Friday, December 10, 2010

బాపు - రమణ -బొమ్మలు - కధలు





శ్రీ బాపు, ముళ్లపూడి వెంకట రమణ గార్లు కలసి మెలసి 60 ఏళ్ళ
క్రితం ( పత్రికా లోకంలో స్వర్ణ యుగమనే చెప్పాలి) వివిధ పత్రికలలో
గీసి రాసిన ఆణిముత్యాలన్నీ పుట్టల్లాంటి పెట్టెల్లోంచి త్రవ్వి తీసి
464 పేజీల గట్టి " అట్ట " హాసం తో "మంద " హాసంగా అచ్చొత్తి
రచన శాయి గారు అభిమానులకు అందించారు. 1960 ల నుంచి
90 లదాకా ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, చందమామ,విజయచిత్ర,యువ,
జ్యొతి మాస పత్రిక, లలో ప్రచురించిన ఈ ఇద్దరుమితృల బొమ్మల
కధలను ఆస్వాదించవచ్చు. చందమామ లో బాపు వేసిన "’గలివర్
ట్రావల్స్" రంగుల బొమ్మల కధ, బంగారం-సింగారం, బుడుగు,రాజూ-
రైతు,బుడుగు "రాచ్చసుడూ పదమూడో ఎక్కం" కధ ఇలా ఒకటేమిటి
ఎన్నోఎన్నేన్నో! భాపు బొమ్మలతో గీసిన సినిమా స్క్రిప్ట్ మరెన్నో!!
ఈ పుస్తకం మీ దగ్గర లేపొతే వెంటనే వాహిని బుక్ ట్రస్ట్, 1.9.286/3,
విద్యానగర్, హైదరాబాద్ 500044 కు వెంఠనే వ్రాసి తెప్పించుకొనండి!
మరో మాటండోయ్! ఈ విలువైన పుస్తకం ఆఖరి పేజీలో నా పేరూ చోటు
చేసుకుందోచ్ !!, ప్రముఖులతో బాటు.

1 comment: