఎక్స్ ప్రెస్స్ గ్రూప్ నుండి ఆంధ్రప్రభ మొదలయింది. అటుతరువాత
ఆంద్రజ్యోతి, నార్ల వెంకటేశ్వరరావు సంపాదకత్వంలో వచ్చింది. రామోజీరావు
"ఈనాడు" పత్రికను 5000ల కాపీలతో ప్రారంభించి అనతి కాలంలోనే అత్యధిక
సర్కులేషన్ కలిగిన దిన పత్రికగా మలిచారు.
ఇప్పుడు తెలుగు దిన పత్రికలలో అనేక మార్పులు చోటు చేసుకున్నాయి.
ఆదివారం అనుబంధం పుస్తక రూపంలో రావటం, జిల్లావారిగా జిల్లా అనుబంధాలు
ప్రతి రోజూ ప్రచురించడం, ఆదివారం మాత్రమే ఇదివరలో ప్రచురించే సినిమా శిర్షికను,
స్త్రీల శిర్షికను ప్రతి రోజూ ప్రచురించడమే కాకుండా రంగుల్లో దిన పత్రికలను ముద్రించడం
మొదలయింది. దిన పత్రికలలో మరొ ఆకర్షణ రాజకీయ కార్టూన్లు. ముఖ్యంగా
ప్రతి రోజూ మొదటి పేజీ క్రింద వచ్చే పాకెట్ కార్టూన్ పాఠకుల దృష్టిని ఆకర్షిస్తుంది.
ఈనాడు లో శ్రీధర్ కార్టూన్, కోసమే పత్రికను కొనే వాళ్ళున్నారు!! పూర్వం ఇంగ్లీష్
బాగా నేర్చుకోవాలంటే హిందూ పత్రికను చదివే అలవాటు చేసుకోమనే వారు.
ఈ రోజు దిన పత్రికలరోజే కాదు ప్రతి రోజూ దినపత్రికల రోజే!! ఎమర్జన్సీ చీకటి
రోజుల్లో ఇండియన్ ఎక్స్ ప్రెస్ సాహసోపేతంగా అనాటి అక్రమాలను ధైర్యంగా
పాఠకులముందుంచింది. అలానే హిందూ పత్రిక బోఫర్సు కుంభకోణాన్ని
డాక్యుమెంట్లతో సహ ప్రచురించింది.
మన వర్తాపత్రికలకు జేజేలు తెలియచేద్దాం !!
ఇక్కడి కార్టూన్ శ్రీ బాపు గారి సౌజన్యంతో.

2 comments:

  1. dinam ante TADDINAM-ani ardhamande

    ReplyDelete
  2. ఎలక్ట్రాన్ మీడియా వచ్చిన మొదట్లో అవి చేసిన హడావుడికి అచ్చు పత్రికలు కాస్త తడబడ్డాయి కానీ కాలక్రమేణా మళ్ళి పుంజుకుని ఇప్పుడు ఒక సంతృప్తి కరమయిన స్థానంలో స్థిర పడ్డాయి.ఏమయినా ఉదయాన్నే లేచి పొగలు కక్కే కాఫీ తాగుతూ తాజా పత్రికలోని నిన్నటి విశేషాలని వివరంగా చదవడం లోని తృప్తి టీవీవార్తల వల్ల కలగనే కలగదు.ఇది ప్రపంచ వ్యాప్తంగా నిరూపణ అయిన సత్యం.ఈ వారం స్వాతిలో శ్రీనివాసరావు గారూ ఈ విషయం మీద చాలా చక్కటి వివరణాత్మకమయిన వ్యాసం రాసారు.మీ కంట పడిందా అప్పారావు గారూ!మీ సందర్భోచితమయిన టపాకి నా ధన్యవాదాలుసార్!

    ReplyDelete