Sunday, April 11, 2010

బాపు-రమణల పురాణాల గీతలు-రాతలు





1963 జనవరి 26వ తేదీన శ్రీ అక్కినేని చేతుల మీదుగా 'జ్యోతి' నవర(మా)స
పత్రిక ప్రారంభమయింది. సర్వశ్రీ బాపు,ముళ్లపూడి, నండూరి రామమోహనరావు,
ఆరుద్ర,వి.ఏ.కె.రంగారావు,రావి కొందలరావు,కీ"శే" యమ్వీయల్ మొ" అతిరధ
మహారధుల సారధ్యంలో వెలువడిన 'జ్యోతి' ప్రతి పేజీ ఒక రస గుళికే!ఆనాటి"జ్యోతి'
శ్రి కృష్ణ జయంతి సంధర్భంగా కృష్ణుడి పై కార్టూనులు, హాశ్య రచనలతో ప్రత్యేక సంచిక
వెలువడింది.
'పురాణ హాస్యము' పేరిట ఆనాడు 'జ్యోతి'లోని కొన్ని రసగుళికలు ఆస్వాదించండి.

శ్రీ కృష్ణుడు : మా యింట్లో రోజూ సత్యాగ్రహమే!

విష్ణుమూర్తి : ఏక పత్నీ వ్రతంమీద మోజు తీరి కృష్ణావతారం ఎత్తాను.

కుంభకర్ణుడితో రాక్షసులు -లేక లక్ష్మణుడితో ఊర్మిళ :-
"ఏమండోయ్, నిదుర లేవండోయ్."

సూర్యుడు బాల హనుమంతుడితో:- "ఏవిటోయ్,మింగే సేట్టు చూస్తున్నావ్?"

శచీదేవి ఇంద్రుడితో:-"అబ్బ; ఒళ్ళంతా కళ్ళుచేసుకొని అలా చూడకండి, సిగ్గేస్తుంది"

రాముడితో బాణం :-"ఒక్క నిముషంలో వచ్చేస్తా స్వామీ!"

విష్ణువు బ్రహ్మతో :- "ఈ రహస్యం మూడో కంటి వాడికి తెలియకూడదు"

ఏకలవ్యుడితో తల్లి:- "తప్పమ్మా,బొటన వేలు అలా నోట్లో పెట్టుకొని చీక్కోకూడదు,ఊడి

పోతుందంతే"

రతీదేవి మన్మధుడితో :-"ఏవండీ ! ఈమధ్య బొత్తిగా కనబట్టం లేదూ ?"

సరస్వతి పిలిస్తే బ్రహ్మ వెనక్కి తిరిగి చూస్తాడా ?

4 comments:

  1. "సరస్వతి పిలిస్తే బ్రహ్మ వెనక్కి తిరిగి చూస్తాడా ? "
    అద్భుతం. ఈ రోజు పొద్దున్నే ఆదివారపు విశ్రాంతిని హాస్యంతో నింపేసింది ఈ వాక్యం. మీ దగ్గర ఉన్నదేమో తరగని గని . ఇలాంటి ఆణి ముత్యాలు ఇంకా ఇంకా వెలికి తీస్తూనే ఉండండి.

    ReplyDelete
  2. శివరామ ప్రసాద్ గారూ,
    నా బ్లాగు ప్రారంభించమని ప్రోత్సహించింది భమిడిపాటి ఫణిబాబు గారు,మీరూ,
    నేర్పింది, మా అమ్మాయి లాటి శ్రీమతి జ్యోతి.మీ అందరికి ధన్యవాదాలు.

    ReplyDelete
  3. విష్ణువు బ్రహ్మతో :- "ఈ రహస్యం మూడో కంటి వాడికి తెలియకూడదు"

    అద్భుతమండీ, ఇంకా మీరు ఇలాంటివి ఎన్నెన్నో మాకు అందిస్తారని ఆశిస్తున్నాను

    ReplyDelete