Wednesday, March 09, 2011

జపాన్ లో మన శ్రీధర్





మన తెలుగు కార్టూనిస్టులు చాలా మంది విదేశాల్లో కూడా ఎన్నో కార్టూన్
ప్రదర్శనలలో పాల్గొని బహుమతులు ప్రశంసలు పొందారు. ఈనాడు కార్టూనిస్ట్
శ్రీధర్, జపాన్ కార్టూనిస్ట్స్ అసొసియేషన్ సహకారంతో "జపాన్ ఫౌండేషన్
ఫోరమ్" 1955లో జపాన్లో Asian Cartoon Exhibition ఏర్పాటు చేసిన.
ప్రదర్శనలో మన దేశం తరఫున పాల్గొన్నారు. మన దేశంతో బాటు పదకొండు
దేశాల కార్టూనిస్టులు ఈ ప్రదర్శనలో పాల్గొన్నారు. జపాన్ ఫౌండేషన్ ఆహ్వానం
అందుకొని అప్పుడు శ్రీధర్ జపాన్ వెళ్ళి వచ్చారు. మన ఆశియా మహిళలు
అనే శీర్షిక మీద స్త్రీల సమస్యలపై శ్రీధర్ సంధించిన వ్యంగాస్త్రాలుగా ఈ కార్టూన్లు
కలకాలం నిలచి పొతాయి. ప్రఖ్యాత కార్టూనిస్ట్ శ్రీ శ్యాంమోహన్ .నిర్వహించే
స్మైల్ పత్రికను నిన్న మరోసారి చూస్తుండగా అందులో అగుపడ్డ శ్రీధర్ కార్టూన్లు,
(నిన్ననే మనం మహిళాదినోత్సవం జరుపుకొన్నాము) చూసి మీతో పంచుకోవాలని
మీ ముందు వుంచుతున్నాను.
Courtesy: Sri Syammohan's "SMILE"

5 comments:

  1. . 1995 బదులుగా 1955 అని వ్రాశాను. పాతకాలం మనిషినికదా?
    క్షమిస్తారుకదూ?!

    ReplyDelete
  2. నేను ఆశ్చర్యపోతూనే టపా అంతా చదివాను,1955 లో ఎలా వెళ్ళారా అనుకుంటూ. కింద మీ కామెంటు చూసి నవ్వొచ్చిందండీ.

    మంచి కార్టూన్లు అందించారు. ధన్యవాదాలు. మొదటి సారి నేను శ్రీధర్ గారి ఫోటో చూసాను . కానీ ఇద్దరిలో ఆయనని ఎలా గుర్తు పట్టడం? గూగుల్ చేసి నల్ల జుట్టాయన అని నిర్ధారించుకున్నాను :).ఇంతకీ ఆయన పక్కనున్నది ఎవరు?

    ReplyDelete
  3. @ శ్రీధర్ గారిని మొదటి సారి ఇలా మీ బ్లాగ్ ద్వారా చూడగలిగాను. ధన్యవాదాలు
    గర్భస్థ ఆడశిశువు చిత్రం మనసు మెలిపెట్టింది. పరిస్థితుల్లో అప్పటికీ ఇప్పటికీ ఏ మార్పూ లేకపోవడమే దురదృష్టం

    @ rishi garu
    ఆ పక్కనున్న ఆయన కూడా చిత్రకారులేనండీ. ఆయన గురించి తెలుసుకోవాలంటే ఈ బ్లాగ్ లోనే కొంచం పైకి చూస్తే "నా గురించి" అని ఉంటుంది. అక్కడ చూడండి. :)

    ReplyDelete
  4. శంకర్ గారూ,
    ఆయనే అనుకున్నాను కానీ మీరేనా అని అడిగితే బాగోదని......మీ సమాధానం చమత్కారంగా ఉంది

    ReplyDelete
  5. సుపెర్ గ ఉన్నై. Sridhar is very talented.

    ReplyDelete