Friday, April 23, 2010

గోదారి చెంతన గజ్జెకట్టిన తార వహీదా రెహ్మాన్ !



"రోజులు మారాయి" సినీమాలో ’ఏరువాకా సాగారో రన్నో చిన్నన్న పాట ఆ రోజుల్లో నే
కాదు, ఈనాటికీ మరచిపోలేము. జిక్కీ పాడిన ఆ పాటలో మొదటిసారిగా తెలుగు తెర
పై అగుపించిన పదహారేళ్ళ అమ్మాయి అందర్నీ ఆకర్షించింది. ఆ అమ్మాయే హిందీ
తెరపై ఓ వెలుగు వెలిగిన వహీదా రెహ్మాన్. వహీదా గోదావరీతీరం (రాజమండ్రి) నుంచే
సినీమాతెరకు పరిచయమైంది. ఆమె తండ్రి జనాబ్ యం.ఏ.రెహ్మాన్ కొంతకాలం ప్రభుత్వ
ఉద్యోగిగా రాజమండ్రిలో పనిచేసారు. అప్పుడు వారి కుటుంబం రాజమండ్రిలోని దానవాయి
పేటలో ఉండేవారు. ఆమెకు రాజమండ్రి అన్నా, ఆమె నృత్య అభినయం చేసిన ’ఏరువాక"
పాటన్నా ఎంతో ఇష్టం. దేవానంద్ హీరోగా ’బొంబాయికా బాబు చిత్రంలో వహీదా నటిస్తూ
ఆ చిత్రానికి సంగీత దర్శకత్వం వహిస్తున్న యస్.డి.బర్మన్ చేత "ఏరువాకా సాగే" బాణీ ఇచ్చి
"బొంబయిసే ఆయాహై...బాబూ చిన్నన్నా" అనే పాటను ట్యూన్ చేయించుకొన్నదట వహీదా.
రాజమండ్రి నుంచి ఆమెను కలవడానికి వెళ్ళిన వారితో ఆమె స్వచ్చమైన తెలుగులో
మాట్లాడుతుందట. హిందీ చిత్ర సీమలో వహీదా గురుదత్ తీసిన "సీ.ఐ.డీ"తో ఆమె తొలిసారిగా
హిందీ చిత్రాలలోకి అడుగుపెట్టారు. తెలుగువాళ్ళు గర్వించవలసిన విషయం వహీదాకు
యన్టీయార్ జాతీయ పురస్కారం లభించడం.
వహీదా నటించిన "కొహ్రా" సస్పెన్స్ త్రిల్లర్ చిత్రం రాజమండ్రి కృష్ణా టాకీస్ ( ఇప్పుడు సాయి
కృష్ణా) లొ శతదినోత్సవం జరుపుకొంది. రాజమండ్రి సినీ చరిత్రలో వందరోజులాడిన తొలి హిందీ
చిత్రం వహీదా రెహ్మాన్దే కావడం ఒక విశేషం ! రాజమండ్రిలో వుంటున్నప్పుడే ఆమె కూచిపూడి,
భరతనాట్యం నేర్చుకొంది. ఆ రోజుల్లో కొందరు మత పెద్దలు ఇందుకు అభ్యంతరం చెప్పినా
కుటుంబ సభ్యులు ఆమె అభిలాషకు ఎదురు చెప్పలేదు. పై స్టిల్ల్ అన్నపూర్ణా వారి "బంగారు
కలలు " చిత్రం లో వహీదా, యస్వీ.రంగారావు

2 comments:

  1. చాలా విషయాలు చెప్పారండి..వహీదా అంటె నాకు చాలా ఇష్టం ..:)

    ReplyDelete
  2. రాజమండ్రి నుంచి ఆమెను కలవడానికి వెళ్ళిన వారితో ఆమె స్వచ్చమైన తెలుగులో మాట్లాడుతుందట...ఆమె నాన్నగారు వైజాగులో కూడా ఉద్యోగం చేసారు కదండి.ఆమె నటించిన ఒక్క సినిమాలోనూ స్వంతగొంతుతో డబ్బింగు చెప్పలేదు కదా?ఆమె మాతృభాష తమిళమంటారు నిజమేనా?

    ReplyDelete